AP PRC News: ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల పరిస్థితి ఎటూ తేలడం లేదు. ప్రభుత్వం కూడా వారి ఆశలపై నీళ్లు చల్లుతోంది. పీఆర్సీ నివేదిక ఇప్పటికి కూడా బయట పెట్టడం లేదు. దీంతో ఉద్యోగ సంఘాల నేతల్లో ఆందోళన పెరుగుతోంది. సమయానికి వేతనాలు కూడా అందించడం లేదు. దీంతో ఉద్యోగుల భవితవ్యం ఆందోళనకరంగా మారింది. పీఆర్సీ నివేదిక ఇస్తామని చెబుతున్నా ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది. దీంతో ఉద్యోగ సంఘాల్లో చీలిక రావడం సహజమే.

ఉద్యోగుల నుంచి ఒత్తిడి వస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. పీఆర్సీ నివేదికపై ఇప్పటికే ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. నిన్న పీఆర్సీ నివేదిక బహిర్గతం చేయాలని కోరుతూ ఉద్యోగులు బైఠాయించినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదు. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
పీఆర్సీ నివేదికపై ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు జేఏసీ చైర్మన్ బండి శ్రినివాసరావు, ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ కోసం ఉద్యోగులు పోరాడుతుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ నేతలు బండి శ్రీనివాస రావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు పీఆర్సీ నివేదిక ఇవ్వాలని కోరారు.
ఈ క్రమంలో ఉద్యోగులను రెచ్చగొడుతూ వారిలో విభేదాలు సృష్టిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఉద్యోగుల్లో బేషజాలు పక్కన పెట్టి సమస్యల సాధనకు కలిసి రావాలని కోరుతున్నారు ఉద్యోగులు పీఆర్సీ కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని తెలుస్తోంది. పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుందనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.