మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఏపీకి అమరావతి రాజధానిగా ఉండేది. అయితే జగన్ సీఎం అయ్యాక ఏపీ వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటుకు వైసీపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జగన్ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి తరలించడంతో ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు వచ్చిపడుతున్నాయి.
Also Read: జగన్ వెంట పడుతున్న ఈడీ
జగన్ సర్కార్ అమరావతి నుంచి రాజధానిని తరలించడంపై పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ నిర్మాత అశ్వినీదత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడం ప్రభుత్వం చాలా సమయం తీసుకుంటుండటం చర్చనీయాంశంగా మారింది. అశ్వినీదత్ పిటిషన్ పై ఎలా కౌంటర్ దాఖలు చేయాలో తెలియక ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.
రాష్ట్ర విభజన తర్వాత గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి పెంచేందుకు ఏపీ సర్కార్ రన్‌వేను విస్తరించాలని భావించింది. దీనిలో భాగంగా ప్రభుత్వం ఆ ప్రాంతంలో భూసేకణ చేసింది. రన్‌వేకు అవసరమైన భూములు ఇచ్చినవారికి రాజధాని అమరావతిలో స్థలాలు కేటాయించేలా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో చాలామంది రైతులతోపాటు నిర్మాత అశ్వినీదత్.. నటుడు కృష్ణం రాజు తమ భూములిచ్చారు.
Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు..?
గన్నవరం ఎయిర్ పోర్టు కోసం అశ్వనీదత్ 39ఎకరాలు.. రెబర్ స్టార్ కృష్ణంరాజు 31 ఎకరాలిచ్చారు. అయితే ప్రస్తుతం అమరావతిలో రాజధాని లేకపోవడంతో తమ భూమి ఎందుకు పనికి రాదంటూ అశ్వినీదత్ కోర్టులో పిటిషన్ వేశాడు. ప్రభుత్వం తమ ఒప్పందానికి కట్టుబడకపోతే పరిహారం ఇవ్వాలని ఆయన కోర్టులో పిటిషన్ వేశాడు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
నిబంధనల ప్రకారం తాను ఇచ్చిన 39ఎకరాలకు రూ.210 కోట్లు చెల్లించాలని ఆయన కోరుతున్నాడు. అయితే ఈ పిటిషన్ పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుండా సాగదీత ధోరణిలో వెళుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ
పిటిషన్‌పై విచారణ పూర్తి స్థాయిలో జరగడంలేదు. అశ్వినీదత్ పిటిషన్ ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ దాఖలు చేస్తుందో వేచిచూడాల్సిందే..!