PRC: ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ సంఘాల్లో ఆందోళన నెలకొంది. పీఆర్సీ విషయంలో ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రాకముందే జగన్ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకే పీఆర్సీ ఇవ్వాలని కోరుతున్న ప్రభుత్వం సరిగా స్పందించడం లేదు. దీంతో ఉద్యోగులు ప్రభుత్వంపై పోరుకే సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్నారు.
ఉద్యోగ సంఘాలు దాదాపు 71 డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచినా వాటి పరిష్కారానికి పచ్చజెండా ఊపలేదు. దీంతో చర్చలు సఫలం కావడం లేదు. మరోమారు రేపు కూడా చర్చలు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అయినా ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కాన రావడం లేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు వర్సెస్ ప్రభుత్వం అనే ధోరణిలో మారిపోతోంది.
మరోవైపు ఉద్యోగ సంఘాలు చెబుతున్న డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో సమస్య ఇంకా అపరిష్కృతంగానే మిగులుతోంది. సీపీఎస్ విషయంలో కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదు. దీంతో ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం మరోమారు సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వచ్చే రెండు రోజుల్లో సీఎంతో సమావేశం ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
Also Read: Perni Nani: పేర్ని నాని ఇన్నాళ్లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కాదట?
ఫిట్ మెంట్ పై కూడా ఉద్యోగులు కోరిన విధంగా చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. 50 శాతం ఫిట్ మెంట్ కావాలని ఉద్యోగ సంఘాలు కోరుతుండగా ప్రభుత్వం మాత్రం అంత మొత్తంలో ఇవ్వలేమని చెబుతోంది. దీంతో దీనిపై కూడా ఎలాంటి పరిష్కారం కానరావడం లేదు. దీంతో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం తమదే పైచేయిగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏదిఏమైనా ఏపీలో ఉద్యోగ సంఘాలు వర్సెస్ ప్రభుత్వం అన్న చందంగా పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది.
Also Read: Chandrababu Pawan: చంద్రబాబు, పవన్ మళ్లీ కలవబోతున్నారోచ్!