Telangana Elections Survey: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం ముగిసింది. సోమవారం(నవంబర్ 13) మధ్యాహ్నం తర్వాత స్కూట్రినీ పూర్తవుతుంది. సరైన వివరాలు లేని నామినేసన్లను తిరస్కరించాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సాయాత్రానికి నామినేషన్లపై ఓ క్లారిటీ రానుంది. 15వ తేదీ వరకు ఉప సంహరణకు అవకాశం ఉండనుంది. గజ్వేల్, మేడ్చల్, కామారెడ్డిలో అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక, ప్రచారం ఊపందుకుంది. సోమవారం నుంచి కేసీఆర్ మూడో విడత ప్రచారం మొదలుపెడుతున్నారు. ఈ క్రమంలో మరో సంచలన సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. గడిచిన నెల రోజుల్లో వేగంగా సమీకరణలు మారుతున్నట్లు ఈ సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
నిరుద్యోగుల సర్వే..
సాధారణంగా ఎన్నికల వేళ.. మీడియా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు సర్వేలు చేస్తుంటాయి. కానీ, ఈసారి తెలంగాణలో ఓ అరుదైన సర్వే జరిగింది. రాష్ట్రంలోని నిరుద్యోగులు సర్వే చేశారు. షెడ్యూల్ విడుదల అయిన నాటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ముగిసే వరకు ఈ సర్వే నిర్వహించారు. వాటి ఫలితాలను సోమవారం విడుదల చేశారు. ఇందులో సంచలన ఫలితాలు వెల్లడయ్యాయి.
కాంగ్రెస్‌కు లీడ్..
నిరుద్యోగుల సర్వే ప్రకారం.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని నిర్ధారణ అయింది. బీఆర్‌ఎస్ గద్దె దిగక తప్పదని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 78–82 స్థానాల్లో విజయం సాధిస్తుంది. అధికార బీఆర్‌ఎస్కు 28–31 సీట్లు వస్తాయని అంచనా వేసింది. బీజేపీ 3–5 స్థానాలు, ఎంఐఎం 5–7 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది.
గులాబీ సర్కార్‌పై గుర్రు..
రాష్ట్రంలో యువత, నిరుద్యోగులు గులాబీ సర్కార్‌పై చాలా కాలంగా గుర్రుగా ఉన్నారు. పదేళ్లలో ఖాళీలు భర్తీ చేయకపోవడం, ఉద్యోగు నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంపై రగిలిపోతున్నారు. మరోవైపు ఇచ్చిన నోటిఫికేషన్ల ప్రశ్నపత్రాల లీకేసీ తెలంగాణలోకామన్ అయింది. నేతలు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని నిరుద్యోగులు భావిస్తున్నారు. ఈ తరుణంలో ఈసారి నిరుద్యోగులు కూడా సర్కార్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. పింఛన్‌కు, రైతుబంధుకు ఆశపడితే మీ పిల్లలు ఆగమైతరని అవగాహన కల్పిస్తున్నారు. పిల్లలకు ఉద్యోగం వస్తే నెలకు రూ.30 వేల జీతం వస్తుందని, మూడు వేల పింఛన్‌కు ఆశపడి బీఆర్‌ఎస్‌కు ఓటు వేయొద్దని కోరుతున్నారు. ఈ తరుణంలో నిరుద్యోగులు నిర్వహించిన ఎన్నికల సర్వే ఫలితాలు వారికి అనుకూలంగా రావడం గమనార్హం.