https://oktelugu.com/

AP Politics: ఏపీలో కమ్మ సామాజిక వర్గం ఒకటవుతుందా?

AP Politics: కుల రాజకీయాలకు, కులాల కుంపటికి ఏపీ పెట్టింది పేరు. నేతలు సైతం వీటిని ప్రోత్సహిస్తుండటంతో ఏపీలో ఈ తరహా రాజకీయాలు ఇటీవల కాలంలో మరింత ఎక్కువయ్యారు. ఆయా సామాజిక వర్గాలుగా ప్రజలు విడిపోయి రాజకీయ నాయకులకు మద్దతు పలుకుతున్నారు. దీంతో వారి సమస్యలు పరిష్కారం అవుతున్నాయో లేదోగానీ రాజకీయ నాయకులు మాత్రం పబ్బం గడుపుకుంటున్నారు. ఏపీలోని ఓ సామాజికవర్గం మొత్తం కూడా జగన్ కు వ్యతిరేకంగా మారుతుందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఏపీ రాజకీయాలు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 2, 2021 12:12 pm
    Follow us on

    AP Politics: కుల రాజకీయాలకు, కులాల కుంపటికి ఏపీ పెట్టింది పేరు. నేతలు సైతం వీటిని ప్రోత్సహిస్తుండటంతో ఏపీలో ఈ తరహా రాజకీయాలు ఇటీవల కాలంలో మరింత ఎక్కువయ్యారు. ఆయా సామాజిక వర్గాలుగా ప్రజలు విడిపోయి రాజకీయ నాయకులకు మద్దతు పలుకుతున్నారు. దీంతో వారి సమస్యలు పరిష్కారం అవుతున్నాయో లేదోగానీ రాజకీయ నాయకులు మాత్రం పబ్బం గడుపుకుంటున్నారు. ఏపీలోని ఓ సామాజికవర్గం మొత్తం కూడా జగన్ కు వ్యతిరేకంగా మారుతుందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఏపీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.

    AP Politics

    Andhra Pradesh

    నిన్నటి వరకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి జై కొట్టిన కమ్మ కులస్థులు ఇప్పుడు ‘నై’ అంటున్నారట. టీడీపీ తమకు అన్యాయం చేస్తుందని వైసీపీని గెలిస్తే ఆపార్టీ తమ వర్గాన్ని పూర్తిగా అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని ఆ సామాజికవర్గం నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల కమ్మ కులస్థులపై జరుగుతున్న వ్యక్తిగత, సామాజిక దాడులతో ఆవర్గానికి చెందిన వారంతా ఏకతాటిపైకి వస్తోంది.

    ఏపీలో అత్యధిక సామాజికవర్గం కలిగిన వాళ్లలో కమ్మవారు ముందుంటారు. ఈ సామాజికవర్గం ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆపార్టీకి అధికారంలోకి రావడం ఏపీలో కామన్ అయిపోయింది. అంతలా ఈ సామాజికవర్గం ఏపీని శాసించే స్థాయిలో ఉంది. కిందటి ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గం తొలి నుంచి మద్దతు ఇస్తున్న టీడీపీని కాదని వైసీపీకి జై కొట్టింది. దీంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది.

    అయితే జగన్ సీఎం అయ్యాక కమ్మ కులస్థులకు ఇచ్చిన హామీలను పెద్దగా నెరవేర్చడం లేదని ఆవర్గం నుంచి ఆరోపణలు విన్పిస్తున్నాయి. దీనికి తోడు తమ వర్గాన్ని అణిచివేసేలా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని కమ్మ కులస్థులు భావిస్తున్నారు. అమరావతి రాజధాని తరలింపు, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు నిలిపివేయడం వంటి వాటిని వారంతా ఊదాహరణ చూపుతున్నారు.

    కమ్మ కులానికి చెందిన వైసీపీ నేతలతోనే జగన్మోహన్ రెడ్డి తమ సామాజికిక వర్గానికి చెందిన నేతలపై దాడులకు, వ్యక్తిగత దూషణలు చేయిస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నారని వారంతా గుర్రుగా ఉంటున్నారు. ఇదే సమయంలో ఇటీవల అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడిపై అవమానకరమైన రీతిలో వైసీపీ నేతలు మాట్లాడాన్ని వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు.

    ఇప్పటి వరకు ఎన్టీఆర్, చంద్రబాబు మాత్రమే కమ్మ కులం నుంచి ముఖ్యమంత్రులయ్యారు. అలాంటి చంద్రబాబుపై వైసీపీకి చెందిన కొడాలి నాని, వల్లభనేని వంశీలు మానసికంగా కుంగదీసేలా మాట్లాడాన్ని వారంతా తప్పుబడుతున్నారు. దీంతో నాని, వంశీలు కమ్మ వ్యతిరేకులుగా ముద్రపడిపోతున్నారు.

    Also Read: పోలీసులకు సీఎం జగన్ ఇచ్చిన ఆఫర్ ఉత్తిదేనా?

    ఈక్రమంలోనే కమ్మ కులానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఆ ఇద్దరు నేతలపై భౌతిక దాడులు తప్పవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కారు కమ్మ కులస్థులను అణగదొక్కే పనులు చేస్తున్న నేపథ్యంలోనే సదరు వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే కామెంట్స్ విన్పిస్తున్నారు. కొద్దిరోజులుగా పవన్ కల్యాణ్ సైతం ఇటీవల కమ్మ కులస్థుల సమస్యలపై ప్రస్తావిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు.

    ఈనేపథ్యంలో వారంతా కూడా  సీఎం జగన్ కు వ్యతిరేకంగా ఏకమవుతున్నారని తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే వల్లభనేని వంశీ ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరీకి బహిరంగంగా క్షమాపణలు చెప్పారనే టాక్ నడుస్తోంది. ఏదిఏమైనా కమ్మ కులస్థులంతా ఏకతాటిపైకి వచ్చేందుకు రెడీ అవుతుండటంతో ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారేలా కన్పిస్తున్నాయి.

    Also Read: ఇద్దరు వైసీపీ కమ్మ నాయకులపై 50 లక్షల రివార్డ్ ప్రకటించిన ఒక కమ్మ వ్యక్తి