https://oktelugu.com/

సింగిల్‌ డిజిట్‌ దాటడం టీడీపీతో అయ్యేనా..?

ఏపీలో ఇటీవల హాట్‌హాట్‌గా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లోనూ వార్‌‌ వన్‌సైడ్‌ అన్నట్లుగానే అయిపోయింది. ఫలితాల ట్రెండింగ్‌ ఒకసారి చూస్తే.. ఈ ఎన్నికల్లోనూ వైసీపీ తన హవాను కొనసాగిస్తోంది. తొలి రెండు గంట‌ల కౌంటింగ్ ప్రకారం.. సుమారు 18 మున్సిపాలిటీల‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవ‌సం చేసుకుంది. ఇప్పటికే డిక్లేర్డ్ అయిన వివిధ వార్డుల ఫ‌లితాల ప్రకారం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 18 మున్సిపాలిటీల్లో నెగ్గింది. వీటిల్లో కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ […]

Written By: , Updated On : March 14, 2021 / 01:37 PM IST
Follow us on

TDP
ఏపీలో ఇటీవల హాట్‌హాట్‌గా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లోనూ వార్‌‌ వన్‌సైడ్‌ అన్నట్లుగానే అయిపోయింది. ఫలితాల ట్రెండింగ్‌ ఒకసారి చూస్తే.. ఈ ఎన్నికల్లోనూ వైసీపీ తన హవాను కొనసాగిస్తోంది. తొలి రెండు గంట‌ల కౌంటింగ్ ప్రకారం.. సుమారు 18 మున్సిపాలిటీల‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవ‌సం చేసుకుంది. ఇప్పటికే డిక్లేర్డ్ అయిన వివిధ వార్డుల ఫ‌లితాల ప్రకారం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 18 మున్సిపాలిటీల్లో నెగ్గింది. వీటిల్లో కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయ‌డం గ‌మ‌నార్హం.

lso Read: మున్సిపల్ ఫలితాల్లో వైసీపీ ప్రభజనం.. 15 మున్సిపాల్టీలు కైవసం.. బోణి కొట్టని టీడీపీ

ప్రకాశం జిల్లా క‌నిగిరిలో అన్ని వార్డుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ‌య బావుటా ఎగురవేసింది. డోన్ మున్సిపాలిటీలో టీడీపీ ఒక్క వార్డులో నెగ్గగా 30కి పైగా వార్డుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గి ఆ సీటును సొంతం చేసుకుంది. క‌ర్నూలు జిల్లా ఆత్మకూరులో 23 వార్డుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా.. ఒక్క వార్డులో మాత్రం టీడీపీ నెగ్గింది. ఒక‌టీ రెండు చోట్ల మాత్రం టీడీపీ ఏడెనిమిది వార్డుల్లో నెగ్గిన దాఖ‌లాలు కనిపిస్తున్నాయి.

Also Read: టీడీపీకి గడ్డు కాలం తప్పదా..? మున్సిపల్‌ ఫలితాలు తేల్చేశాయా..?

టీడీపీకి అనుకూలమైన మ‌డ‌క‌శిర వంటి చోట కూడా 20 వార్డుల‌కు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16 వార్డుల్లో విజ‌యం సాధించ‌డం గ‌మ‌నార్హం. చాలా ప‌రిమిత మున్సిపాలిటీల్లో మాత్రమే టీడీపీ క‌నీసం చెప్పుకోద‌గిన స్థాయిలో పోటీ ఇస్తూ ఉంది. క్లీన్ స్వీప్ లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సునాయాసం అవుతున్నాయి. వార్డుల విజ‌యాల మెజారిటీల ప్రకారం అనౌన్స్ అవుతున్న అన్ని మున్సిపాలిటీల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ‌యం న‌మోదు చేసింది. 20 మున్సిపాలిటీల‌పై క్లారిటీ వ‌స్తే.. ఇంతవరకు ఒక్కచోట కూడా టీడీపీ తన సత్తా చాటలేకపోయింది. ఇంతవరకు ఒక్క మున్సిపాలిటీని కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

ఇక.. 75 మున్సిపాలిటీల‌పైనా క్లారిటీ వ‌చ్చేస‌రికి.. టీడీపీ క‌నీసం సింగిల్ డిజిట్ నంబ‌ర్‌‌ను కూడా దాటే పరిస్థితులైతే కనిపించడం లేదు. ఫ‌లితాల‌పై పూర్తి స్పష్టత వ‌చ్చే స‌రికి.. క‌నీసం ప‌ది మున్సిపాలిటీల్లో కూడా ప్రధాన ప్రతిప‌క్ష పార్టీ విజ‌యం సాధించ‌లేక‌పోతే.. ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకం కావ‌డం ఖాయంగా కనిపిస్తోంది.