https://oktelugu.com/

Harappa and Vedic People History: హరప్పా, వేదకాలం ప్రజలు ఒక్కరేనా? చరిత్రలో దాగిన నిజాలు

Harappa and Vedic People History: మనది చారిత్రక కాలం. వివిధ పరిశోధనల ఆధారంగా మన చరిత్ర రూపుదిద్దుకున్నది. దీంతో మన పుట్టుక, జీవనం అన్ని చరిత్రకు ఆధారాలే. భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలే. కాకపోతే కొన్నింటికి ఆధారాలు ఉంటున్నాయి. కొన్నింటిని మనం కనిపెట్టలేకపోతున్నాం. ఇదే కోవలో మన చరిత్రకు మూలాధారాలైన సింధులోయ నాగరికత, మెసపటోమియా నాగరికత, మెహంజొదారో నాగరికతల గురించి చదువుకున్నాం. అప్పటి ప్రజల జీవన విధానం గురించి తెలుసుకున్నాం. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే నాగరికతలు […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 22, 2022 / 10:38 AM IST
    Follow us on

    Harappa and Vedic People History: మనది చారిత్రక కాలం. వివిధ పరిశోధనల ఆధారంగా మన చరిత్ర రూపుదిద్దుకున్నది. దీంతో మన పుట్టుక, జీవనం అన్ని చరిత్రకు ఆధారాలే. భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలే. కాకపోతే కొన్నింటికి ఆధారాలు ఉంటున్నాయి. కొన్నింటిని మనం కనిపెట్టలేకపోతున్నాం. ఇదే కోవలో మన చరిత్రకు మూలాధారాలైన సింధులోయ నాగరికత, మెసపటోమియా నాగరికత, మెహంజొదారో నాగరికతల గురించి చదువుకున్నాం. అప్పటి ప్రజల జీవన విధానం గురించి తెలుసుకున్నాం. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే నాగరికతలు వెలిశాయని అవగాహన చేసుకున్నాం. చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే మనకు ఎన్నో పరిష్కారాలతో పాటు అనుమానాలు కూడా కనిపిస్తాయి.

    Harappa and Vedic People History

    ఆర్యుల రాకపై రకరకాల కథనాలు ఉన్నాయి. వారు మన దేశానికి చెందిన వారు కాదని కొన్ని ఆధారాలు చెబుతుంటే వారు మనవారే అని మరికొన్ని చారిత్రక కథనాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఆర్యుల పుట్టుపూర్వోత్తరాల గురించి చాలా రకాల పుస్తకాలు వచ్చాయి. కానీ వారి నిజమైన విధానం ఏదనేది తెలియలేదు. దీంతో కొందరు రాసిన పుస్తకాల ఆధారంగా ఆర్యుల పుట్టుక గురించి కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. భారతదేశం నాగరికతలకు పుట్టినిల్లు. హరప్పా, మెహంజొదారో నాగరికతల్లో మనకు ఎన్నో విషయాలు కనిపించాయి.

    Also Read: Thank You movie Twitter Review: థాంక్యూ ట్విట్టర్ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే?

    అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఉపయోగించే ఎద్దుల బండి మాత్రం అప్పటి నుంచే వినియోగంలో ఉన్నట్లు గుర్తించాం. అలాగే స్నానవాటికలు, ఇటుకలు వారి వస్తువులు చాలా మనకు లభించాయి. కానీ ఇనుము మాత్రం వారు వాడినట్లు ఎక్కువగా ఆధారాలు లభించకపోయినా అధర్వణ వేదం నాటికి వారు ఇనుము వాడినట్లు తెలుస్తోంది. అలాగే వారికి గుర్రం గురించి మాత్రం తెలియకపోవడం విచిత్రమే. గుర్రాలను ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

    Harappa and Vedic People History

    చరిత్రలకు పుట్టినిల్లుగా సరస్వతి నదిని పేర్కొంటారు. కాలక్రమంలో ఆ నది అంతర్థానమైంది. కానీ నాగరికతలు ఇదే నదిపై వెలిశాయని చరిత్రకారులు చెబుతున్నారు. వేదాల్లో కూడా ఈ విషయం స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్యుల జన్మస్థానం గురించి మాత్రం మనకు స్పష్టమైన ఆధారాలు మాత్రం లభించలేదు. కానీ మన దేశ ఔన్నత్యానికి ఆర్యులే దారి చూపారని చరిత్ర చెబుతోంది. ఇంతటి మహత్తరమైన నాగరికతల ఆధారంగా మనకు చాలా విషయాలు తెలిసినా ఇంకా తెలియాల్సినవి చాలా ఉండటం విశేషం.

    చరిత్రలో హరప్పా, వేద కాలం ప్రజల గురించి రకరకాల కథలు ఉన్నాయి. హరప్పా ప్రజలకు గుర్రాలు వాడినట్లు లేదు. దీంతో వారి మనుగడపై అనేక ప్రశ్నలు వచ్చినా వేదకాలం ప్రజలు, హరప్పా నాగరికత ప్రజలు ఒక్కరేనని తెలుస్తోంది. మధ్య ఆసియా నుంచి గుర్రాలు ఇక్కడకు తీసుకొచ్చుకున్నట్లు చెబుతున్నారు. అంతేకాని చరిత్ర మనకు ఎన్నో విషయాలు చెబుతోంది. చరిత్రకారులు కూడా అనేక విషయాలపై వివరణ ఇచ్చారు. దీంతో హరప్పా సంస్కృతిపై మనకు ఎన్నో అవశేషాలు లభించడం తెలిసిందే.

    Also Read:Koffee With Karan 7: కాఫీ విత్ కరణ్ షోలో నాగచైతన్యతో విడాకులపై సంచలన విషయాలు పంచుకున్న సమంత

     

     

    Tags