Narendra Modi And Maithili Thakur: శాస్త్ర సాంకేతిక రంగాలను అభివృద్ధి కోసం వినియోగించాలి. కొత్త ఆవిష్కరణల కోసం ఉపయోగించాలి. అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయడానికి వాడుకోవాలి. అలాకాకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు.. అడ్డగోలు వ్యవహారాలకు వాడుకుంటే వాటి పర్యవసనాలు వేరే విధంగా ఉంటాయి.
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధ చుట్టూ తిరుగుతోంది. దీని ఆధారంగా ఎన్నో ఆవిష్కరణలు సాధ్యమవుతున్నాయి. క్లిష్టతరమైనవన్నీ సులభం అయిపోతున్నాయి. కృత్రిమ మేధ ద్వారా మనిషి చేయలేని పనులు కూడా చేస్తున్నాడు. అత్యంత దుర్భేద్యమైన వాటిని కూడా పరిష్కరించగలుగుతున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ శాస్త్ర సాంకేతిక రంగాన్ని ఉపయోగించి కొంతమంది దుర్మార్గులు దరిద్రమైన పనులు చేస్తున్నారు.. సభ్య సమాజం తలదించుకునే వ్యవహారాలకు పాల్పడుతున్నారు. అయితే ఇప్పటివరకు సినిమా రంగం వారిని మాత్రమే టార్గెట్ చేసుకున్న వీరంతా.. ఇప్పుడు ఏకంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకున్నారు.
ఇటీవల బీహార్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 25 సంవత్సరాల మైథిలి ఠాకూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించింది. ఈమె రామ భక్తురాలు. అప్పట్లో అయోధ్య రామాలయంలో రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు అద్భుతమైన పాటలు పాడింది. ఆమె పాటలకు నరేంద్ర మోడీ ఆశ్చర్య చకితులైపోయారు. పైగా ఆమె పాడిన పాటలకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు. ఎంతో అద్భుతంగా పాడిందని ప్రధానమంత్రి కితాబు కూడా ఇచ్చారు. పైగా నరేంద్ర మోడీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు టికెట్ కూడా ఇచ్చారు. ముస్లిం ఓటర్లు అధికంగా ఉండే నియోజకవర్గంలో మైథిలి పోటీ చేసి విజయం సాధించారు.
మైథిలి విజయాన్ని తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు కృత్రిమ మేధ ద్వారా పిచ్చిపిచ్చి వీడియోలు రూపొందించారు. నరేంద్ర మోడీ, మైథిలి ఠాకూర్ పై అత్యంత అసభ్యకరమైన కృత్రిమ మేధ వీడియోను రూపొందించారు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో చూసేందుకు అత్యంత దారుణంగా ఉంది. వాస్తవంగా కనీసం పోస్టు కూడా చేయలేని స్థితిలో ఉంది. ఈ వీడియోను రూపొందించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా కూడా గిట్టని వారి పని అని వారు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనాప్పటికీ దేశ ప్రధానమంత్రి మీద ఇటువంటి వీడియోను రూపొందించడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతోంది.