APSRTC Fares Increased: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని విచిత్ర నిర్ణయాలు తీసుకుంటోంది. ఫలితంగా ప్రజల్లో చులకన అయిపోతోందని తెలుస్తోంది. ప్రతి పండగకు ప్రత్యేక బస్సులు నడపడం ఆనవాయితీ. ప్రస్తుతం దసరా పండగకు కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. కానీ ఇక్కడో ఓ ట్విస్ట్ దాగి ఉంది. యాభై శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తోంది. దీంతో ప్రయాణికులపై పెనుభారం పడుతోంది. ఇదేంటని అడిగితే తిరుగు ప్రయాణంలో జనం ఉండరని సాకులు చెబుతోంది. దీంతో ఆర్టీసీకి ప్రయోజనం చేకూరినా ప్రజలకు మాత్రం భారమే అని తెలుస్తోంది.

ఆర్టీసీ(APSRTC Fares Increased) ప్రత్యేక బస్సుల పేరుతో ప్రజలను దోపిడీకి గురిచేస్తోందని విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రతి పండగకు సాధారణ సర్వీసుల్ని నిలిపివేసి ప్రత్యేక సర్వీసులుగా మార్చడం చూస్తూనే ఉన్నాం. దీంతో ప్రభుత్వం అప్రదిష్టను మూటగట్టుకుంటోంది. ప్రజలపై భారం మోపుతూ ఆదాయం పెంచుకోవాలని చూడడం బాధాకరమని పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దసరా పండగను క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది.
ప్రభుత్వమే ఇలా చేస్తుంటే ప్రైవేటు బస్సుల వాళ్లు ఊరుకుంటారా? వారు కూడా ఇష్టారాజ్యంగా చార్జీలు పెంచుతూ ప్రజలను దోచుకునేందుకు రెడీ అవుతున్నారు. దీంతో ఆర్టీసీ చార్జీలకు సినిమా రేట్ల విషయానికి ముడిపెట్టి తప్పించుకోవాలని చూస్తోంది. దీంతో పండుగలకు ఇంటికి వెళ్లాలన్న వారి జేబులు మాత్రం ఖాళీ అవుతున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు.
ప్రభుత్వం ప్రజల అవసరాలు గుర్తించడం లేదనే అపవాదు మూటగట్టుకుంటోంది. బస్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం వెనుక ఆంతర్యమేమిటో ఎవరికి అర్థం కావడం లేదు. దీంతో వైసీపీ అవలంభిస్తున్న విధానాలతో ప్రజలు నష్టపోతున్నారని పలువురు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వమే పునరాలచించాల్సిన అవసరం ఏర్పడింది.