https://oktelugu.com/

AP Night Curfew: కరోనా కట్టడికి ఏపీ సర్కారు క‌ఠిన ఆంక్ష‌లు..

AP Night Curfew: ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో కట్టడికి ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతీ రోజు రాత్రి 11 గంటల నుంచి మార్నింగ్ 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది. నైట్ కర్ఫ్యూకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇకపోతే కొవిడ్ […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 10, 2022 5:32 pm
    Follow us on

    AP Night Curfew: ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో కట్టడికి ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతీ రోజు రాత్రి 11 గంటల నుంచి మార్నింగ్ 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది.

    AP Night Curfew

    AP Night Curfew

    నైట్ కర్ఫ్యూకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇకపోతే కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కేసుల వ్యాప్తి నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీలోని థియేటర్స్ 50 శాతం ఆక్సుపెన్సీతో రన్ చేయాలని ప్రభుత్వం సూచించింది. మాల్స్, వ్యాపార సముదాయల నిర్వహణ కొవిడ్ నిబంధనల మేరకు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు కంపల్సరీగా ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని ఏపీ సర్కారు సూచిస్తోంది. కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్న ఆదేశాల మేరకు అధికారులు ఆ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలోని ప్రతీ నియోజకవర్గంలో ఒక కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు.

    Also Read: ఏపీని తాకిన కరోనా ఎఫెక్ట్: ఆంక్షలివీ.. రాత్రిళ్లు బయటకెళితే అంతే..!

    బహిరంగ కార్యక్రమాల్లో 200 మంది, ఇండోర్ కార్యక్రమాల్లో 100 మంది మాత్రమే ఉండాలని, అంతకు మించిన మంది ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఏపీ సీఎం దిశా నిర్దేశం చేశారు. ప్రజలంతా మాస్కులు ధరించాలని సూచించారు. బస్సుల్లో ప్రయాణించే క్రమంలోనూ మాస్కులు కంపల్సరీ చేశారు. మాస్కు ధరించని వారికి జరిమానా విధించనున్నారు. అధికారులు కొవిడ్ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. నైట్ కర్ఫ్యూతో కేసులు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

    దేశంలోనూ కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బాగా పెరుగుతున్నాయి. ప్రతీ రోజు లక్షన్నరకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూలు ఇప్పటికే విధించాయి. తాజాగా ఏపీ సర్కారు విధించింది. ప్రతీ ఒక్కరు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు మాస్కు ధరించి , భౌతిక దూరం పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

    Also Read: పేర్నినానితో వర్మ భేటి: పవన్, బాలయ్యలపై హాట్ కామెంట్స్

    Tags