
Mangalhat: హైదరాబాద్ సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో 6 ఏళ్ల బాలికపై హత్యాచారం ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. ఆ ఘటనలో తాజాగా ఈరోజు నిందితుడు రాజు రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ ఎపిసోడ్ ముగిసిందనుకుంటున్న సమయంలో మరో దారుణం హైదరాబాద్ లోనే చోటుచేసుకుంది.
హైదరాబాద్ మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళ్ హట్ బస్తీలో బాలికపై సుమిత్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడినట్లు బంధులు ఆరోపిస్తున్నారు. ఓ తొమ్మిదేళ్ల చిన్నారిని ఖాళీగా వున్న దుకాణం షేటర్ లోకి తీసుకుని వెళ్లి అత్యాచారం చేయబోయాడు. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు అక్కడి దుకాణం వద్దకు చేరుకున్నారు. స్థానికులను చూసి నిందితుడు సుమిత్ పరారయ్యాడు. తొమ్మిదేళ్ల బాలిక స్థానికులు రక్షించారు.
బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ రేప్ జరిగినట్లుగా చెబుతున్నారు. బాలిక అరుపులతో స్థానికులు ఘటనస్థలికి వెళ్లి చూసి రక్షించారు. రేప్ చేసిన సుమిత్ ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిందితుదు సుమీట్ ను లంగర్ హౌస్ లోని అత్తాపూర్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇక అత్యాచారం చేసిన యువకుడు హబీబ్ నగర్ పరిధిలో చోరీ కేసులో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. విచారణ జరిపి బాలికను ఆస్పత్రికి తరలించారు.