ఆ భారీ ప్రాజెక్టులు ఆపండి.. తెలంగాణకి షాక్!

తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ కు ఏపీ ఫిర్యాదు చేసింది. దీంతో గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు, గోదావరిపై నిర్మిస్తున్న భారినీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది. ఆ మేరకు బోర్డు విచారణ జరిపి ఆదేశాలు జారీ చేసింది. దీంతో  కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలకు గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు బ్రేకులు వేసినట్లైంది. గోదావరి రివర్ మేనేజ్ మెంట్ […]

Written By: Neelambaram, Updated On : June 1, 2020 4:25 pm
Follow us on

తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ కు ఏపీ ఫిర్యాదు చేసింది. దీంతో గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు, గోదావరిపై నిర్మిస్తున్న భారినీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది. ఆ మేరకు బోర్డు విచారణ జరిపి ఆదేశాలు జారీ చేసింది. దీంతో  కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలకు గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు బ్రేకులు వేసినట్లైంది.

గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు వెబ్ సైట్‌ లో ఉన్న వివరాల ప్రకారం గోదావరి నది మీద తెలంగాణలో మొత్తం 16 ప్రాజెక్టులు పనులు జరుగుతున్నాయి. అందులో ప్రాణహిత చేవెళ్ల, దుమ్ముగూడెం, దేవాదుల, కాళేశ్వరం ఎల్ఐఎస్, లెండి, లోయర్ పెన్ గంగ, మిడ్ మానేర్ డ్యామ్, లాంటి న్ని ప్రాజెక్టులు ఉన్నాయి. మరోవైపు కృష్ణా జలాల వినియోగంపై గతంలో రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదానికి సంబంధించి రెండు రాష్ట్రాలు సమావేశమై చర్చించనున్నాయి. కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు మీటింగ్ జూన్ 4న జరగనుంది. శ్రీశైలం ఎగువన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా రాయలసీమకు తరలించడానికి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో ఆ విషయం మీద తెలంగాణ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది.