Spain: తీవ్రమైన కరువు, కాటకాలతో ప్రపంచ పటంలో మరో దేశం కనుమరుగు కాబోతోందా అంటే అవుననే అంటున్నారు. వాతావరణ నిపుణులు. యూరప్ దేశాలకు ఒకప్పుడు కూరగాయలు ఎగుమతి చేసే ఆ దేశం ఇప్పుడు క్షామంతో తల్లిడిల్లుతోంది. దశాబ్దకాలంగా సాధారణ వర్షాలు కురవడం లేదు. అడపదడపా కురిసే వర్షాలకు దేశంలోని జలవనరులు క్రమంగా ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలను తోడేస్తుండడంతో నీటి ఛాయలు కనుమరుగై దేశం ఎడారిగా మారుతోంది. 500 ఏళ్ల లేనంతటి కరువుతో యూరప్‌లోని స్పెయిన్ దేశం అల్లాడుతోంది. దీంతో అక్కడ మనుగడ లేదని జనం ఇతర యూరప్ దేశాలకు వలస వెళ్లిపోతున్నారు.
ఒకప్పుడు కూరగాయల ఎగుమతి..
యూరప్‌లోని చాలా దేశాలకు స్పెయిన్‌లో రైతులు పండించే కూరగాయలు ఎగుమతి చేసేంది. ఇక్కడి రైతులు ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధారపడేవారు. దీంతో ఎక్కువగా కూరగాయలు పండించడంతో యురోపియన్ దేశాలకు ఎగమతి చేసేవారు. దీంతో ఆదేశానికి ల్యాండ్ ఆఫ్ వెజిటెబుల్స్‌గా గుర్తింపు ఉండేది. కానీ అదంతా గతం. దశాబ్దకాలంగా వాన చినుకు జాడలేకుండా పోయింది. వరుస కరువుతో దేశంలోని రిజర్వాయర్లు, జలాశయాలు ఖాళీ అయి ఎడారిని తలపిస్తున్నాయి. చేపలు చనిపోయి గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. చెట్లు కూడా నీరు లేక ఎండిపోతున్నాయి.
తీవ్ర వర్షాభావం..
స్పెయిన్ తీవ్ర వర్షాభావాన్ని ఎదుర్కొంటోంది. ఫలితంగా దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది. వర్షాలు కురిపించేందుకు అక్కడి ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. చివరకు మనుషులు, జీవరాశులకు తాగునీరు కూడా దొరికే పరిస్థితి లేకుండా పోతోంది. ప్రస్తుతం దేశంలో 75 శాతం భూభాగం ఎడారిగా మారింది.
మురుగునీరు శుద్ధిచేసి..
తాగునీరు లేకపోవడంతో మురుగు నీటినే శుద్ధిచేసే తాగేలా చేస్తుంది అక్కడి ప్రభుత్వం. ఒక్క నీటిబొట్టును కూడా వృథా కానివ్వడం లేదు. తీవ్ర క్షామంతో దేశంలోని రైతులు, ప్రజలు వెళ్లిపోతున్నారు. భూములు, ఇళ్లు వదిలి పొరుగున ఉన్న దేశాలకు వలసపోతున్నారు. మరో 25 శాతం భూభాగం కూడా ఎడారిగా మారితే దేశంలో జీవరాశికి మనుగడ లే ని ప్రాంతంగా మారి ప్రపంచ పటంలో మాయం కావడం ఖాయం అంటున్నారు వాతావరణ నిపుణులు.
ఎందుకీ పరిస్థితి..
స్పెయిన్‌లో ఈ పరిస్థితికి అక్కడి ప్రజలే కారణం అంటున్నారు. ఇష్టానుసారంగా నీటి వినియోగం, ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగి పర్యావరణానికి ముప్పుగా మారడం, గ్లోబల్ వార్మింగ్, జీవ వైవిధ్యం లేకపోవడం వంటి కారణాలతో అక్కడ కరువు ఏర్పడుతోందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు మళ్లీ పూర్వపు పరిస్థితులు తెచ్చేందకు ప్రభుత్వాలు, యూరప్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో స్పెయిన్ కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్పెయిన్‌ను చూసి ప్రపంచ దేశాలు పాఠం నేర్చుకోవాలని సూచిస్తున్నారు.
యూరప్‌లోని పలు దేశాలు కూడా..
వాతావరణంలో మార్పుల ప్రభావం యూరప్‌ను అల్లాడిస్తోంది. స్పెయిన్‌తోపాటు బ్రిటన్, ఫ్రాన్స్, హంగేరి, సెర్బియా, పోర్చుగల్, జర్మనీ తదితర దేశాల్లో కూడా కరువు ముంచుకొస్తోంది. పశ్చిమ, మధ్య, దక్షిణ యూరప్‌లో రెండు నెలలుగా వాన చినుకు జాడ కూడా లేదు. దాంతో యూరప్‌లోని సగం ప్రాంతాల్లో కరువు పడగ విప్పింది. యూరోపియన్ యూనియప్‌లో 46% ప్రాంతాల్లో ప్రమాదకంగా కరువు పరిస్థితులున్నాయి.
వాటిలో 11% ప్రాంతాల్లోనైతే అతి తీవ్ర కరువు నెలకొంది! దక్షిణ ఇంగ్లండ్‌లో థేమ్స్ నదిలో ఏకంగా 356 కి.మీ. మేర ఇసుక మేటలు వేసింది. నది జన్మస్థానం వద్ద వానలు కురవకపోవడం, ఎగువ నుంచి నీళ్లు రాకపోవడంతో ఎన్నడూ లేనంతగా ఎండిపోయింది.
1935 తర్వాత మళ్లీ..
1935 తర్వాత ఇలాంటి పరిస్థితులు రావడం ఇదే తొలిసారని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇంగ్లండ్‌లో కొద్ది వారాలుగా ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్ పైగానమోదవుతున్నాయి. ఈ ఏడాది జూలై అత్యంత పొడి మాసంగా రికార్డులకెక్కింది. ఇవే పరిస్థితులు తూర్పు ఆఫ్రికా, మెక్సికోల్లో కనబడుతున్నాయి. 500 ఏళ్లకోసారి మాత్రమే ఇంతటి కరువు పరిస్థితులను చూస్తామని నిపుణులు చెబుతున్నారు.