https://oktelugu.com/

schemes: మోడీపై కేసు వేసిన బామ్మా.. ఆంధ్రప్రదేశ్ కు ఓసారి రావమ్మా!

Photos on government schemes: అప్పటి వరకూ అసలు మోడీ సర్కార్ కు టీకాలపై ఆ ఆలోచనే లేదు. దేశంలోని 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే టీకాలు ఉచితంగా వేయాలని అనుకుంది. 60 ఏళ్లలోపు వారికి ఎంతో కొంత రుసం పెట్టి టీకాలు వేయించాలని అనుకుంది. కానీ జాతి ప్రయోజనాలు.. జాతీయ నిత్యావసరమైన టీకాలపై ఈ ధోరణిని సుప్రీం కోర్టు దునుమాడి మోడీ సర్కార్ కు చీవాట్లు పెట్టింది. వ్యాక్సిన్ ను దేశవ్యాప్తంగా ఉచితంగా పంపిణీ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 26, 2021 / 02:59 PM IST
    Follow us on

    Photos on government schemes: అప్పటి వరకూ అసలు మోడీ సర్కార్ కు టీకాలపై ఆ ఆలోచనే లేదు. దేశంలోని 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే టీకాలు ఉచితంగా వేయాలని అనుకుంది. 60 ఏళ్లలోపు వారికి ఎంతో కొంత రుసం పెట్టి టీకాలు వేయించాలని అనుకుంది. కానీ జాతి ప్రయోజనాలు.. జాతీయ నిత్యావసరమైన టీకాలపై ఈ ధోరణిని సుప్రీం కోర్టు దునుమాడి మోడీ సర్కార్ కు చీవాట్లు పెట్టింది. వ్యాక్సిన్ ను దేశవ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేసేంత  డబ్బులు కూడా లేవని నిలదీసింది. దీంతో మేలుకున్న మోడీ సర్కార్ ఓ ఫైన్ మార్నింగ్ ఓ ప్రకటన చేసింది..

    jagan modi scheems

    మోడీ సార్ స్వయంగా రంగంలోకి దిగి నష్టనివారణ చర్యలు చేపట్టి దేశవ్యాప్తంగా ఉచితంగా టీకా పంపిణీ అని ప్రకటించారు. అయితే నిర్వహణ భారం అంతా రాష్ట్రాలపై మోపారు. అలా బడ్జెట్ ను రాష్ట్రాలపై పెట్టి ఉచిత టీకాల క్రెడిట్ అంతా మోడీ సార్ కొట్టేస్తున్నాడు. తెరవెనుక జరిగింది ఇదీ..

    అయితే బయటకు మాత్రం మోడీ దయాగుణం బాగా ఎలివేట్ అయిపోయింది. 130 కోట్ల భారతానికి మోడీ సార్ ఉచితంగా టీకాలు వేయించడాన్ని బీజేపీ శ్రేణులు చంకలు గుద్దుకున్నాయి. ఇటీవల 100 కోట్ల డోసులు పంపిణీని మోడీసార్ తోపాటు ఇతరులు పండుగ చేసుకున్నారు. కానీ ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే..

    రెండో వైపు అసలు ప్రజలు ప్రైవేటు ఆస్పత్రుల్లో డబ్బులు పెట్టి కొని వేసుకుంటున్న ప్రైవేటు టీకాలపై కూడా మోడీ బొమ్మ ఎందుకన్న ప్రశ్న ఉత్పన్నమైంది. విదేశాలకు వెళ్లాల్సిన వారు.. ఏదైనా కరోనాటీకా సర్టిఫికెట్ కావాల్సిన వారందరి ధృవపత్రంపై మోడీ ఫొటోను ముద్రించేస్తున్నారు. ఇప్పటికే దీన్ని బెంగాల్ సీఎం మమత ఖండించి ఎన్నికల వేళ టీకాలపై మోడీ బొమ్మను తీసివేయించింది. కానీ ఇప్పటికీ కొనసాగుతోంది.

    ఈ క్రమంలోనే ఒక కేరళ బామ్మ కోర్టుకెక్కారు. ఒక్కో డోసుకు రూ.750 చెల్లించి తాను ప్రైవేటుగా టీకా వేయించుకున్నానని.. నా కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ పై నరేంద్రమోడీ ఫొటో ఎందుకు ప్రచురించారని కోర్టులో కేసు వేసింది. దీంతో ఈ కేరళ బామ్మ చేసిన పని దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది.

    ఇక దీనిపై సెటైర్లు కురిపించే వారున్నారు. మోడీ టీకా ఇచ్చింది నిజం.. ఉచితంగా పంచుతున్నది నిజం.. ఫొటో పెట్టుకుంటే తప్పేంటని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. ఇక ఆంధ్రావాదులు అంతకుమించి ఖండించేస్తున్నారు.

    మోడీపై కేసు వేసిన కేరళ బామ్మ తీరుపై ఇప్పుడు ఎవరికి వారు అన్వయించుకొని సెటైర్లు వేస్తున్నారు. మోడీ ఒక్క ఫొటోకే ‘‘నువ్వు అలా అంటే ఒకసారి ఆంధ్రప్రదేశ్ కు రావమ్మా. బామ్మా’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ పథకాలన్ని ఉచితాలుగా పంచేస్తున్నారని.. అన్నింటిపై జగన్, వైఎస్ఆర్ ఫొటోలున్నాయని వాదిస్తున్నారు. ప్రజల సొమ్ముతో పంచే డబ్బులు, పథకాలపై కూడా బొమ్మలు పెడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. జనగన్న గోరుముద్ద, వైఎస్సార్ ఆసరా, చంద్రన్న దీవెన, ఎన్టీఆర్ హెల్త్, పదుల సంఖ్యలో వీటి మీద కిక్కురుమనకుండా బొమ్మలు ఉన్నాయని ఉదాహరణలతో సహా నిరూపిస్తున్నారు. అంటే ఆంధ్రా వాళ్లు బానిసత్వం చేస్తున్నట్టేగా ఈ కుటుంబాలకి అని వాదిస్తున్నారు. ఇప్పుడీ ఫొటో లొల్లి కేవలం మోడీతోనే పోదని.. అన్ని రాష్ట్రాల్లో అన్ని సీఎంలకు పట్టుకుంటుందని.. ప్రజల సొమ్ముతో పంచే అసలు ప్రభుత్వ పథకాలపై నేతల ఫొటోలే తీసివేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఏపీలో అయితే మరీ దారుణంగా పథకాలన్నింటిపై జగన్, వైఎస్ఆర్ బొమ్మలు పెట్టేశారని ఏపీ వాసులు విమర్శలు గుప్పిస్తున్నారు.

    Also Read: జగనన్న డబ్బులు పంచుడు పథకం.. పండుగ చేసుకోండి