AP Development: ఆస్తులు పోయి.. అప్పులు మిగిలాయి.. ఏపీలో అభివృద్ధి ఎందుకు ఆగిందో తెలుసా?

AP Development : ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో చిక్కుకుపోయిందని ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. పార్లమెంట్లో ఎంపీ మిథున్ రెడ్డి స్వయంగా ఏపీని ఆదుకోవాలని తెలిపారు. అయితే ఆ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే ఏపీకి చాలా నిధులు ఇచ్చామని, వాటిని ఉచిత పథకాలకు ఉపయోగించారని పేర్కొన్నారు. తాజాగా ప్రభుత్వ పనులు నిర్వహించిన కాంట్రాక్టర్లు తమ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఆవేదన సభలు నిర్వహిస్తున్నారు. ఎన్నో రకాల పనులు చేసినా తమకు […]

Written By: NARESH, Updated On : December 30, 2021 11:27 am
Follow us on

AP Development : ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో చిక్కుకుపోయిందని ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. పార్లమెంట్లో ఎంపీ మిథున్ రెడ్డి స్వయంగా ఏపీని ఆదుకోవాలని తెలిపారు. అయితే ఆ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే ఏపీకి చాలా నిధులు ఇచ్చామని, వాటిని ఉచిత పథకాలకు ఉపయోగించారని పేర్కొన్నారు. తాజాగా ప్రభుత్వ పనులు నిర్వహించిన కాంట్రాక్టర్లు తమ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఆవేదన సభలు నిర్వహిస్తున్నారు. ఎన్నో రకాల పనులు చేసినా తమకు ప్రభుత్వం నుంచి పైసా రాలేదని.. చాలా వరకు బకాయిలు రావాల్సి ఉందని, బకాయిలు రాకపోవడంతో తమ సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందని కాంట్రాక్టర్లు ఆవేదన-4 సభను తాజాగా విశాఖలో నిర్వహించారు.

AP Development

ఏపీ రాష్ట్ర బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్స్ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. విశాఖలో ఆవేదన సభ పేరుతో దశల వారీగా నిరసన సభలు పెడుతున్నారు. నల్లచొక్కాలు ధరించి ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తయకు బిల్లులు రాకపోవడంతో కిందిస్థాయి సిబ్బందికి వేతనాలు చెల్లించడం లేదని అంటున్నారు. మరోవైపు బ్యాంకుల నుంచి అప్పులు రాక తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని ఆవేదన చెందుతున్నారు.

Also Read:  ఎమ్మెల్యే రోజాకు కాలం కలిసిరావడం లేదా?

నాడు ఎంతో శ్రమించి ప్రభుత్వం చెప్పిన పనులు సరైన సమయానికి పూర్తి చేశామని, ఒక్కోసారి బిల్లులు రాకున్నా తమ సొంత డబ్బులతో పనులు పూర్తి చేశామన్నారు. తమకు అప్పగించిన పని పూర్తి చేసి ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా పనులు చేశామన్నారు. ఒక్కోసారి అప్పులు తెచ్చి మరీ ప్రభుత్వ పనులు పూర్తి చేశామన్నారు. అయితే ప్రభుత్వం తమకు బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుులే మిగిలాయి అని అంటున్నారు. నేడో ..రేపో.. ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తాయని ఎదురుచూశామని, అయితే ఇంతవరకు బిల్లులు రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురికావాల్సి వస్తోందన్నారు. ఇక ఇప్పటి వరకు ఓపిక పట్టామని, ఓపిక నశించి నిరసన తెలుపుతున్నామని కాంట్రాక్టర్లు అంటున్నారు. అయినా ప్రభుత్వం తమ ఆవేదనను పట్టించుకోవడం లేదని అంటున్నారు.

ఇలాంటి సమస్యే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉండగా వచ్చిందని, అయితే ఆప్పుడు సీఎం ప్రత్యేక జీవో జారీ చేసి బిల్లులు చెల్లించారన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వానికి ఎన్నిరకాలుగా తమ బాధలు చెప్పినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. అప్పుడూ.. ఇప్పుడూ.. జలజీవన్ కు సంబంధించి డబ్బులు చెల్లించలేదని, సీఎం దశల వారీగానైనా నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. అలా నిధులు ఇస్తే వాటిని మిగతా పనులకు ఉపయోగిస్తామని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు సైతం పెండింగులోనే ఉన్నాయని కాంట్రాక్టర్లు ఆవేదన చెందుతున్నారు. చిన్న కాంట్రాక్టర్లకు సంబంధించి మొత్తంగా వెయ్యికోట్ల రూపాయల మేర బకాయిలు ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందు రావాలని కోరారు.

అయితే ఇప్పటి వరకు కేవలం నిరసన ద్వారానే తమ ఆవేదన వినిపించామని, ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోకపోతే బకాయిలు చెల్లించాల్సిన కార్యాలయాల ముందు ఆందోళన చేస్తామని అంటున్నారు. సంబంధిత ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇచ్చి తమ సమస్యను వివరిస్తామని అంటున్నారు. మిగతా కాంట్రాక్లర్లు కూడా తమతో కలిసి రావాలని వారు కోరారు. కాంట్రాక్టర్లంతా ఒకే తాటిపై ఉంటే ప్రభుత్వం బకాయిలు చెల్లించే అవకాశం ఉందని అన్నారు. ప్రభత్వం కొంతమందికి బిల్లులు మంజూరు చేసి.. మరికొంతమందికి పెండింగ్ ఉంచడం భావ్యం కాదన్నారు. అందరి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు బకాయిలు రాకపోవడం వల్ల ఉన్న ఆస్తులను అమ్ముకోవాల్సి వస్తోందని, కొందరు కాంట్రాక్టర్లకు అప్పులు మాత్రమే మిగిలాయని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాంట్రాక్టర్లను ఆదుకోవాలని కోరారు.

Also Read:  సోము వీర్రాజు అంటించిన మాటల మంటలు.. జనసేన, కేటీఆర్ కు బాగా కాలింది