https://oktelugu.com/

CM KCR: సెక్రెటేరియట్‌లోనూ కేసీఆర్ మార్క్.. వచ్చే ఏడాది కల్లా నిర్మాణం పూర్తి..

CM KCR: ఏళ్ల నాటి కల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం.. అది సాకారం అయింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రంలో ప్రజలే కేంద్రంగా పాలన సాగుతోందని అధికార పక్షం చెప్తోంది. అయితే, ఆనాటి పాలకులు నిర్మించిన సెక్రెటేరియట్ అవసరం లేదని, నూతన సచివాలయ నిర్మాణానికి పూనుకున్నారు సీఎం కేసీఆర్. అత్యంత రహస్యంగా నిర్మాణ పనులు సాగుతున్నాయి. పనులు ఎక్కడి వరకు వచ్చాయి.. సీఎం కేసీఆర్ సెక్రెటేరియట్ పనులపై అధికారులకు ఏయే సూచనలిచ్చారు అనే విషయాలపై ఇంట్రెస్టింగ్ స్టోరి.. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 10, 2021 / 03:07 PM IST
    Follow us on

    CM KCR: ఏళ్ల నాటి కల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం.. అది సాకారం అయింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రంలో ప్రజలే కేంద్రంగా పాలన సాగుతోందని అధికార పక్షం చెప్తోంది. అయితే, ఆనాటి పాలకులు నిర్మించిన సెక్రెటేరియట్ అవసరం లేదని, నూతన సచివాలయ నిర్మాణానికి పూనుకున్నారు సీఎం కేసీఆర్. అత్యంత రహస్యంగా నిర్మాణ పనులు సాగుతున్నాయి. పనులు ఎక్కడి వరకు వచ్చాయి.. సీఎం కేసీఆర్ సెక్రెటేరియట్ పనులపై అధికారులకు ఏయే సూచనలిచ్చారు అనే విషయాలపై ఇంట్రెస్టింగ్ స్టోరి..

    CM KCR

    టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచనకు తగ్గట్లు నూతన సచివాలయానికి రూపం వస్తోంది. అయితే, పనులు ఎక్కడి వరకు వచ్చాయనేది తెలుసుకునేందుకు తాజాగా సీఎం కేసీఆర్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ క్రమంలోనే పలు సూచనలు చేశారు. సెక్రెటేరియట్ నిర్మాణంలో ఏ కాంక్రీట్ వాడాలో సూచించారు కేసీఆర్. ఎర్రకోట నిర్మాణానికి వాడిన ఆగ్రా ఎర్ర రాతిని గోడలకు వాడాలని చెప్పారు. సెక్రెటేరియట్ ఇప్పటికే ఓ రూపు దాల్చిందని, రేయింబగళ్లు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.

    నూతన సెక్రెటేరియట్‌లో రెండు అంతస్తుల్లో మంత్రుల చాంబర్లు ఉండబోతున్నాయి. సెక్రెటేరియట్ నిర్మాణంపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. సచివాలయం లోపల గోడలకు ఎటువంటి పెయింటింగ్ వేయాలి, కిటికీలు ఎటువంటివి ఉండాలనే విషయాలపైన సీఎం పలు సూచనలు చేశారు. సచివాలయ నిర్మాణంలో తెలంగాణ సొంత గుర్తింపు ఉండాలని సీఎం చెప్పారని వినికిడి. సీఎం ఆదేశాల ప్రకారం కాంట్రాక్టర్లు చాలా వేగంగా పనులు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. వచ్చే ఏడాది దసరా నాటికి సెక్రెటేరియట్ అందుబాటులోకి వస్తుందని అంచనా.

    Also Read: TRS: టీఆర్ఎస్‌కు ఇంత భయమా.. అందుకే క్యాంపు రాజకీయాలు?

    ఉమ్మడి ఏపీ సెక్రెటేరియట్‌ను కూల్చేసి మరీ నూతన సెక్రెటేరియట్ నిర్మాణానికి టీఆర్ఎస్ సర్కారు మొగ్గు చూపింది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సచివాలయాన్ని నిర్మిస్తోంది. ఏపీ సర్కారు హైదరాబాద్‌లో ఉన్న భవనాలన్నిటినీ తెలంగాణ సర్కారుకు ఇచ్చిన నేపథ్యంలో వాటన్నిటినీ కూల్చేసి సీఎం కేసీఆర్ తన దైన శైలిలో నూతన సచివాలయ నిర్మాణానికి పూనుకున్నారు. మంత్రులు, అధికారులు, ముఖ్యమంత్రి అందరూ కలిసి సచివాలయంలో ఉండేలా అత్యద్భుతంగా సచివాలయం నిర్మించాలనేది కేసీఆర్ ప్లాన్. వచ్చే ఏడాది సెక్రెటేరియట్ అందుబాటులోకి రానుంది. సచివాలయం అందుబాటులోకి వచ్చిన వెంటనే అందులోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందర సెక్రెటేరియట్ అందుబాటులోకి తీసుకురావాలని కేసీఆర్ భావిస్తున్నట్లు వినికిడి.

    Also Read: TRS MPs: టీఆర్ఎస్ ఎంపీల వ్యూహం బెడిసి కొట్టిందా?

    Tags