Cinema Ticket Rates : సినిమా టికెట్ల జీవో జారీ.. మళ్ళీ దెబ్బేసిన జగన్ !

Cinema Ticket Rates : సినిమా టికెట్ ధరలపై తాజాగా  జగన్ ప్రభుత్వం  జీవో జారీ చేసింది.  చిరంజీవి లాబీయింగ్ వర్క్ అవుట్ అవుతుంది అని, సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై  చిరంజీవితో  సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని.. ఇక భారీ బడ్జెట్ చిత్రాల  టికెట్ సమస్యలు తీరిపోయినట్టే అని ఇలా చాలా కామెంట్స్ వినిపించాయి. కానీ, తాజాగా  జారీ చేసిన జీవోని చూస్తే..  టికెట్ రేట్ల విషయంలో  జగన్  ప్రభుత్వం సినిమా పరిశ్రమను మళ్లీ  దెబ్బ కొట్టింది.  చిరంజీవి.. మహేష్, ప్రభాస్ లను తీసుకుని వెళ్లి రెండు చేతులు జోడించి […]

Written By: Raghava Rao Gara, Updated On : March 7, 2022 10:52 pm
Follow us on

Cinema Ticket Rates : సినిమా టికెట్ ధరలపై తాజాగా  జగన్ ప్రభుత్వం  జీవో జారీ చేసింది.  చిరంజీవి లాబీయింగ్ వర్క్ అవుట్ అవుతుంది అని, సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై  చిరంజీవితో  సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని.. ఇక భారీ బడ్జెట్ చిత్రాల  టికెట్ సమస్యలు తీరిపోయినట్టే అని ఇలా చాలా కామెంట్స్ వినిపించాయి.

కానీ, తాజాగా  జారీ చేసిన జీవోని చూస్తే..  టికెట్ రేట్ల విషయంలో  జగన్  ప్రభుత్వం సినిమా పరిశ్రమను మళ్లీ  దెబ్బ కొట్టింది.  చిరంజీవి.. మహేష్, ప్రభాస్ లను తీసుకుని వెళ్లి రెండు చేతులు జోడించి వినమ్రంగా వేడుకున్నా జగన్ మనసు మారలేదు. కాస్త అటు ఇటుగా తన శైలి టికెట్ రేట్లను నిర్ణయించి జీవోని విడుదల చేశారు.

మరి  కొత్త జీవోను బట్టి ఏపీలో సినిమా టికెట్ల ధరలను రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయించింది.   గరిష్ఠ ధర రూ.250,  కనిష్ఠ ధర రూ.20గా నిర్ణయించింది. ఈ రేట్లపై జీఎస్టీ అదనంగా ఉంటుంది.

-మున్సిప‌ల్ కొర్పొరేష‌న్స్‌లో సినిమా టికెట్ ధ‌ర‌లు..

నాన్ ఏసీ థియేటర్స్‌ లో నాన్ ప్రీమియం -రూ.40…   ప్రీమియం – రూ.60

ఏసీ థియేట‌ర్స్‌లో నాన్ ప్రీమియం – రూ. 70… ప్రీమియం -రూ. 100

స్పెష‌ల్ థియేట‌ర్స్ నాన్ ప్రీమియం – రూ.100 …. ప్రీమియం – రూ. 125

మ‌ల్టీ ప్లెక్స్ థియేట‌ర్స్ రెగ్యుల‌ర్ – రూ. 150.. రెక్‌లైన‌ర్ – రూ. 250

 

-అలాగే జగన్ ప్రభుత్వం కొన్ని విషయాల్లో  వెసులుబాటు కల్పించింది.  

100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు రేట్లు పెంచుకునే వెసులుబాటును కల్పించింది.

హీరో, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా బడ్జెట్ ఆధారంగా రేట్ల పెంపుకు అనుమతిని ఇచ్చింది.

సినిమా విడుదలయ్యాక కనీసం 10 రోజులు రేట్లు పెంచుకునే అవకాశాన్ని కల్పించింది.

కనీసం 20% షూటింగ్ ఏపీలో చేసిన సినిమాలకు మాత్రమే రేట్లు పెంచుకోవచ్చు

చిన్న సినిమాలకు రోజుకు 5 షోలు వేసుకునే వెసులుబాటును కల్పించింది.

మొత్తానికి  చిరంజీవి లాబీయింగ్ తేలిపోయింది అని, జీవో నిరాశ పరిచింది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.