AP Government employees: తప్పెవరిది?: ఏపీ ఉద్యోగులదా? జగన్ సర్కార్ దా?

AP Government employees: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేశారు. పీఆర్సీ, టీఏ, డీఏ కోసం ప్రభుత్వాన్నే ఢీకొంటున్నారు. తమ కోరికలు తీర్చకపోతే సమ్మెకు అయినా వెనుకాడమని హెచ్చరించారు. అంతేకాదు.. 1వ తేదీ జీతాలు ఇవ్వలేని ఈ సర్కార్ అచేతనాన్ని ఎత్తి చూపి ఎండగట్టారు. అంటు ప్రభుత్వం నుంచి కూడా అంతే ఘాటు స్పందన వచ్చింది. మీరు ఉద్యోగాల్లో కాదు కొనసాగాల్సింది రాజకీయాల్లో అని.. ప్రతిపక్ష పార్టీలో చేరాలని ప్రభుత్వ సలహాదారు ‘సజ్జల’ లాంటి వారు […]

Written By: NARESH, Updated On : December 8, 2021 11:02 am
Follow us on

AP Government employees: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేశారు. పీఆర్సీ, టీఏ, డీఏ కోసం ప్రభుత్వాన్నే ఢీకొంటున్నారు. తమ కోరికలు తీర్చకపోతే సమ్మెకు అయినా వెనుకాడమని హెచ్చరించారు. అంతేకాదు.. 1వ తేదీ జీతాలు ఇవ్వలేని ఈ సర్కార్ అచేతనాన్ని ఎత్తి చూపి ఎండగట్టారు. అంటు ప్రభుత్వం నుంచి కూడా అంతే ఘాటు స్పందన వచ్చింది. మీరు ఉద్యోగాల్లో కాదు కొనసాగాల్సింది రాజకీయాల్లో అని.. ప్రతిపక్ష పార్టీలో చేరాలని ప్రభుత్వ సలహాదారు ‘సజ్జల’ లాంటి వారు కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు వర్సెస్ జగన్ సర్కార్ అన్నట్టుగా పరిస్థితి మారింది.

AP Government employees

గతంలో ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్న జగన్ ను నమ్మి గెలిపించామని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా తమ సమస్యలు పరిష్కరించని జగన్ చేతిలో మోసపోయామని ఉద్యోగులు వాపోతున్నారు. తమ పీఎఫ్ లాక్కున్నారని.. ఎల్ఐసీ లాక్కోవడం.. జీతాలు టైంకు వేయకపోవడం గురించి ఉద్యోగులు తూర్పారపట్టారు. దీంతో ఉద్యోగస్థులు వర్సెస్ ప్రభుత్వంగా పరిస్థితి మారింది.

సీపీఎస్ రద్దు చేయాలన్న ఉద్యోగుల డిమాండ్ అసలు న్యాయమైనది కాదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. సీపీఎస్ కేంద్రం చేతుల్లో ఉంటుందని.. తామేం చేస్తామని వాదిస్తోంది. ఏపీ ఉద్యోగులు మోసపోలేదని.. మోసం చేసేవారని ప్రభుత్వం విమర్శిస్తోంది.

గత ప్రభుత్వాలు, చంద్రబాబును సైతం ఏపీ ఉద్యోగులు మోసం చేశారని వైసీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఇక ఉద్యోగుల తీరును ఎండగడుతున్నారు. ఉమ్మడి ఏపీకి విడిపోయాక ఇదే ఏపీ ఉద్యోగులు హైదరాబాద్ లో వ్యవహరించిన తీరుతో తెలంగాణ ఉద్యోగులు కార్యాలయాలకు తాళాలు వేస్తే నాటి సీఎం చంద్రబాబు ఉద్యోగుల కోసం అమరావతిలో సెక్రటేరియట్ కట్టి వారానికి 5 రోజుల పనిమాత్రమే కల్పించి టీఏలు, డీఏలు, ఏసీ బస్సులు, రైళ్లు కూడా కల్పించి ఉద్యోగులను పెంచి పోషించారని వైసీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. అయినా కూడా ఒళ్లు వంగని.. లంచాలు తింటూ ఇబ్బడిముబ్బడిగా ఖర్చులు చూపించిన ఘనత ఏపీ ఉద్యోగులదని వైసీపీ వాదిస్తోంది. ఆఖరుకు చంద్రబాబును కూడా మోసం చేసిన ఘనత ఏపీ ఉద్యోగులదని.. వీరిపై జాలిపడాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు.

సమైక్య ఉద్యమం నెపంతో రాష్ట్ర ప్రజలను కూడా ఏపీ ఉద్యోగులు మోసం చేశారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దాదాపు 60 లక్షల మంది ఉద్యోగ కుటుంబసభ్యులు ఉన్నారని.. మేమే అధికారంలో ఉన్న పార్టీని శాసించగలమని ఉద్యోగులు అంటున్నారు. కానీ నాడు చంద్రబాబు ఎంతో చేసినా ఆయనకు సహకరించకుండా జగన్ మాట నమ్మి ఈయనకు ఓటేశారు. ఇప్పుడు జగన్ మాట వినకపోవడంతో శాసిస్తామంటున్నారు. ఎన్నికలను మేనేజ్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు.

Also Read: ఎంత అవమానం.. ఒకటో తారీఖు జీతం ఇవ్వాలని ఏపీ సర్కార్ ను డిమాండ్ చేస్తున్నారా?

అయితే ఏపీ ఉద్యోగుల ఆగడాలు సీఎం జగన్ వద్ద పనిచేయవని వైసీపీ వర్గాలు అంటున్నాయి. చంద్రబాబులా జగన్ సాఫ్ట్ కాదని.. ఆయనతో పెట్టుకుంటే ఉద్యోగుల పరిస్థితే అగమ్యగోచరంగా తయారవుతుందని హెచ్చరిస్తున్నారు. జగన్ తో డేంజర్అని.. బెదిరిస్తే ఉడత ఊపులకు బెదిరిస్తే ఆయన బెదరరని.. ఉద్యోగులు జగన్ తో ఫైటింగ్ కంటే సయోధ్యతో మెలిగితేనే బెటర్ అని పలువురు సూచిస్తున్నారు.

ఏపీ ఉద్యోగులకు ఎంతో చేసినా ఇంకా కోరడం.. అప్పుల పాలైన ఏపీ ప్రభుత్వానికి మరింత భారం మోపడం కరెక్ట్ కాదన్న వాదన వినిపిస్తోంది.అసలే అప్పులతో నెట్టుకొస్తున్న ఏపీ ప్రభుత్వానికి.. పన్నులు, ధరాఘాతంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఏదో వెళ్లదీస్తుంటే ఉద్యోగులు ఇలాంటి డబ్బుల్లేని కరోనా టైంలో ఇలా డిమాండ్ చేయడం భావ్యం కాదన్న చర్చ సాగుతోంది. పరిస్థితి అర్థం చేసుకొని గమ్మున ఉండాలని పలువురు సూచిస్తున్నారు.

Also Read: ఏపీ సర్కార్ చేసిన అప్పు ఎంతో తెలుసా?