Homeఆంధ్రప్రదేశ్‌Unemployed in AP: జాబు లేదు..కేలండర్ లేదు.. ఉద్యోగాల భర్తీని మరిచిన ఏపీ సర్కారు

Unemployed in AP: జాబు లేదు..కేలండర్ లేదు.. ఉద్యోగాల భర్తీని మరిచిన ఏపీ సర్కారు

Unemployed in AP: టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు డీఎస్సీ నోటిపికేషన్ ఇచ్చారు. అప్పుడు ఉన్న ఖాళీల ప్రాప్తికి పోస్టులు భర్తీ చేయాలని భావించారు. అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ ‘అవి ఒక ఉద్యోగాలేనా’ అంటూ ఎద్దేవా చేశారు. అంతటితో ఆగకుండా రాష్ట్రంలో వివిధ శాఖల్లో రెండు లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. దేవుడు దయతలచి మన ప్రభుత్వం వస్తే ఉద్యోగాల విప్లవం అన్నది చూస్తారంటూ ప్రకటించారు. కనీవినీ ఎరుగని రీతిలో ఉద్యోగాల కల్పన ఉంటుందని చెప్పుకొచ్చారు. దీంతో నిరుద్యోగ యువత ఆశలు పెట్టుకున్నారు. అత్యధిక మెజార్టీతో జగన్ ను గెలిపించారు. సీన్ కట్ చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటుతోంది. ఉద్యోగాలు లేవు. నోటిఫికేషన్లు కానరావడం లేదు.అధికారంలోకి వచ్చాక లక్షల పోస్ట్లులు వేలల్లోకి వచ్చేశాయి. అవసరం ఉన్నప్పటికీ వందల సంఖ్యలో ఉద్యోగాల్ని భర్తీ చేయలేదు. అంతేకాదు.. భర్తీచేస్తామని ప్రకటించిన కొద్ది పోస్టుల ఊసు కూడా ఎత్తడం లేదు. 2021-22లో 10,143 పోస్టులను భర్తీ చేస్తామని.. ఏడాదిక్రితం ప్రకటించారు. సరిగ్గా గత ఏడాది జూన్‌ 18న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా ఈ జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఏ నెల ఏ ఉద్యోగ నోటిఫికేషన్‌ వస్తుందో కూడా ప్రకటించారు. అన్ని నోటిఫికేషన్ల కింద ఇచ్చే ఉద్యోగాలను ఒక ఏడాదిలోనే భర్తీ చేస్తామని చెప్పారు. దీనిపై గొప్పగా ప్రచారం చేసుకున్నారు. ‘ఉద్యోగాల విప్లవం’ అని సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు ఊసు లేకుండా పోయింది.

Unemployed in AP
JAGAN

సరిగ్గా ఏడాది కిందట..
ఏడాది కిందట ప్రకటించిన 2021-22 జాబ్‌ క్యాలండర్‌లో భర్తీ చేస్తామని ప్రకటించిన పోస్టుల సంఖ్య 10,143. వీటిలో గ్రూప్‌-1, గ్రూప్‌-2పోస్టులు 36గా పేర్కొన్నారు. వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 36 పోస్టులతోనే క్యాలెండర్‌ ప్రకటిస్తారా? అని నిరుద్యోగులంతా భగ్గుమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. నిరుద్యోగ సంఘాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. దీంతో ప్రభుత్వం ఈ పోస్టుల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. సుమారు 292 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించింది. గ్రూప్‌-1లో 110, గ్రూప్‌-2లో 182పోస్టులు.. మొత్తం కలిపి 292 పోస్టులు చూపించింది. వాస్తవానికి ఇది కూడా పెద్ద సంఖ్యేమీ కాదు. అయినప్పటికీ జరిగిందేంటి? ఏం చేశారు? అనేది పరిశీలిస్తే.. అసలు ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్‌ కూడా రాలేదు. ఈ తేదీ నాటికి పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. కనీసం ఆ పోస్టుల భర్తీకి అవసరమైన ప్రక్రియ కూడా ప్రారంభించలేదు. దీనిపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.

Also Read: AP Liquor Policy: ఏపీ ప్రజలంటే అంత అలుసా జగన్ సార్?

పోలీస్ శాఖలో..
గత ప్రభుత్వాలు పోలీస్ శాఖలో నిత్యం పోస్టులు భర్తీ చేశాయి. కానీ వైసీపీ ఆ రికార్డును బ్రేక్ చేసింది. పోలీసు శాఖలో 450 పోస్టులు భర్తీ చేస్తామని జాబ్‌ క్యాలండర్‌లో ప్రకటించారు. అందులోను ఒక్క పోస్టునూ భర్తీచేయలేదు. విద్యాశాఖలో డిగ్రీ కళాశాల లెక్చరర్లు 240, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 2000 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. వీటి భర్తీకి కనీసం నోటిఫికేషన్‌ కూడా రాలేదు. అదేవిధంగా ఇతర పోస్టులు 36 భర్తీ చేస్తామని ప్రకటించారు. వాటి సంగతీ అలానే ఉంది. వైద్యశాఖలో పారామెడికల్‌, ఫార్మాసి్‌స్టలు, ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు భర్తీచేస్తామని హామీ ఇచ్చారు. ఇవి ఎక్కడికక్కడ రెగ్యులర్‌ అవసరాల ప్రాతిపదికన భర్తీచేసేవి. పైగా, కొవిడ్‌ కాలంలో అవసరం ఉండడంతో వీటిని మాత్రం భర్తీచేశారు. అన్నీ చూస్తే ఉద్యోగాల విప్లవం అని ప్రకటించిన ప్రభుత్వం.. కనీసం కొన్ని పోస్టులనూ భర్తీ చేయడంలో విఫలమైందని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు.

Unemployed in AP
JAGAN

పోస్టుల్లో కోతలు
పోస్టుల భర్తీ మాట దేవుడెరుగు. గతంలో నోటిఫికేషన్ లో చెప్పిన పోస్టులకు కూడా భారీ కోత పెట్టింది. గతంలో చెప్పిన మాటలకు-ఇప్పుడు ప్రకటిస్తున్న పోస్టులకు అసలు పొంతనే లేదు. గతంలో ఎన్నికల ముందు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేస్తాం అన్నారు. ఈ అతిపెద్ద హామీని అలవోకగా ప్రచారం చేసుకున్నారు. నిరుద్యోగులు నమ్మారు. కానీ, ఈ రోజు ఉద్యోగాల భర్తీ ఊసేలేదు. వలంటీర్ల ఉద్యోగాలు ఇచ్చి వాటిని భర్తీ చేశామని చెప్తున్నారే తప్ప.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని మాత్రం పక్కన పెట్టేశారని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏటా 6,500 పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. కానీ, గత రెండేళ్లలో ఏ ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. మరోవైపు డీఎస్సీ వేసి ఉపాధ్యాయ పోస్టులను భారీగా భర్తీచేస్తామని.. మెగా డీఎస్సీ వేస్తామని ఎన్నికల ముందు ఊదర గొట్టారు. కానీ, మూడేళ్లవుతున్నా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు.

Also Read:Aginpath Protest: నిన్న కాంగ్రెస్ ఆందోళన.. నేడు సికింద్రాబాద్ లొల్లి.. బీజేపీ కోసమే తెలంగాణ సర్కార్ లైట్ తీసుకుందా?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular