AP CM Jagan Meets PM Narendra Modi : ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్రమోడీకి ఇచ్చిన వినతులు హాస్యాస్పదమయ్యాయి. ఏపీకి అన్యాయం జరిగిందన్నది వాస్తవం.. జనాభా ప్రాతిపదికన ఆదాయం రాలేదన్న జగన్ వాదనలో నిజముంది.. కానీ మిగతా హామీలు అభాసుపాలయ్యాయి.
ఏపీకి ప్రత్యేక హోదా.. తెలంగాణ నుంచి నిధులు సహా ఎప్పుడో మరిచిపోయిన హామీల అమలు కోసం ప్రధానికి విన్నవించడం తెలివితక్కువ పనిగా అభివర్ణించవచ్చు.
ప్రత్యేక హోదాను ఫణంగా పెట్టి నాటి సీఎం చంద్రబాబు మోడీ నుంచి రావాల్సిన 16 వేల కోట్ల బకాయిలను కూడా కాలదన్నాడు. ఇక అధికారంలోకి వస్తే తాను ప్రత్యేక హోదా తెప్పిస్తానన్న జగన్ దాన్ని ఇప్పటికీ నెరవేర్చలేదు. మోడీ సారథ్యంలోని కేంద్రం ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని తెగేసి చెప్పింది..
ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇచ్చేది లేదని కేంద్రం చెప్పింది. ఒకవేళ ఇచ్చినా ముందుగా ఆంధ్రా కంటే వెనుకబడిన 10 రాష్ట్రాలకు ఇచ్చాకే ఆంధ్రాకు ఇవ్వాలి. అలాంటి సమయంలో జగన్ మళ్లీ పాత చింతకాయ పచ్చడిలా ప్రత్యేక హోదాను ప్రధాని ముందు ఉంచడం ప్రజలను మోసం చేయడమే అవుతుంది. ఈ క్రమంలోనే జగన్ ప్రధానికి ఇచ్చిన వినతిపత్రంలో అంశాలు.. వాటి వల్ల ఉపయోగాలపై ‘రామ్ టాక్’ స్పెషల్ వ్యూ పాయింట్ విశ్లేషణను కింద చూడొచ్చు.