AP Financial Crisis : దివాలా దిశగా ఏపీ.. రూ.20వేల కోట్ల చెల్లించలేక చేతులెత్తేసిందే?

AP Financial Crisis:  అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటిలా మారి ఏపీ పరిస్థితి.. ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే.. జగన్ సీఎం కాగానే చేసిన మొదటి పని గత చంద్రబాబు ప్రభుత్వం వివిధ విద్యుత్ సంస్థలతో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలన్నింటిని రద్దు చేయడం.. ఇదే ఇప్పుడు ఏపీకి అప్పుల కుప్పలు మిగిల్చి దివాలా తీసే దుస్థితికి దిగజార్చింది. ఒకటి కాదు.. రెండు కాదు.. 20వేల కోట్ల రూపాయల బకాయిలను తీర్చలేక జగన్ ప్రభుత్వం చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది. ఈ తీవ్ర […]

Written By: NARESH, Updated On : May 5, 2022 11:49 am
Follow us on

AP Financial Crisis:  అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటిలా మారి ఏపీ పరిస్థితి.. ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే.. జగన్ సీఎం కాగానే చేసిన మొదటి పని గత చంద్రబాబు ప్రభుత్వం వివిధ విద్యుత్ సంస్థలతో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలన్నింటిని రద్దు చేయడం.. ఇదే ఇప్పుడు ఏపీకి అప్పుల కుప్పలు మిగిల్చి దివాలా తీసే దుస్థితికి దిగజార్చింది. ఒకటి కాదు.. రెండు కాదు.. 20వేల కోట్ల రూపాయల బకాయిలను తీర్చలేక జగన్ ప్రభుత్వం చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది. ఈ తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏపీని కుదిపేస్తోంది.

Jagan

-విద్యుత్ ఒప్పందాల రద్దే కొంపముంచిందా?
వైసీపీ ప్రభుత్వం ఏర్పడగానే చంద్రబాబు తక్కువ ధరకు సంప్రదాయేతర విద్యుత్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను (పీపీఏ)లను జగన్ రద్దు చేశారు. దీంతో ఆ సంస్థలు కోర్టులకు ఎక్కాయి. కేంద్రంలో ఇలా చేయవద్దని జగన్ సర్కార్ ను హెచ్చరించినా వినలేదు. ఇక చంద్రబాబు హయాంలో తీసుకున్న విద్యుత్ కు బిల్లులు కూడా చెల్లించడం ఆపేశారు. పీపీఏల ప్రకారం విద్యుత్ తీసుకున్నా బిల్లులు ఇవ్వలేదు. దాంతో ఆ కంపెనీలు కోర్టును ఆశ్రయించాయి. విచారణ తర్వాత బకాయిలు, భవిష్యత్తు ధరలు పీపీఏల్లో పేర్కొన్న ప్రకారమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, డిస్కంలకు హైకోర్టు తేల్చిచెప్పింది. దీంతో అప్పటివరకూ చెల్లించకుండా ఆపేసిన మొత్తం దాదాపు రూ.20వేల కోట్లుగా తేలింది. ఇప్పుడా సొమ్మును కట్టే స్తోమత.. ఆర్థిక వనరులు జగన్ సర్కార్ వద్ద లేకపోవడంతో ఇప్పుడు చేతులెత్తేసింది. దివాలా పిటీషన్ వేసేందుకు సిద్ధమమవుతోందన్న ప్రచారం సాగుతోంది.

Also Read: Body Builder Selling Onions: కండల వీరుడికి ఏంటీ దుస్థితి.. ఆఖరుకు ఉల్లిపాయలు ఎందుకు అమ్ముతున్నాడే!

-విద్యుత్ సంస్థలు దివాలా..
విద్యుత్ సంస్థలు పెద్ద ఎత్తున రుణాల ఊబిలో ఉన్నాయని.. ఆ సంస్థ ఆర్థిక కష్టాలను హైకోర్టు ముందు ఏకరువు పెడుతోంది ప్రభుత్వం. ఇలా దివాలా తీయడానికి జగన్ సర్కారే కారణం. చంద్రబాబు రూ.5లోపే యూనిట్ కు విద్యుత్ కొనేందుకు ఒప్పందం చేసుకున్నారు. కానీ వాటిని రద్దు చేసిన జగన్ బహిరంగ మార్కెట్లో ఏకంగా యూనిట్ కు రూ20 చొప్పున కొని సరఫరా చేశారు. అదే కొంప ముంచింది. తీవ్ర ఆర్థిక నష్టాల్లో విద్యుత్ సంస్థలు కూరుకుపోయేలా చేసింది.

-అంతర్జాతీయంగానూ జగన్ కు దెబ్బ
ఇక చంద్రబాబు ప్రభుత్వంలో విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయడంతో ఏపీ ప్రభుత్వంపై పెట్టుబడిదారుల్లో నమ్మకం పోయింది. అంతర్జాతీయంగానూ పెట్టుబడిదారుల్లో ఏపీపై అపనమ్మకాలు పెరిగాయి. దావోస్ లాంటి చోట్ల పెట్టుబడుల సదస్సుల్లోనూ ఏపీ గురించి చర్చకు దారితీసింది. జగన్ సర్కార్ ను నమ్మి పెట్టుబడులు, విద్యుత్ ఒప్పందాలకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఇప్పుడు విద్యుత్ పీపీఏలు జరగని పరిస్థితి నెలకొంది. దీనివల్ల ఏపీ ప్రజలపై ప్రత్యక్షంగానే రూ.20వేల కోట్ల భారం పడుతోంది.

-చేతులెత్తేసిన జగన్ ప్రభుత్వం.. హైకోర్టు, కేంద్రం ఏం చేస్తుంది?
పాత పీపీఏల సొమ్ము రూ.20 వేల కోట్ల సొమ్ము కట్టలేమంటున్న ప్రభుత్వం వాదనపై హైకోర్టు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. విద్యుత్ సంస్థలకు పీపీఏల ప్రకారం చెల్లించడం విఫలమైతే.. తాను నేరుగా ఆర్బీఐ నుంచి రాష్ట్ర నిధులు చెల్లిస్తామని గతంలో కేంద్ర విద్యుత్ మంత్రి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు విద్యుత్ సంస్థలకు బకాయిలు చెల్లించేందుకు రూ.20వేల కోట్లు తమ దగ్గర లేవని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. దీంతో దీనిపై హైకోర్టు, కేంద్రం ఏం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది.

Also Read: AP Employees: ఏపీలో ఉద్యోగుల సమస్యలు తీర్చరా?