ఇంటర్ ఫలితాలు విడుదల.. కృష్ణా జిల్లా టాప్

ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ పరీక్షా ఫలితాలను విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. విజయవాడలో ఓ హోటల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ ప్రభావం రీత్యా ఇవాళ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. దేశంలొనే ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. పరీక్షలు నిర్వహించాం కాని అనేక సవాళ్ళను ఎదుర్కొన్నామని చెప్పారు. వాల్యూయేషన్ మొదలు పెట్టిన నాలుగురోజులుకే […]

Written By: Neelambaram, Updated On : June 12, 2020 6:03 pm
Follow us on

ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ పరీక్షా ఫలితాలను విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. విజయవాడలో ఓ హోటల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ ప్రభావం రీత్యా ఇవాళ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. దేశంలొనే ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. పరీక్షలు నిర్వహించాం కాని అనేక సవాళ్ళను ఎదుర్కొన్నామని చెప్పారు. వాల్యూయేషన్ మొదలు పెట్టిన నాలుగురోజులుకే లాక్ డౌన్ ను కేంద్రం ప్రకటించిందన్నారు. ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యూయేషన్ కు సెంటర్లను పెంచామని, 25 వేల మందిని స్పాట్ వాల్యూయేషన్ కు ఉపయోగించినట్లు చెప్పారు.

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను 5,07,230 విద్యార్ధినీ, విద్యార్ధులు రాశారని చెప్పారు. వీరిలో 3,00,560 ఉత్తీర్ణత సాధించారన్నారు. ఉత్తీర్ణత శాతం 59 గా ఉందని చెప్పారు. మొదటి ఏడాది పరిక్షలను 2,57,169 మంది బాలికలు రాశారని, వీరిలో 1,64,365 మంది బాలికలు ఉత్తీర్ణత సాధిచారని చెప్పారు. 54 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. మొదటి ఏడాది పరిక్షలు 2,49,611బాలురు రాశారని, వీరిలో 1,36,195 మంది బాలురు ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. 55 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.

రెండవ సంవత్సరం పరీక్షలు 4,35,655 మంది విద్యార్దినీ, విద్యార్దులు రాశారని చెప్పారు. వీరిలో 2,76,389 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. 63 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. రెండవ సంవత్సరం పరీక్షలు 2,22,798 మంది బాలికలు రాశారని, వీరిలో 1,49,010 మంది ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. బాలికల్లో ఉత్తీర్ణత 67 శాతం ఉందన్నారు. రెండ సంవత్సరం పరీక్షలు 2,12,857 బాలురు రాయగా, వీరిలో 1,27,379 మంది ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. బాలుర ఉత్తీర్ణత 60 శాతంగా ఉందన్నారు.

ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ కలిపి పరీక్షలు 10, 65,155 మంది రాశారన్నారు. ఇంటర్ లో గ్రేడ్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో మొదటి సంవత్సరం ఫలితాల్లో సబ్జెక్ట్ లవారీగా మార్కులు మంత్రి ప్రకటించారు. రెండవ సంవత్సరం పలితాల్లో సబ్జెక్ట్ లవారీగా గ్రేడ్ పాయింట్లలో పలితాలు ప్రకటించారు. ఇంటర్ పరీక్షల ఫలితాలకు సంబంధించి ఫిర్యాదులుంటే 18002749868 నెంబరులో పిర్యాదు చేయవచ్చని మంత్రి తెలిపారు.

ఇంటర్‌ఫస్ట్ ఇయర్ టాప్ 3 జిల్లాలు

1. కృష్ణా ( 75శాతం)
2. వెస్ట్ గోదావరి, గుంటూరు (65 శాతం)
3. విశాఖ ( 63 శాతం)

ఇంటర్ సెకండియర్ టాప్ 3 జిల్లాలు

1. కృష్ణా ( 75 శాతం )
2. వెస్డ్ గోదావరి ( 71 శాతం )
3. నెల్లూరు, విశాఖపట్నం ( 68 శాతం )