G.O. No 1 : అధికారం చేతిలో ఉంది.. ఏమైనా చేయవచ్చన్న అహంకారం ఉంది. ఇంకేం.. ప్రతిపక్షాల సభల్లో చావులను బూచీగా చూపి జగన్ సర్కార్ జీవోనంబర్ 1 తీసుకొచ్చింది. చంద్రబాబు కందుకూరు సభలో 8 మంది మరణించడంతో ఇకప్రతిపక్షాలకు వాయిస్ లేకుండా వారు సభలు సమావేశాలు చేసుకోకుండా రహదారులపై సభలు, సమావేశాలకు అనుమతులు లేవంటూ జగన్ ప్రభుత్వం జీవో నంబర్ 1 తీసుకొచ్చింది. అందుకే కుప్పంలో చంద్రబాబు సభకు అనుమతి ఇవ్వలేదు. అలాగే పవన్ కళ్యాణ్ మీటింగ్ లను అడ్డుకున్నారు.

అయితే జగన్ సర్కార్ ఈ అన్యాయ జీవోపై సీపీఐ న్యాయపోరాటం చేసింది. జీవోనంబర్ 1ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టుకెక్కారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా జీవో జారీ చేసిందని పిటీషన్ లో పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నిబంధనలకు విరుద్దంగా ఉందని.. బ్రిటీష్ కాలం నాటి నిర్బంధపు జీవోను ఇప్పుడు అమలు చేస్తున్నారని వాదించారు.
ఈ క్రమంలోనే జీవోనంబర్ 1ను ఈనెల 23 వరకూ సస్పెండ్ చేస్తూ హకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.
ఇప్పటికే టీడీపీ,జనసేనలు తమకు సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వడం లేదని ఆందోళన చేస్తున్నాయి. ఈరోజు శ్రీకాకుళంలోని రణస్థలంలో పవన్ ‘యువగళం’ సభ నిర్వహిస్తున్నారు. దీనికి ఆంక్షలు ఎదురయ్యాయి. అలాగే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సభలకు కూడా పోలీసులు పర్మిషన్ ఇచ్చి మార్చి వేధించారు. ఇప్పుడు హైకోర్టు ఈ బ్రిటీష్ కాలం నాటి నల్ల జీవోను సస్పెండ్ చేసి జగన్ సర్కార్ కు గట్టి షాకిచ్చింది. ఈ విషయంలో ప్రతిపక్షాలే విజయం సాధించాయి. జగన్ సర్కార్ మెడలు వంచాయి.