https://oktelugu.com/

AP Employees : ఏపీలో పీఆర్సీ వివాదం మళ్లీ రాజుకుందెందుకు..? సమస్య ఎక్కడ వచ్చింది..?

AP Employees : పీఆర్సీ లొల్లి మళ్లీ మొదలైంది. ఉద్యోగులు సమ్మెకు పోరుబాట పడుతున్నారు. నెల రోజుల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ కోసం పోరాటం చేసిన నేపథ్యంలో సంతృప్తికరమైన ఫిట్ మెంట్ ఉంటుందని సీఎం జగన్ తో సహా మంత్రులు చెప్పుకొచ్చారు. ఆ తరువాత మొత్తానికి జనవరి 7న కొత్త పీఆర్సీ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి నుంచే పీఆర్సీ అమలు చేస్తూ ఫిబ్రవరిలో అందుకు సంబంధించిన వేతనాలు అందిస్తామని సీఎం […]

Written By:
  • NARESH
  • , Updated On : January 20, 2022 10:52 am
    Follow us on

    AP Employees : పీఆర్సీ లొల్లి మళ్లీ మొదలైంది. ఉద్యోగులు సమ్మెకు పోరుబాట పడుతున్నారు. నెల రోజుల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ కోసం పోరాటం చేసిన నేపథ్యంలో సంతృప్తికరమైన ఫిట్ మెంట్ ఉంటుందని సీఎం జగన్ తో సహా మంత్రులు చెప్పుకొచ్చారు. ఆ తరువాత మొత్తానికి జనవరి 7న కొత్త పీఆర్సీ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి నుంచే పీఆర్సీ అమలు చేస్తూ ఫిబ్రవరిలో అందుకు సంబంధించిన వేతనాలు అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. అయితే జగన్ పాదయాత్రలో చేసిన హామీల కంటే తక్కువ ఫిట్మెంట్ ఉన్నప్పటికీ… వేగంగా నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. కానీ తాజా ఉత్తర్వుల్లో హెచ్ఆర్ఏ చేసిన మార్పులు ఉద్యోగులకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నాయని ఆందోళన చేస్తున్నారు. కొత్తగా చేసిన సవరణలతో హెచ్ఆర్ఏ తగ్గిపోయింది. దీంతో పీఆర్సీ సవరణలతో కొత్తగా వచ్చేదాని కంటే ఉన్నజీతంలో భారీగా కోత పడుతుందని ఉద్యోగులు అసంతృప్తికి గురవుతున్నారు.

    CM Jagan on PRC

    CM Jagan on PRC

    ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్, ఢిల్లీలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు హెచర్ఏ 30 శాతం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు 16 శాతానికి కుదించారు. అంతేకాకుండా నగరానికి సమీపంలో ఉన్న గ్రామీణ ప్రాంత ఉద్యోగులకు కూడా వర్తించిన దానిని తొలగించారు. అంటే నగరానికి సమీపంలో ఉన్న గ్రామాల్లో పనిచేసే ఉద్యోగులకు హెచ్ఆర్ఏ 20 శాతం నుంచి 8 శాతానికి పడిపోయింది. ఇక పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగులకు గతంలో 14.5 శాతం ఉండగా.. ఇప్పుడు 8 శాతానికే పరిమితం చేశారు. మొత్తంగా కొత్తగా వచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులతో అద్దె శ్లాబులు మారిపోయాయని ఉద్యోగులు అంటున్నారు.

    Also Read: ఏపీలో పీఆర్సీ వివాదం మళ్లీ రాజుకుందెందుకు..? సమస్య ఎక్కడ వచ్చింది..?

    సాధారణంగా పీఆర్సీ అనగానే తమ వేతనాలు పెరుగుతాయని భావించామని, కానీ కొత్త ఉత్తర్వులతో ఉన్నత వేతనంలో కోత పడుతుందని అంటున్నారు. ఐఆర్ 27 శాతం ఇచ్చి పిట్మెంట్ 23 శాతానికే పరిమితం చేయడంతో బేసిక్ వేతనంలో తీవ్ర నష్టం జరుగుతుందని అంటున్నారు. పెండింగ్ డీఏలను సర్దుబాటు చేసినా 80 శాతం మంది ఉద్యోగులకు అన్యాయమే జరుగుతుందని కొందరు వాపోతున్నారు. మొత్తంగా ప్రతీ దాదాపు సగటు ఉద్యోగుల్లో రూ.1500 వరకు కోత పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ వల్ల లాభం లేకున్నా.. తీవ్ర నష్టానికిగురి చేసిందని అంటున్నారు.

    వాస్తవానికి ప్రభుత్వం ఉద్యోగలకు ప్రకటించిన 11వ పీఆర్సీ 2018 మే నెల నుంచి అమలు కావాల్సి ఉంది. కానీ అప్పటి ప్రభుత్వం జాప్యం చేసి అదే ఏడాది జూలై నెలలో పీఆర్సీ కోసం అశుతోష్ మిశ్రా కమిటీ వేసింది. అయితే ఈ కమిటీ రెండేళ్ల తరువాత 2020లో నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక తరువాత దానిని పరిశీలించాలని 2021లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో మరో కమిటీని వేశారు. అందులో ఆర్థిక శాఖ, సాధారణ పరిపాలన శాఖ ఉన్నతాధికారులున్నారు. సీఎస్ కమిటీ తన నివేదికను డిసెంబర్ 12న ప్రభుత్వానికి సమర్పించింది.

    అయితే ఈ నివేదికను బయటపెట్టకుండా జాయిట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల నిర్వహణ మీద కొన్ని ఉద్యోగ సంఘాలు అభ్యంతరం చెప్పాయి. అయితే ప్రభుత్వం అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను వెల్లడించకుండానే సీఎస్ కమిటీ రిపోర్టు సీఎం వద్దకు వెళ్లింది. ఆ తరువాత సీఎం సమక్షంలో రెండు రోజుల పాటు ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి జనవరి 7న అధికారికంగా పీఆర్సీపై ప్రకటన చేశారు. సీఎస్ కమిటీ కేవలం 14 శాతం పిట్మెంట్ సిఫార్సు చేసిందని, కానీ అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 23 శాతం ఫిట్మెంట్ ఇస్తోందని సీఎం జగన్ ఉద్యోగుల సమక్షంలో ప్రకటించారు. అంతేకాకుండా ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచారు.

    Also Read: అవసరాన్ని బట్టి మారుతున్న ఏపీ ‘ఆదాయం’?