AP Govt. Employees: మరో సమరానికి ఏపీ ఉద్యోగులు సన్నద్ధం

AP Govt. Employees ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరో సమరానికి సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వంపై తమ ఆవేదనను వెళ్లగక్కారు. అయినా, న్యాయపరమైన డిమాండ్లు, ఆర్థికపరమైన సమస్యలకు పరిష్కార మార్గాలు కానరావడం లేదు. సామరస్యంగా వెళ్లినా,  వైసీపీ ప్రభుత్వం కిక్కురుమనకపోవడంపై మరోమారు సమర శంఖం పూరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. గత నెల 26న జేఏసీ సమావేశంతో మొదలు.. ఇదే విషయమై ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గత నెల 26న రాష్ట్రస్థాయి సమావేశం […]

Written By: SHAIK SADIQ, Updated On : March 1, 2023 5:22 pm
Follow us on

మరో సమరానికి ఏపీ ఉద్యోగులు సన్నద్ధం

AP Govt. Employees ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరో సమరానికి సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వంపై తమ ఆవేదనను వెళ్లగక్కారు. అయినా, న్యాయపరమైన డిమాండ్లు, ఆర్థికపరమైన సమస్యలకు పరిష్కార మార్గాలు కానరావడం లేదు. సామరస్యంగా వెళ్లినా,  వైసీపీ ప్రభుత్వం కిక్కురుమనకపోవడంపై మరోమారు సమర శంఖం పూరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

గత నెల 26న జేఏసీ సమావేశంతో మొదలు..

ఇదే విషయమై ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గత నెల 26న రాష్ట్రస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. యూనియన్ నేతలతో కలసి చర్చలు జరిపారు.  ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కలిసి డిమాండ్ల పరిష్కారానికి సహకరించాలని కోరారు. ఆయన నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో, ఉద్యమ బాట పట్టనున్నట్లు నోటీసులు ఇచ్చారు. ఉద్యోగులందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.

ఈ నెల 9 నుంచి వివిధ రూపాల్లో

వివిధ రూపాల్లో తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ నెల 9 నుంచి ఉద్యమాలు చేపట్టనున్నట్లు ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇటీవల మీడియాకు వెల్లడించారు. పెన్ డౌన్, సెల్ డౌన్, భోజన విరామ సమయాల్లో నిరసనలు తెలిపాలని సూచించారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

తాజాగా మరో వెసులుబాటు జీవోతో తొలగింపు

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం మరో ఝులక్ ఇచ్చింది. వివాహం, లోన్లు, అడ్వాన్సులను సదరు ఉద్యోగి దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం మంజూరు చేసి ప్రతి నెల జీతం నుంచి మినహాయించుకుంటూ ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటైన మొదటి ఆరు నెలల వరకు బాగానే ఉన్నా, ఆ తరువాత ఇవ్వడం ఆపేసింది. ఆ బాధ్యత నుంచి తప్పుకుని బ్యాంకులకు అప్పగిస్తున్నట్లు జీవో మంజూరు చేసింది. ఉద్యోగుల డిమాండ్లలో ఈ అంశం కూడా ఉంది. తాజాగా ఇచ్చిన ఆదేశాలు నష్టం కలిగిస్తాయని ఉద్యోగులు పేర్కొంటున్నారు. బ్యాంకుల నుంచి అధిక వడ్డీలు చెల్లించాల్సి వస్తుందని ఆందోళనకు గురవుతున్నారు.

ఇదంతా చూస్తుంటే వైసీపీ ప్రభుత్వమే, ఉద్యోగులపై ఎదురుదాడికి దిగందన్న అనుమానాలు రేకేత్తుతున్నాయి. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చుతున్నారని వైసీపీ నేతలు పలు సందర్భాల్లో అన్నారు. జీతాలు కూడా సరిగ్గా ఇవ్వకపోగా, న్యాయమైన డిమాండ్లను అడుగుతుంటే వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మరోమారు ఉద్యోగులు ఉద్యమానికి దిగి, అందరూ ఏకమై వైసీపీని ఓడించేందుకు సన్నధమైతే పరిస్థితి ఏంటని ఉద్యోగుల సంఘ నేతలు అంటున్నారు.