Microsoft Company in Hyderabad: హైదరాబాద్.. అంతర్జాతీయ నగరంగా ఎదుగుతున్నది. ఈ క్రమంలో హైదరాబాద్ లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థ, ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చింది. సుమారుగా రూ.15వేల కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, సదురు సంస్థ మధ్య ఇప్పటికే చర్చలు జరిగినట్టు సమాచారం. సిటి చిరవలో శంషాబాద్ చుట్టుపక్కల దాదాపుగా 50 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది.
ఇందుకు సంబంధించి వచ్చే నెలలో అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం. ఇందులో ఫస్ట్ విడదగా సుమారు 300 మంది ఎక్స్‌పర్ట్స్ కు ఉద్యోగాలు లభించనున్నాయి. ఇప్పటికే క్లౌడ్ కంప్యూటింగ్, స్పేస్ టెక్నాలజీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఎంఎల్, బ్లాక్ చెయిన్ వంటి లేటెస్ట్ ఐటీ టెక్నాలజీలతో పెట్టుబడులు వస్తున్నాయని టాక్. డేటా సెంటర్ల రంగంలోనూ ఇప్పటికే రాష్ట్రం ఏడు శాతం వాటాను కలిగి ఉన్నది. వచ్చే ఏడాదికి ఈ సంఖ్య 9.5కు చేరనుందని సమాచారం.
Also Read: బీపీసీఎల్ లో భారీ స్థాయిలో ఉద్యోగ ఖాళీలు.. రూ.1,20,000 వేతనంతో?
రాష్ట్రంలో ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు వాటి కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. కంట్రోల్ ఎస్, ఎన్‌పీసీఐ, ఎస్టీ టెలీమీడియా, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు డేటా సెంటర్స్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. ఇదీ కాకుండా దాదాపుగా రూ.20 వేల కోట్లతో అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు అమెజాన్ వెబ్ సర్వీసెస్ గతంలోనే ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీని కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఏర్పాటయ్యాక తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వచ్చే చాన్స్ ఉంది.
గవర్నమెంట్ సానకూల విధానాలు.. పోత్రాహకాలు, తదితర అనుకూల పరిస్థితులు ఉండటమే ఇందుకు కారణమని ఐటీ నిపుణులు అంటున్నారు. ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే డేటా సెంటర్ల నిర్వహణ కూడా ప్రస్తుతం ఒక పెట్టుబడే. ఇది ఉద్యోగాల అందించే చాన్స్ ఉన్న రంగంగా మారిపోయింది. ఐటీ, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలల్లో ఈ సెంటర్స్ కీలకంగా వ్యవహరించనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ వస్తుండటంతో ఐటీ రంగంలో పెట్టుబడులు మరింత పెరిగే చాన్స్ ఉంది.
Also Read: ఖాతాదారులూ.. జర జాగ్రత్త..