AP SSC Result 2022 Postponed: ఏపీలో విద్యాశాఖ మంత్రి బొత్సకు, అధికారుల మధ్య సమన్వయలోపంతో ఏకంగా పదో తరగతి పరీక్ష ఫలితాలు వాయిదాపడ్డాయి. శనివారం ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరక్టర్ దేవానంద్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 6 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తుండగా సడన్‌గా వాయిదా పడినట్టు అధికారులు ప్రకటించారు.దీంతో అటు విద్యార్థులు.. ఇటు పేరెంట్స్ అందరూ తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. అలాంటప్పుడు ముందుగా ఎందుకు ప్రకటించారని ప్రశ్నిస్తున్నారు. శాఖలపరంగా మంత్రులకు పట్టు లేకపోవడమే ఇటువంటి ఘటనలకు కారణమని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. తక్షణం ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా.. సోమవారం ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

జరిగిందిదీ..
పదో తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా పడడానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, అధికారుల మధ్య సమన్వయ లోపమే కారణమని తెలుస్తోంది. మంత్రి బొత్సకు సమాచారం ఇవ్వకుండా అధికారులే ఫలితాల ప్రకటన చేసినట్లుగా సమాచారం. దీంతో అధికారులు తీరుపై మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Amravati: అమరావతి ఉద్యమానికి 900 రోజులు..అలుపెరగని పోరాటం చేసిన రైతులు
దీంతో ఏం చేయాలో పాలుపోక అధికారులు ఫలితాల వెల్లడిని వాయిదా వేశారు. అయితే అధికారుల తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని ఫలితాలను వాయిదా వేయడం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యంగా మేథావులు, విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలా అంటూ ప్రశ్నిస్తున్నారు.. ఉన్నట్టుండి ఫలితాలను వాయిదా వేయడంపై సర్వత్రా గందరగోళం నెలకొంది.

విద్యార్థి సంఘాల ఆందోళన
పదో తరగతి పరీక్షా ఫలితాల వాయిదాపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. పదో తరగతి పరీక్ష ఫలితాలు కూడా ప్రణాళిక ప్రకారం విడుదల చేయలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. మంత్రి, అధికారుల మధ్య సమన్వయం లేదని ఫలితాలు వాయిదా వేయడం ఏమిటని ప్రశ్నించారు. ర్యాంకులు ప్రకటిస్తే.. జరిమానా అని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఇప్పుడు అర్ధంతరంగా ఫలితాలు వాయిదా వేశారని తెలిపారు. మరి అధికారులు, ప్రభుత్వానికి ఎటువంటి జరిమానా వేయాలని నిలదీశారు. ఆరు లక్షల మంది జీవితాలతో ఆడుకుంటారా… దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
Also Read:Raghunandan Rao: బాలికపై గ్యాంగ్ రేప్ కేసు: సంచలన వీడియో బయటపెట్టిన రఘునందన్ రావు
Recommended Videos