https://oktelugu.com/

TDP vs YCP Kodali Nani: తగ్గేదేలే… క్యాసినో పాలిటిక్స్ తో హీటెక్కిన గుడివాడ.. టీడీపీ వర్సెస్ వైసీపీ

TDP vs YCP Kodali Nani: టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ ఏదో ఒకటి రగిలిస్తూనే ఉంటాడు. అయితే జగన్ ను, జగన్ సర్కార్ ను టార్గెట్ చేసి తన మీడియాతో చెడుగుడు ఆడేస్తుంటాడు. టాపిక్ దొరకాలే కానీ.. కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందంగా టీడీపీ , దాని అనుకూల మీడియా చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. తాజాగా ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నాని టీడీపీకి దొరికారు. ఆయన కళ్యాణ మండపంలో  ‘క్యాసినో’ నిర్వహించినట్టు […]

Written By:
  • NARESH
  • , Updated On : January 22, 2022 / 10:16 AM IST
    Follow us on

    TDP vs YCP Kodali Nani: టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ ఏదో ఒకటి రగిలిస్తూనే ఉంటాడు. అయితే జగన్ ను, జగన్ సర్కార్ ను టార్గెట్ చేసి తన మీడియాతో చెడుగుడు ఆడేస్తుంటాడు. టాపిక్ దొరకాలే కానీ.. కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందంగా టీడీపీ , దాని అనుకూల మీడియా చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. తాజాగా ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నాని టీడీపీకి దొరికారు. ఆయన కళ్యాణ మండపంలో  ‘క్యాసినో’ నిర్వహించినట్టు టీడీపీ ఆరోపిస్తోంది.  ఏపీలో జరుగుతున్న ఈ జూదంపై టీడీపీ పోరుబాట పట్టింది.

    TDP vs YCP Kodali Nani

    గుడివాడలో క్యాసినో నిర్వహణపై టీడీపీ బృందాన్ని ఏర్పాటు చేసి గుడివాడకు పంపడం.. పోలీసులు అడ్డుకోవడం..చివరకు ఏపీ మంత్రి కొడాలి నాని దీనిపై బూతులతో విరుచుకుపడడంతో వివాదం పతాకస్థాయికి చేరింది.

    ఇప్పుడు టీడీపీ సరికొత్త వాదనను తెరపైకి తెస్తోంది. మంత్రి కొడాలి నానిని బర్తరఫ్ చేయాలని పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలోనే క్యాసినో వ్యవహారంపై టీడీపీ వదిలేలా కనిపించడం లేదు. టీడీపీ నేతల వాహనాలను అడ్డుకొని వారిని వెనక్కి పంపడంతో అక్కడే కాచుకు కూర్చున్నారు. గుడివాడపై ఎప్పుడైనా టీడీపీ నేతలు దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. దీంతో గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

    Also Read: హైదరాబాద్‌కు వ‌స్తున్న మరో టాప్ కంపెనీ.. రూ.20 వేల కోట్ల పెట్టుబ‌డులు!

    సంక్రాంతి వేళ గుడివాడలోని కొడాలి నాని కళ్యాణ మండపంలో ‘క్యాసినో’ నిర్వహించారని టీడీపీ ప్రధాన కంప్లైంట్. అయితే గుడివాడలోనే కాదు.. సంక్రాంతికి ఏపీ మొత్తం కోడిపందేలు, పేకాట జరిగిందని.. ఆ తర్వాత నుంచి అది జరగలేదని నిన్న కొడాలి నాని వివరణ ఇచ్చాడు. ఇప్పుడు కావాలంటే చూపిస్తానని తన కన్వేన్షన్ సెంటర్ లోకి విలేకరులను తీసుకెళుతానని చెప్పుకొచ్చారు.

    అయితే ఆ సంక్రాంతి ఒక్క రాత్రి మంత్రి కొడాలి నాని వర్గం ఏకంగా రూ.250 కోట్లు సంపాదించినట్టు ఆరోపణలున్నాయి. గోవా, వేగాస్ కల్చర్ ను గుడివాడకు తెచ్చారంటూ ఇప్పటికే టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కే. కన్వెన్షన్ ఓనర్  కొడాలి నానిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

    ఈ ఆరోపణలతో ఏపీ మంత్రి కొడాలి నాని డిఫెన్స్ లో పడిపోయారు. తన కన్వేన్షన్ లో ‘క్యాసినో’ జరగలేదని ఆయన వాదిస్తున్నారు. టీడీపీ మాత్రం పలు వీడియోలను రిలీజ్ చేసింది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హీట్ పెంచింది. బూతుల మంత్రితో పెట్టుకున్న టీడీపీ తగ్గేదేలే అంటోంది. అయితే అంతకుమించి విరుచుకుపడుతూ కొడాలి నాని నిప్పులు చెరుగుతున్నారు. దీంతో ఈ రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది.

    Also Read:  ఎన్ని కోట్లిచ్చిన ఆ పని చేయబోమంటున్న ఈ సినీ తారలు మీకు తెలుసా?