https://oktelugu.com/

Arvind Kejriwal- KCR: కేసీఆర్ కోసం కేజ్రీవాల్ ఏంటి కథ?

ఇటీవల సుప్రీం కోర్టు బ్యూరోక్రాట్‌ బదిలీల నియామకాలపై తీర్పు ఇచ్చింది. ఈ విషయంలో కేంద్రం పాత్ర కాదు, ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వమే ఆ అంశంలో నియంత్రణ కలిగి ఉంటుందని ఆదేశాలు ఇచ్చింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 27, 2023 / 10:25 AM IST

    Arvind Kejriwal- KCR

    Follow us on

    Arvind Kejriwal- KCR: ఆప్‌ అధినేత.. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పొత్తులకు చాలాదూరం. రాజకీయంగా తమ పార్టీ దేశంలో ఉన్న పార్టీలకు అతీతం అన్నట్లుగా వ్యవహిస్తారు. ఎవరికీ మద్దతు ఇవ్వరు.. ఎవరితోనూ పొత్తు పెట్టుకోరు. అవినీతి రహిత పార్టీ అని చెప్పుకుంటారు. కానీ, ఆ పార్టీ కొన్ని నెలలుగా అవితీతి మరకతో సతమతమవుతోంది. లిక్కస్కాంలో ఆ పార్టీ ప్రభుత్వం కూరుకుపోయింది. ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ఇప్పటికే అరెస్ట్‌ అయ్యారు. పార్టీ అధినేతతో ప్రమేయం కూడా ఉందని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌తో ఢీ అంటే ఢీ అన్నట్లుగా కొట్లాడుతున్నారు కేజ్రీవాల్‌. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కేంద్రం లాగేసుకుంటుంది. తనదాకా వస్తే కాని తెలయదు అన్నట్లు కేజ్రీవాల్‌ ఇప్పుడు మద్దతు కోసం దేశయాత్ర చేస్తున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలను కలుస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మమతాబెనర్జీ, ఉద్ధవ్‌ థాక్రేను కలిసిన ఢిల్లీ సీఎం.. కేసీఆర్‌ను కలిసేందుకు శనివారం హైదరాబాద్‌కు వస్తున్నారు. పార్లమెంట్‌లో ఈ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించాలని కోరనున్నారు.

    ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తున్న విపక్షాలు..
    ఇటీవల సుప్రీం కోర్టు బ్యూరోక్రాట్‌ బదిలీల నియామకాలపై తీర్పు ఇచ్చింది. ఈ విషయంలో కేంద్రం పాత్ర కాదు, ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వమే ఆ అంశంలో నియంత్రణ కలిగి ఉంటుందని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల ట్రాన్స్‌ఫర్, పోస్టింగ్‌లపై కేంద్ర ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్‌ తీసుకువచ్చింది. ఢిల్లీలో సర్వాధికారాలు మళ్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఢిల్లీలో పాలనాధికారాలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే ఉంటుందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసి సంగతిని కేజ్రీవాల్‌ గుర్తు చేస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన 8 రోజులకు కేంద్రం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి లెఫ్టినెంట్‌ గవర్నర్‌కి అధికారం కట్టబెట్టిందని కేజ్రీవాల్‌ ఆరోపిస్తున్నారు. ఈ ఆర్డినెన్స్‌ పార్లమెంట్‌లో చట్టం అయితే ప్రజాస్వామ్యానికి ఇబ్బంది అని కేజ్రీవాల్‌ అంటున్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను ఇప్పటికే కాంగ్రెస్‌తోపాటు బీజేపీని వ్యతిరేకించే పక్షాలన్నీ వ్యతిరేకించాయి.

    రాజ్యసభలో వీగిపోయేలా..
    రాజ్యసభలో బీజేపీకి పూర్తి మెజార్టీ లేదు. అందుకే అక్కడ పాస్‌ కావాలంటే ఇతర పార్టీల మద్దతు కావాలి. బీఆర్‌ఎస్‌ గతంలో బీజేపీ విషయంలో దూకుడుగా ఉన్నాం. ఇటీవల సైలెంట్‌ అయింది. దీంతో కేజ్రీవాల్‌ మద్దతు కోసం వస్తున్నారు. కేసీఆర్, కేజ్రీవాల్‌ మధ్య జరిగే క్రేజీ మీటింగ్‌లో గులాబీ బాస్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి వెళ్లే విషయంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మరి కేజ్రీవాల్‌కు స్పష్టత ఇస్తారా లేదా అన్నది వేచిచూడాలి. పార్లమెంట్‌లో బిల్లుపై ఓటింగ్‌ జరిగేటప్పటి పరిస్థితుల్ని బట్టి నిర్ణయం తీసుకుంటారని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.