
ఆనందయ్య మందుపై అందరికీ అంచనాలు పెరుగుతున్నాయి. కరోనా రెండో దశ కల్లోలం రేపుతుంటే ఆనందయ్య మందుకు డిమాండ్ పెరుగుతోంది. ఆయన మందు పంపిణీకి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో రెండు పిటిషన్లు వేశారు. ప్రభుత్వం కూడా తన అభిప్రాయాన్ని హైకోర్టుకు విన్నవించింది. కరోనా కేసుల వ్యాప్తి దృష్ట్యా ఆనందయ్య మందు పంపిణీ కి ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఆనందయ్య మందుపై అధ్యయనం చేస్తున్నారు. ఎల్లుండి రిపోర్టులు వస్తాయని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
విచారణ సందర్బంగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తమ వాదనలు వినిపించాయి. రాష్ర్ట ప్రభుత్వం అసలు ఆనందయ్య త మందును ఆయుర్వేద కౌన్సిల్ లో రిజిస్టర్ చేసుకోలేదు. దీంతో ఆనందయ్య తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ స్పందిస్తూ మందును ప్రభుత్వం గుర్తించాలని ఇప్పటికే పిటిషన్ వేశారని గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ అసలు ఆనందయ్య మందులో ఏం కలుపుతున్నారో తెలిపాలి. దాని వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుంటే కేంద్ర ఆయుష్ శాఖ అనుమతి ఇస్తుంది. ఆనందయ్య మందు పంపిణీ ఆపాలని లోకాయుక్త ఎలా ఆదేశాలు ఇస్తుందని పిటిషనర్ తరఫు న్యాయవాది కృష్ణయ్య ప్రశ్ణించారు. ఆనందయ్య ప్రైవేటుగా మందు తయారు చేస్తున్నారని మరో పిటిషనర్ న్యాయవాది బాలాజీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో హైకో ర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఆనందయ్య మందు పంపిణీపై ప్రభుత్వం, కోర్టు అనుమతి ఇచ్చి ప్రజలకు సమస్య లేకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. దీంతో కరోనా రోగులకు ఉపశమనం కలిగించే విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని కో రుతున్నారు. రోజుల తరబడి తాత్సారం చేయకుండా మందు పంపిణీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.