Hijab : కర్ణాటకతోపాటు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపిన ‘హిజాబ్’ వివాదంపై సంచలన తీర్పునిచ్చింది. హిజాబ్ ఆ మత ఆచారం కాదంటూ కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రితూరాజ్ అవస్థి తీర్పును ఇచ్చారు. ఈ క్రమంలోనే రితూరాజ్ ను చంపేస్తామంటూ కొందరు దుండగులు బెదిరింపులకు దిగారు.ఆయనతోపాటు తీర్పునిచ్చిన న్యాయమూర్తులను చంపేస్తామంటూ తాజాగా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో కర్ణాటక పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ తోపాటు న్యాయమూర్తులకు పటిష్ట భద్రత కల్పించారు.

ఇక హైకోర్టు జడ్జీలను బెదిరించిన వారిని గుర్తించారు. ఒక వీడియోను కర్ణాటక లాయర్ ఉమాపతికి పంపారు. ఆయన హైకోర్టు రిజిస్ట్రార్ కు ఫిర్యాదు చేశారు. కర్ణాటక చీఫ్ జస్టిస్ నడకకు వెళ్తారు కదా? అంటూ నిందితుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ కేసులో తమిళనాడుకు చెందిన ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరునల్వేలికి చెందిన తమిళనాడు తాహీద్ జమాత్(టీఎన్ టీజే) కమిటీ సభ్యులు కొవాయి రహ్మతుల్లా, తంజావూరులోని టీఎన్ టీజే మతబోధకుడు ఎస్. జమాల్ మహ్మద్ ఉస్మానీ అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కర్ణాటకలో తీవ్ర దుమారం రేపిన హిజాబ్ వివాదంపై ఈనెల 15న సీజే సహా ముగ్గురు జడ్జీల ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై తమిళనాడులోని ముస్లిం మత సంస్థలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగానే గురువారం ఒక వీడియో బయటకు లీకైంది. అందులో రహ్మతుల్లానే జడ్జీలనే బెదిరించాడు. ‘తప్పుడు తీర్పునిచ్చిన ఝార్ఖండ్ జడ్జి ఉదయం నడకకు వెళ్లి హత్యకు గురైన విషయం గుర్తుందా?’ అంటూ బెదిరించాడు. తమ మతంలో ఈ హిజాబ్ తీర్పుపై చాలా మంది కోపంగా ఉన్నారని.. ముగ్గురు జడ్జీలకు ఏమైనా జరిగితే తమ మీద నింద మోపేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని పేర్కొన్నాడు.
ఈ క్రమంలోనే కర్ణాటక పోలీసులు హైఅలెర్ట్ అయ్యారు. టీన్ టీజే మధురై జిల్లా అధ్యక్షుడు హబీబుల్లా, ఉపాధ్యక్షుడు అసన్ బాద్ షాలపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.తంజాబూరు టీఎన్ టీజే నేత రజీక్ మహ్మద్ పై కేసు పెట్టారు.
[…] Pakistan Prime Minister Imran Khan: పాకిస్తాన్ లో మరో సంక్షోభం రానుంది. ఇప్పటికే ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పై విమర్శల దాడి పెరుగుతోంది. ఆయన సారధ్యంలో పాక్ అభివృద్ధి సాధించడం లేదని పలువురి వాదన. దీంతో పాక్ లో ఏ సమయంలోనైనా ఇమ్రాన్ బాధ్యతలు తొలగించవచ్చనే అనుమానాలు వస్తున్నాయి. దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తనుందని తెలుస్తోంది. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ది ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ చీఫ్ నియామకం విషయంలో ప్రభుత్వానికి సైన్యానికి మధ్య విభేదాలు పొడచూపాయి. దీంతో ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ గా మొదట ఇమ్రాన్ సూచించిన వ్యక్తినే నియమించినా చివరకు సైన్యాధ్యక్షుడు ఖమర్ జావేద్ బాజ్వా సూచించిన మరో లెఫ్టినెంట్ జనరల్ నదీం అంజుమ్ కే పగ్గాలు అప్పగించారు. […]