AP Employees Strike: ఏపీ సర్కార్ కు షాకిచ్చిన ఉద్యోగ సంఘాలు

AP Employees Strike: పీఆర్సీపై తగ్గేదేలే అన్నట్టుగా ఉద్యోగ సంఘాలు వ్యవహరిస్తున్నాయి. ఏపీ సర్కార్ చొరవ తీసుకొని మంత్రుల కమిటీ వేసినా చర్చలకు ససేమిరా అంటున్నాయి. పీఆర్సీ సాధన సమితి డిమాండ్ చేసిన మూడు ప్రధాన అంశాలను పరిష్కరిస్తేనే చర్చలకు వస్తామని మంత్రుల కమిటీకి ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. దీంతో చర్చల ప్రక్రియ ఇవాళ జరగనే లేదు. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాలు మా తదుపరి కార్యాచరణ కొనసాగుతుందని స్పష్టం చేసి ఏపీ సర్కార్ కు షాకిచ్చారు. […]

Written By: NARESH, Updated On : January 25, 2022 5:59 pm
Follow us on

AP Employees Strike: పీఆర్సీపై తగ్గేదేలే అన్నట్టుగా ఉద్యోగ సంఘాలు వ్యవహరిస్తున్నాయి. ఏపీ సర్కార్ చొరవ తీసుకొని మంత్రుల కమిటీ వేసినా చర్చలకు ససేమిరా అంటున్నాయి. పీఆర్సీ సాధన సమితి డిమాండ్ చేసిన మూడు ప్రధాన అంశాలను పరిష్కరిస్తేనే చర్చలకు వస్తామని మంత్రుల కమిటీకి ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. దీంతో చర్చల ప్రక్రియ ఇవాళ జరగనే లేదు.

ap employees

ఈ క్రమంలో ఉద్యోగ సంఘాలు మా తదుపరి కార్యాచరణ కొనసాగుతుందని స్పష్టం చేసి ఏపీ సర్కార్ కు షాకిచ్చారు. ఉద్యోగ సంఘాలు ఎవరూ చర్చలకు వ్యతిరేకంగా లేమని తమ డిమాండ్లను పరిష్కరించకుండా చర్చలకు వెళ్ళేది లేదని స్పష్టం చేశారు.

మరోవైపు ప్రభుత్వం మాత్రం ఎదురుచూసే ధోరణితోనే ఉంది. ఉద్యోగ సంఘాల నేతలు కొంత ఆలస్యంగా అయినా వచ్చారని.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల అన్నారు. నిన్న కూడా ఎదురు చూసామన్నారు. మూడు పాయింట్స్ తో వాళ్ళు లేఖలు ఇచ్చారని.. ఇచ్చిన జీవోలు వెన్నక్కి తీసుకోవడం ఎలా సాధ్య పడుతుందని ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. మీరు కూడా ప్రభుత్వంలో భాగంగా ఉన్నారని.. సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అనే దాని దృష్టి పెడితే బాగుంటుందని సజ్జల ఉద్యోగులకు హితవు పలికారు.

ఇన్ని సార్లు చర్చలు జరిపి మళ్ళీ మొదటి నుంచి చర్చలు అనడం కరెక్టు కాదని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల నేతలు చర్చలకు రావాలని సజ్జల పిలుపునిచ్చారు. ఉద్యోగ సంఘాల ముఖ్య నేతలు 27న చర్చకు రావాలి కోరామన్నారు. ఫిట్ మెంట్ అనేది నిర్ణయం జరిగిపోయిందని.. మిగతా విషయాల మీద చర్చలు జరుపుతామన్నారు. జగన్ ప్రభుత్వం ఎపుడూ ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు..

ఇలా పీఆర్సీ విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా ఉద్యోగ సంఘాలు మొండి పట్టు పట్టుకొని ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం చర్చల పేరుతో బుజ్జగించాలని చూసినా వర్కవుట్ అయ్యేలా లేదు. ఫిబ్రవరి 7లోపు సమ్మె విరమించేలా చేయాలని యోచిస్తున్నారు. మరి అది సాధ్యమవుతుందా? సమ్మె ఆగుతుందా? అన్నది వేచిచూడాలి.