https://oktelugu.com/

Teachers Trancefors: టీచర్ల బది‘లీలలు’.. కేసీఆర్ సర్కార్ చేసేది తప్పా? ఒప్పా?

Transfers of teachers : టీచర్ల బదిలీల వివాదంలో కేసీఆర్‌ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రపతి జారీ చేసిన నిబంధనలకు విరుద్ధంగా.. ప్రెసిడెన్సియల్‌ రూల్స్‌ సవరిస్తూ జారీ చేసిన వివాదాస్పద జీవో 402ను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. పాత ఉమ్మడి జిల్లాల పరిధిలో పరస్పర బదిలీలు(మ్యూచువల్‌ ట్రాన్స్ ఫర్స్‌) చేసుకునే ఉపాధ్యాయులు సీనియారిటీ కోల్పోకుండా బదిలీ అయ్యే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 402 అమలును న్యాయస్థానం నిలిపివేసింది. -రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా జీవో 402 […]

Written By:
  • NARESH
  • , Updated On : April 14, 2022 / 06:17 PM IST
    Follow us on

    Transfers of teachers : టీచర్ల బదిలీల వివాదంలో కేసీఆర్‌ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రపతి జారీ చేసిన నిబంధనలకు విరుద్ధంగా.. ప్రెసిడెన్సియల్‌ రూల్స్‌ సవరిస్తూ జారీ చేసిన వివాదాస్పద జీవో 402ను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. పాత ఉమ్మడి జిల్లాల పరిధిలో పరస్పర బదిలీలు(మ్యూచువల్‌ ట్రాన్స్ ఫర్స్‌) చేసుకునే ఉపాధ్యాయులు సీనియారిటీ కోల్పోకుండా బదిలీ అయ్యే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 402 అమలును న్యాయస్థానం నిలిపివేసింది.

    -రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా జీవో 402
    తెలంగాణలో 33 కొత్త జిల్లాల ప్రకారం స్థానిక క్యాడర్‌ కేటాయింపులను ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ కేటాయింపులతో చాలా మంది సొంత జిల్లాలను వీడారు. స్థానికత ఆధారంగా బదిలీలు చేయాలని ఆందోళన చేశారు. ఈ క్రమంలో పరస్పర బదిలీలకు అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరిలో జీవో 402 జారీచేసింది.

    -సీనియారిటీ కోల్పోకుండా..
    కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం జారీ అయిన నూతన ప్రెసిడెన్షియల్‌ రూల్స్‌ ప్రకారం.. పరస్పర బదిలీలు చేసుకునే ఉపాధ్యాయులు పాత జిల్లాల్లో తమకున్న సీనియారిటీని కోల్పోతారు. పరస్పర బదిలీ అనంతరం కొత్త జిల్లా క్యాడర్‌లో చివరి ర్యాంకు నుంచి మళ్లీ సీనియారిటీ మొదలవుతుంది. అయితే ఉపాధ్యాయులు ఇలా సీనియారిటీ కోల్పోకుండా పరస్పర బదిలీలు చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం 402 జీవో ద్వారా కల్పించింది.

    -కోర్టును ఆశ్రయించిన ఎస్జీటీలు..
    జీవో 402 వల్ల తాము నష్టపోతామంటూ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన పలువురు సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీలు) హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ… నూతన ప్రెసిడెన్షియల్‌ రూల్స్‌ ప్రకారం పరస్పర బదిలీలకు అవకాశం ఉందని, అయితే ఇలా చేసుకునేవారు పాత జిల్లాలో తమకున్న సీనియారిటీని కోల్పోయి కొత్త జిల్లా క్యాడర్‌లో చివరి ర్యాంకు నుంచి సర్వీసును ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్‌ విజయ్‌సేనా రెడ్డి బెంచ్‌ కీలక నిర్ణయాన్ని వెలువరించింది.

    -మీరెలా సవరిస్తారు?
    ప్రెసిడెన్షియల్‌ రూల్స్‌కు సవరణ చేస్తూ ప్రభుత్వం జీవో 402ను జారీచేసిందని… కానీ జీవో ద్వారా ప్రెసిడెన్షియల్‌ రూల్స్‌ను సవరించే అధికారం ప్రభుత్వానికి లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సీనియారిటీని కొనసాగించే అవకాశం ఇస్తే… కొత్త జిల్లాల్లో ఇప్పటికే ఉన్న తమకంటే పరస్పర బదిలీల ద్వారా వచ్చినవారు సీనియర్లు అవుతారని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దీనివల్ల జిల్లాలో పనిచేస్తున్నవారికి నష్టం కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వ జీవో 402కు ఎలాంటి ప్రాతిపదిక లేదని, దాన్ని కొట్టేయాలని కోరారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. పిటిషనర్ల వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. జీవోను సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. ఈ అంశంపై వివరణ సమర్పించాలని ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.

    -ఆందోళనలో పరస్పర బదిలీ ఉపాధ్యాయులు..
    స్థానిక క్యేడర్‌ కేటాయింపులతో సొంత జిల్లాను వీడిన ఉపాధ్యాయులు తిరిగి సొంత జిల్లాకు రావడానికి పడరాని పాట్లు పడ్డారు. ఉపాధ్యాయ సంఘాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ప్రజాప్రతినిధులు కూడా ఉపాధ్యాయుల ఇబ్బందులను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీనియారిటీ దెబ్బతినకుండా జీవో 402 జారీ చేయించారు. ఆ తర్వాత కూడా మ్యూచువల్‌ ట్రాన్స్‌ఫర్‌ కోసం అభ్యర్థుల వేట కొనసాగించారు. కొందరైతే మ్యూచ్‌వల్‌గా వచ్చే ఉపాధ్యాయులకు లక్షల రూపాయలు సమర్పించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇన్ని చేసి సొంత జిల్లాకు వస్తే ఇప్పుడు మళ్లీ సీనియారిటీ కోల్పోవాల్సి రావడంతో పరస్పర బదిలీ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.