https://oktelugu.com/

మీడియాపై కేసులు కరెక్టేనా?

ఆంధ్రప్రదేశ్ లో మీడియా గొంతు నొక్కేస్తున్నారు. సాక్షాత్తు మీడియాపైనే కేసులు పెట్టేస్తున్నారు. ఒక వ్యవహారంలో ఇద్దరి మాటలు రాసే మీడియాను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దీనికి ఎవరు బాధ్యులు అనే కోణంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకరి మీద మరొకరు దుమ్మెత్తి పోసుకోవడం కొత్తేమీ కాదు. సమాజంలో జరిగే తంతే. దానికి మీడియా ప్రమేయం ఉందని దానిపై కేసులు పెట్టడం ఏమిటని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. రాష్ర్టంలో పరిపాలన ఏ మేరకు సాగుతుంది? అసలు ప్రభుత్వం ఉందా? దాని […]

Written By: , Updated On : May 15, 2021 / 08:51 AM IST
Follow us on

Mediaఆంధ్రప్రదేశ్ లో మీడియా గొంతు నొక్కేస్తున్నారు. సాక్షాత్తు మీడియాపైనే కేసులు పెట్టేస్తున్నారు. ఒక వ్యవహారంలో ఇద్దరి మాటలు రాసే మీడియాను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దీనికి ఎవరు బాధ్యులు అనే కోణంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకరి మీద మరొకరు దుమ్మెత్తి పోసుకోవడం కొత్తేమీ కాదు. సమాజంలో జరిగే తంతే. దానికి మీడియా ప్రమేయం ఉందని దానిపై కేసులు పెట్టడం ఏమిటని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. రాష్ర్టంలో పరిపాలన ఏ మేరకు సాగుతుంది? అసలు ప్రభుత్వం ఉందా? దాని పనితీరు ఏమిటనేది ప్రశ్నించాల్సింది మీడియానే. అలాంటి మీడియాను టార్గెట్ చేస్తూ కేసుల వరకు వెళ్లడం సముచితం కాదు.

రఘురామ కృష్ణం రాజు కేసులో..
ఇటీవల సంచలనం సృష్టిస్తున్న రఘురామ కృష్ణం రాజు కేసులో ఏ2, ఏ3గా మీడియా సంస్థలను చేర్చి మీడియా సంస్థలపై జగన్ ప్రభుత్వం కేసు పెట్టింది. దీనికి సమాధానం ఎవరు చెబుతారు? వారి వ్యక్తిగత విషయాలకు మీడియాపై బురద జల్లే కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నారు. ఎవరి మాటలనైనా రాసే బాధ్యత పత్రికలపై ఉంటుంది. అంత మాత్రం చేత వాటిపై కేసులు పెట్టడం అవివేకం. దమ్ముంటే మీరు మీరు తేల్చుకోవాలి. ఆడలేక మద్దెల ఓడు అన్న సామెతలాగా మీకు సాధ్యం కాక మీడియాపై బురద జల్లే విధంగా వ్యవహరించడం వారి స్థాయికి తగినది కాదు.

ఎంతటి కుంభకోణాలైనా..
దేశంలో సంచలనం సృష్టించిన బోఫోర్స్ కుంభకోణం నుంచి ఏలూరు భూముల వ్యవహారాలపై ముందుగా స్పందించింది మీడియానే. అంతమాత్రం చేత మీడియాను వేలెత్తిచూపడం అసమంజసం. ప్రభుత్వం,ప్రతిపక్షాలు ఎవరైనా వారి మాటలను రాయడం మీడియా ధర్మం. అంత మాత్రాన మీడియాను బాధ్యులను చేస్తూ దాని గొంతు నొక్కే పని చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

సోషల్ మీడియాపై లేని కట్టుబాట్లు
మీడియాపై దుమ్మెత్తిపోసే రాజకీయపార్టీలు సోషల్ మీడియాపై ఎలాంటి ఆంక్షలు విధించడంలేదు. ఫలితంగా అవి వ్యక్తిగత ధూషణలు, బురద జల్లే వాటిపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. ఒక్కో నాయకుడిపై ఒక్కో విధంగా పోస్టులు పెట్టినా పట్టించుకోరు. ఎందుకంటే దానికి బాధ్యలెవరో తెలియదు. మీడియాపై అయితే సూటిగా వేలెత్తి చూపుతూ కేసుల వరకు వెళ్తున్నారు. ఫలితంగా పత్రికల స్వేచ్ఛను హరిస్తున్నారు.

మీడియా సైతం..
మీడియా సైతం కొన్ని ఆంక్షల పరిధిలో ఉండాలి. వ్యక్తిగత కక్ష్యలు, దూషణల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మన సంస్థపై వేటు పడకుండా మసలు కోవాలి. వారు మాట్లాడే మాటల విషయంలో అసభ్య పదజాలానికి అవకాశం ఇవ్వకుండా మన భాష ప్రమాణంగా తీసుకోవాలి. అంతేకాని ఆయన అన్నాడు మనం రాశామన్నది ముఖ్యం కాదు. మన బాధ్యత తెలుసుకుని మసలుకోవాలి. పరిధి దాటితే ఏదైనా బరువే.

అంబుడ్స్ మన్ ఉండాలని..
మీడియాను కట్టడి చేసేందుకు అంబుడ్స్ మన్ లాంటిది ఉండాలని అప్పట్లో భావించారు. కాని కాలక్రమంలో దాని గురించి పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో దాని ప్రాముఖ్యం తెలుస్తోంది. మీడియాపై ఇలాంటి వ్యవహారాలు తలెత్తినప్పుడు అంబుడ్స్ మన్ ఉంటే బాగుండు అనే అభిప్రాయం పలు పత్రికల్లో వినిపిస్తోంది. దీని ఆధారంగా జాతీయ ప్రెస్ కౌన్సిల్ సైతం పట్టించుకుని ఇలాంటి తప్పులు జరుగుతున్నప్పుడు స్పందించి మీడియా పరువు బజారున పడకుండా కాపాడాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.