https://oktelugu.com/

AP Aided schools: ఏపీలో ఎయిడెడ్ పాఠశాలల మూత నిర్ణయం.. మంచికా..? చెడుకా..?

AP Eided schools: ఆంధ్రప్రదేశ్ లోని ఎయిడెడ్ పాఠశాలలు ఇక కనుమరుగు కానున్నాయా..? ఇప్పటికే ఆ పాఠశాలల పరిమితిని తగ్గిస్తున్న ప్రభుత్వాలు రాను రాను అలాంటి పాఠశాలలను లేకుండానే చేస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఎయిడెడ్ పాఠశాలలు ఇక పూర్తిగా మూతపడే పరిస్థితి ఎదురుకానుంది. ఇటీవల ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలకు రెండు ఆప్షన్లను ఇచ్చింది. ఒకటి మూసివేయడమా..? లేక ప్రభుత్వం సాయం లేకుండా సొంతంగా నడపగలరా..? అనేది నిర్ణయించుకోవాలని తేల్చి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 29, 2021 / 11:22 AM IST
    Follow us on

    AP Eided schools: ఆంధ్రప్రదేశ్ లోని ఎయిడెడ్ పాఠశాలలు ఇక కనుమరుగు కానున్నాయా..? ఇప్పటికే ఆ పాఠశాలల పరిమితిని తగ్గిస్తున్న ప్రభుత్వాలు రాను రాను అలాంటి పాఠశాలలను లేకుండానే చేస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఎయిడెడ్ పాఠశాలలు ఇక పూర్తిగా మూతపడే పరిస్థితి ఎదురుకానుంది. ఇటీవల ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలకు రెండు ఆప్షన్లను ఇచ్చింది. ఒకటి మూసివేయడమా..? లేక ప్రభుత్వం సాయం లేకుండా సొంతంగా నడపగలరా..? అనేది నిర్ణయించుకోవాలని తేల్చి చెప్పింది. ప్రభుత్వ సాయం లేకుండా ఎక్కువ శాతం ఎయిడెడ్ పాఠశాలలు నడవలేనందుకు మూసివేతకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో ఆయా పాఠశాల్లలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ చర్యలు విద్యార్థులకు, ప్రజలకు మేలు చేస్తాయని చెబుతోంది.

    protest-in-aided-schools

    ఎయిడెడ్ పాఠశాలల ప్రస్థానం బ్రిటిష్ హయంలోనే మొదలైంది. 1853లో థామస్ జాబింగ్టన్ మెకాలే నివేదిక ఆధారంగా ఈస్టిండియా కంపెనీ నూతన విద్యావిధానాన్ని రూపొందించింది. అందుకు అనుగుణంగా దేశ వ్యాప్తంగా విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. ఇక ఎవరైనా సొంతంగా విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వం సాయం అందిస్తానని తెలిపింది. దీంతో జమీందార్లు విద్యాసంస్థలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఏపీలోని వివిధ ప్రాంతంలో ఎయిడెడ్ విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. ఇందులో ఎక్కువగా ఇంగ్లీష్ బోధనకు ప్రాధాన్యం ఇవ్వడంతో సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఏపీ మొత్తం 1,972 ఎయిడెడ్ విద్యాసంస్థలు ఉన్నాయి. ఇందులో 2 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.

    అయితే కొన్ని సంవత్సరాలుగా ఎయిడెడ్ పాఠశాలలకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్లో కోత విధిస్తున్నారు. 2003లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే 10 శాతం కోత విధించడం మొదలు పెట్టారు. ఆ తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే కొనసాగించింది. దీంతో ఎయిడెడ్ విద్యాసంస్థలో నియామకాలు ఆగిపోయాయి. అంతేకాకుండా ఈ పాఠశాలలకు విరాళాలు ఇచ్చేవారు తగ్గిపోయారు. ఫలితంగా ఈ పాఠశాలల్లో రిటైర్డ్ టీచర్లను నియమించే బదులు కాంట్రాక్టు పద్ధతిన బోధకులను నియమిస్తున్నారు.

    2019 అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొస్తున్నారు. విద్యార్థుల కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎయిడెడ్ పాఠశాలల విషయంలోనూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వానికి అప్పగిస్తే విద్యార్థుల సంఖ్య ఆధారంగా సిబ్బంది బదిలీలు, ఇతర మార్పలు చేస్తామని అంటున్నారు. లేకుంటే ప్రైవేట్ స్కూళ్ల మాదిరిగా ఫీజులు వసూళ్లు చేసి నిర్వహణ బాధ్యతను ఆ సంస్థలే స్వీకరించాలని అంటున్నారు. ఆ సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందే అవకాశం లేదని పరోక్షంగా చెప్పారు.

    ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ‘ఎయిడెడ్ పాఠశాలల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేద పిల్లలు చదువుకు దూరం కానున్నారు. అలాగే నిరుద్యోగుల పాలిట శాపంగా మారనుంది. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకుండా విద్యార్థుల తరుపున భారీ పోరాటం చేస్తాం.’ అని అన్నారు.

    ఇదిలా ఉండగా ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు జీవో42ను జారీ చేసింది. ఈ జీవోనే రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎయిడెడ్ పాఠశాలలన్నీ ప్రజల సొమ్ముతోనే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ ఆస్తులను కాజేసేందుకే ప్రభుత్వం ఇలా ఆప్షన్లు ఇచ్చి భయపెడుతున్నారని కమ్యూనిస్టు నాయకులు ఆరోపిస్తున్నారు. ఎయిడెడ్ పాఠశాలల స్థానంలో ఉన్న భూముల ధరలు పెరగడంతోనే ప్రభుత్వం ఆ భూములను లాక్కునేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని అంటున్నారు.