AP Employees GPF Money ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ డబ్బులు మాయం అయ్యాయి. ఉద్యోగుల కోసం జమ చేసిన రూ.800 కోట్లు వైసీపీ ప్రభుత్వం ఎటు మళ్లించిందన్నది చర్చనీయాంశమైంది. వైసీపీ ప్రభుత్వ పెద్దలకు సూట్ కేసు కంపెనీలు పెట్టి, దొంగ లెక్కలు రాసిన అనుభవంతో కాగ్ కళ్ళకు గంతలు కట్టేలా నివేదికలు ఇచ్చారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. పథకాల లబ్ధిదారుల లెక్కల్లోనూ మాసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్ సొమ్ములను వారికి తెలియకుండా ప్రభుత్వమే మాయం చేయడం విస్మయం కలిగిస్తోంది.
ఇప్పటి వరకూ వెలుగులోకి వచ్చిన లెక్కల ప్రకారం రూ.800 కోట్లు సొమ్మును ప్రభుత్వం మళ్లించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగుల ఖాతాల్లో ఉన్న ఈ డబ్బులు వారికి తెలియకుండా తీసేసుకోవడం అంటే మోసం చేయడమేనన్నారు. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక పాలన ఆశ్చర్యం కలిగిస్తోంది. జీపీఎఫ్ ఖాతాలోని డబ్బులను డ్రా చేసుకొనే అధికారం కేవలం ఉద్యోగికి మాత్రమే ఉంటుంది. ప్రభుత్వం ఆ నిధికి కేవలం కస్టోడియన్ మాత్రమే. కాపలాదారే దోపిడీకి పాల్పడితే ఎలా? వైద్య ఖర్చులకో, బిడ్డ పెళ్ళికో, చదువులకో పీఎఫ్ డబ్బుల కోసం దరఖాస్తు చేస్తే నెలల తరబడి అనుమతి ఇవ్వకుండా పెండింగ్లో ఉంచుతున్న వైసీపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల సొమ్మును వారికి తెలియకుండానే తీసేసుకొంటోంది.. అంటే ఈ పాలకుల ఆర్థిక క్రమశిక్షణ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఉద్యోగులకు కరవు భత్యం పీఎఫ్ ఖాతాలో వేసినట్లే వేసి వెనక్కి తీసుకోవడం ద్వారా మోసం చేయడమే. అలాగే రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా నిలుపుదల చేస్తోంది. రూ.800 కోట్లను ఎటు మళ్లించారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఏకంగా 90వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు మాయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 6 నెలలుగా డీఏ రూపంలో ప్రభుత్వం ఇచ్చిన డబ్బు డెబిట్ అయ్యిందని ఉద్యోగులు అంటున్నారు. డబ్బులు తీసుకున్నది ఎవరు అని వారు ప్రశ్నిస్తున్నారు. విషయం ఏంటో తెలుసుకుందామని వెళితే ఆర్థిక శాఖ అధికారులు అందుబాటులో లేరని అంటున్నారు. గతంలోనూ ప్రభుత్వం ఇదే తరహాలో డబ్బు తీసుకొని మళ్లీ చేసిందని ఉద్యోగులు అంటున్నారు. దీంతో వైసీపీ ప్రభుత్వంపైనే విమర్శలు వస్తున్నాయి.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Ap govt employees gpf money missing in accounts
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com