https://oktelugu.com/

ఏపీ అప్పుల కుప్ప.. నోరు మెదపని ప్రభుత్వం

విభజనకు ముందునాటి ఏపీ.. విభజనకు తరువాత రాష్ట్రంలో చాలా వరకు తేడాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడిగా కొంతమేర ధనిక రాష్ట్రంగా కొనసాగిన ఏపీ విభజన తరువాత అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. తెలుగుదేశం పార్టీ హయాంలోనే పీకల్లోతు అప్పుల్లోకి వెళ్లిపోయిన ప్రభుత్వం.. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ సంఖ్య చాలా రేట్లు పెరిగింది. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు.. ప్రాజెక్టులు , ఇతర ఖర్చులకోసం అప్పులు చేశామని ఓ వైపు ప్రభుత్వం చెబుతూనే.. […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 6, 2021 / 01:28 PM IST
    Follow us on


    విభజనకు ముందునాటి ఏపీ.. విభజనకు తరువాత రాష్ట్రంలో చాలా వరకు తేడాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడిగా కొంతమేర ధనిక రాష్ట్రంగా కొనసాగిన ఏపీ విభజన తరువాత అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. తెలుగుదేశం పార్టీ హయాంలోనే పీకల్లోతు అప్పుల్లోకి వెళ్లిపోయిన ప్రభుత్వం.. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ సంఖ్య చాలా రేట్లు పెరిగింది. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు.. ప్రాజెక్టులు , ఇతర ఖర్చులకోసం అప్పులు చేశామని ఓ వైపు ప్రభుత్వం చెబుతూనే.. పరిధి దాటలేదని చెప్పుకొస్తోంది.

    అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విపరీతమైన అప్పులు చేస్తోందని కాగ్ నివేదిక చెబుతోంది. అవన్నీ కాగ్ పరిధిలోకి వచ్చే అప్పులు. కానీ ప్రభుత్వం మాత్రం పెద్ద ఎత్తున ఇతర పద్ధుతుల్లో అప్పులు చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్రానికి ఈ ఏడాది చేసిన అప్పుల వివరాలు మొత్తం ఇస్తేనే.. తదుపరి అప్పులు చేసుకోవడానికి అనుమతి ఇస్తుంది. కానీ ఏపీ సర్కారు ఇంతవరకు ఆ వివరాలు పంపలేదు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం కొత్త అప్పులు చేయడానికి ఏపీ సర్కారుకు అవకాశం చిక్కడం లేదు.

    నిజానికి ఏపీకి ఈసారి భారీ అప్పులు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆర్బీఐ నుంచి బాండ్ల ద్వారా ఏకంగా రూ.42వేల కోట్ల రుణం తీసుకునే అవకాశం ఇచ్చింది. కానీ ఈ రుణం తీసుకోవాలంటే.. కొన్ని నిబంధనలు పూర్తి చేయాలి. గత ఆర్థిక సంవత్సరంలో చేసిన అప్పుల వివరాలు, గ్యారంటీల ద్వారా తీసుకొచ్చిన అప్పులు, అందులో రెవెన్యూ వ్యయం ఎంత.. పెట్టుబడి వ్యయం ఎంత అనే వివరాలు చెప్పాలి. అయితే ఇది రహస్యం అనుకున్నారేమో కానీ.. ఏపీ పూర్తిస్థాయిలో కాకుండా తాత్కాలికంగా కొంత సమాచారాన్ని కేంద్రానికి పంపించింది.

    అయితే ఆ వివరాలను కేంద్రం పరిగణలోకి తీసుకోలేదు. అందుకే పర్మిషన్ ఇవ్వలేదు. జీతాలు, పెన్షన్లకు కూడా.. అప్పుల మీదే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందంటే.. ఇది దివాలా దశేనని.. ఆర్థిక నిపుణులతో పాటు విపక్ష నేతలు మండిపడుతున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్నివేల కోట్ల అప్పులు చేస్తున్నా.. పెండింగ్ బిల్లులు అలాగే ఉండిపోతున్నాయని.. తీసుకొస్తున్న అప్పులు.. వస్తున్న ఆదాయం అంతా ఏం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈవిషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఉండడం లేదు.