https://oktelugu.com/

Deltacron: ప్రపంచం మీదకు ప్రాణాలు తీసే మరో మహమ్మారి ‘డెల్టాక్రాన్’

Deltacron: కొవిడ్‌-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తితో ప్రపంచం ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. ఇప్పటికే కొన్ని దేశాలు లాక్డౌన్ దిశగా వెళ్లగా మరికొన్ని ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భారత్ కూడా అతీతం కాదు. దేశ వ్యాప్తంగా ఆదివారం ఒక్క రోజే 2,71,202 మందికి వైరస్ సోకినట్లు భారత ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఒమిక్రాన్ వ్యాప్తి 28 శాతం ఉన్నట్లు తాజా గణాంకాలు చెప్తున్నాయి. కోవిడ్ -19  ఓమిక్రాన్ వేరియంట్ ప్రాణాలు తీస్తోందని, ఇది తేలికపాటిదని […]

Written By:
  • NARESH
  • , Updated On : January 17, 2022 / 02:19 PM IST
    Follow us on

    Deltacron: కొవిడ్‌-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తితో ప్రపంచం ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. ఇప్పటికే కొన్ని దేశాలు లాక్డౌన్ దిశగా వెళ్లగా మరికొన్ని ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భారత్ కూడా అతీతం కాదు. దేశ వ్యాప్తంగా ఆదివారం ఒక్క రోజే 2,71,202 మందికి వైరస్ సోకినట్లు భారత ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఒమిక్రాన్ వ్యాప్తి 28 శాతం ఉన్నట్లు తాజా గణాంకాలు చెప్తున్నాయి. కోవిడ్ -19  ఓమిక్రాన్ వేరియంట్ ప్రాణాలు తీస్తోందని, ఇది తేలికపాటిదని కొట్టిపారేయకూడదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తున్నది. కొత్త వేరియంట్‌ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయని, ఇది చాలా దేశాలలో గతంలో ఆధిపత్యం చెలాయించిన డెల్టా వేరియంట్‌తో పోటీ పడుతోందని, ఆసుపత్రులు నిండిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది.

    ప్రాణాంతక కరోనా వైరస్ నుంచి కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తోన్నాయి. ఇదివరకు డెల్టా..ఆ తరువాత డెల్టా ప్లస్ వేరియంట్లు ప్రపంచాన్ని చుట్టుముట్టాయి. కొంత గ్యాప్ ఇచ్చి.. ఒమిక్రాన్ విరుచుకుపడుతోంది. డెల్టా ప్లస్ వేరియంట్‌తో పోల్చుకుంటే- ఒమిక్రాన్ ఎంత భయానకమో మనం చూస్తూనే ఉన్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించినట్లుగా డెల్టాల కంటే వేగంగా వ్యాప్తి చెందుతోంది ఒమిక్రాన్ వేరియంట్. తొలి కేసు నమోదైన అతి కొద్దిరోజుల్లోనే దీని సంఖ్య వేలల్లోకి చేరుకుంది. అమెరికా సహా యూరప్ దేశాల్లో దీన్ని విస్తరణ మరింత అధికంగా ఉంటోంది.

    ఇప్పుడీ రెండింటి కలయికతో కొత్త వేరియంట్ మరొకటి వెలుగులోకి వచ్చింది. దీని పేరు డెల్టాక్రాన్. డెల్టా ప్లస్ ఒమిక్రాన్ కలయికతో ఇది పుట్టుకొచ్చింది. తొలి కేసులు సైప్రస్‌లో నమోదయ్యాయి. డెల్టాక్రాన్‌ స్ట్రెయిన్‌‌ను సైప్రస్‌ యూనివర్సిటీ ఆఫ్ బయాలజికల్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌, ల్యాబోరేటరీ ఆఫ్‌ బయోటెక్నాలజీ అండ్‌ మాలిక్యులర్‌ వైరాలజీ డీన్ లియోండియోస్‌ కోస్ట్రికిస్‌ గుర్తించారు. ఒమిక్రాన్, డెల్టా కో-ఇన్ఫెక్షన్‌ కేసులు సైప్రస్‌లో పుట్టుకొచ్చినట్లు నిర్ధారించారు. డెల్టా, ఒమిక్రాన్ కాంబినేషన్స్ ఇందులో కనిపించాయని స్పష్టం చేశారు.

    -తేలికగా తీసుకోవద్దు..
    ఒమిక్రాన్ తో కూడా ఎక్కువగా ప్రాణనష్టం ఉంటున్నదని, దీన్ని తేలికగా తీసుకోవద్దని డబ్ల్యూహెచ్ వో వెళ్లడిస్తున్నది. టీకాలు వేసిన వారిలో, ఒమిక్రాన్ సోకటం తేలికపాటిదిగా తీసుకోవద్దని సూచనలు చేస్తున్నది. ఇది ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేమని ఆవేదన వ్యక్తం చేస్తుంది. కేసులు సునామీలా వ్యాప్తి చెందుతున్నాయని, ప్రాణ నష్టం, ఆర్థికంగా ఆయా దేశాలపై గుది బండలా మారుతున్నదని, ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థపై కూడా పెను భారాన్ని మోపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నది.

    -మరింత దారుణంగా ఉండొచ్చు
    గత వారం ప్రపంచ ఆరోగ్య సంస్థకి కేవలం 9.5 మిలియన్ల కంటే తక్కువ కొత్త కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి ఇది ఒక రికార్డు, ముందు వారం కంటే 71 శాతం పెరిగిందని డబ్ల్యూహెచ్ వో తెలిపింది. క్రిస్మస్, -న్యూ ఇయర్ సెలవుల సమయంలో, సానుకూల స్వీయ-పరీక్షలు నమోదు చేయబడలేదని, అధిక భారం ఉన్న నిఘా వ్యవస్థలు తప్పిపోయిన కేసులను ప్రతిబింబించలేదని డబ్ల్యూహెచ్ వో తెలిపింది. ఇంకా భవిష్యత్ లో దారుణ పరిస్థితులు ఉండొచ్చని హెచ్చరిస్తున్నది.

    -వ్యాక్సినేషన్ లో అసమానతల వల్లే..
    వివిధ దేశాలలో వ్యాక్సినేషన్ లో చోటుచేసుకుంటున్న అసమానతల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్పష్టం చేస్తున్నది. ధనిక దేశాలు వారి పౌరులకు వ్యాక్సినేషన్ చేయించగా, పేద దేశాలలో వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో కొత్త వేరియంట్ ఆవిర్భావానికి కారణం అని నివేధికలు స్పష్టం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కొవిడ్-19 సృష్టంచే విధ్వంసాన్ని అంతం చేసేందుకు వ్యాక్సిన్ మోతాదులను ప్రపంచ దేశాలన్నీన్యాయంగా పంచుకోవాలని డబ్ల్యూహెచ్ వో కోరుతుంది.

    -వ్యాక్సినేషన్ పై దిశా నిర్దేశం..
    సెప్టెంబర్ 2021 చివరి నాటికి అన్ని దేశాలు తమ జనాభాలో 10 శాతం, డిసెంబర్ చివరి నాటికి 40 శాతం టీకాలు వేయాలని డబ్ల్యూహెచ్ వో సూచిస్తుంది. 194 సభ్యదేశాలలో 2021 నాటికి నిర్దేశించబడిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయని, నిజానికి వాటిలో 36 మొదటి 10 శాతాన్ని కూడా వ్యాక్సినేషన్ చేయలేకపోయారని, ఎక్కువ వ్యాక్సిన్ డోస్‌లను తెప్పించ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని డబ్ల్యూహెచ్ వో పేర్కొంది. 2022 మధ్య నాటికి ప్రతి దేశంలో 70 శాతం వ్యాక్సినేషన్ చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేస్తున్నది.

    -ఒమిక్రాన్ ముగింపు కాదు
    కొవిడ్-19కు చెందిన ఒమిక్రాన్ చివరి రూపాంతరం కాదని జాగ్రత్తలు తీసుకోకుంటే మరిన్ని వైరుద్యాలు పుట్టుకచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన కొవిడ్ -19 టెక్నికల్ లీడ్ మరియా వాన్ కెర్ఖోవ్ హెచ్చరిస్తున్నారు. వైరస్ ను ఎదుర్కొనేందుకు మరింత జాగరూకతతో ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. డెల్టా కంటే రెట్టింపు వేగంతో వ్యాప్తి చెందే ఒమిక్రాన్ విషయంలో ప్రజలు ఇంకా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. కాని పౌరుల్లో పూర్తి స్థాయి అవగాహన కనిపించటం లేదని, చాలా దేశాలలో మాస్కులు లేకుండా సంచరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ మాట్లాడుతూ, వ్యాక్సిన్ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఒకే విధమైన పంపిణీ లేకుంటే, 2022 చివరిలో కూడా మహమ్మారి పైన ఇంకా మాట్లాడుకునే పరిస్థితి ఉంటుందని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఉంటే అది దారుణమైన విషాదం అవుతుందని అభిప్రాయపడ్డారు.