Yadamma Reciepes- Ponguleti Srinivas: వంటల యాదమ్మ.. కరీంనగర్ జిల్లాకు చెందిన ఈమె ఇటీవల ఒక్కసారిగా జాతీయస్థాయిలో ఫేమస్ అయింది. హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సదర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షాతోపాటు దేశవ్యాప్తంగా 1,500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వీరందరికీ వంట బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కరీంనగర్‌కు చెందిన యాదమ్మతో ప్రత్యేక వంటకాలు తయారు చేయించారు. యాదమ్మ చేతి వంట తిన్న నేతలంతా ఆహా ఓహో అన్నారు. రెండు రోజులపాటు యాదమ్మ, ఆమె బృందం అతిథులకు తెలంగాణ వంటకాలను రుచికరంగా తయారు చేశారు. తెలంగాణ వంటకాలను ప్రధాని మోదీ ఇష్టంగా తిన్నారు. దీంతో యాదమ్మ క్రేజ్ అమాంతం పెరిగింది. ఒక్కసారిగా యాదమ్మ స్టార్ హోటళ్ల వంటకాలు, చేయి తిరిగిన మాస్టర్ చెఫ్‌లను మించి పేరు వచ్చింది.

తాజాగా మరో ఆఫర్..
యాదమ్మ బీజేపీ జాతీయ కార్యవర్గాలకు ముందు ఉమ్మడి జిల్లాలో రాజకీయ సమావేశాల్లో వంటలు చేస్తుంది. పెద్ద కార్యక్రమాలకు యాదమ్మకే అప్పగించేవారు నేతలు. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులకు కూడా యాదమ్మ గురించి పెద్దగా తెలియదు. ప్రధానికి వంటచేసే అవకాశం రావడంతో ఒక్కసారిగా యాదమ్మ ఫేమస్ అయింది.
ఆమె గురించి దేశవ్యాప్తంగా అనేకమంది ఆరా తీశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి బతుకుదెరువు కోసం కరీంనగర్‌లో వంటలు చేయడం నేర్చుకున్న యాదమ్మ గురించి చాలామంది తెలుసుకున్నారు. ఆమె వంటకాలు, రుచి, సుచి, తయారీ విధానం ఇలా అనేక అంశాలు మీడియా ద్వారా ప్రసారం అయ్యాయి. ప్రధాని నరేంద్రమోదీసైతం యాదమ్మ వంటలను మెచ్చుకోవడంతో ఖమ్మ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆమెకు మరో ఆఫర్ ఇచ్చారు. త్వరలో జరుగబోయే తన కూతురు పెళ్లికి వంటకాల కాంట్రాక్ట్ మొత్తం యాదమ్మకు అప్పగించారు.

3 లక్షల మందికి వంట..
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో 1,500 మంది వీఐపీలకు మాత్రమే వంట చేసిన యాదమ్మ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇచ్చిన ఆఫర్‌తో ఏకంగా 3 లక్షల మందికి వంట చేసే చాన్స్ కొట్టేసింది. ఇందులో వీవీఐపీలు, వీఐపీలు, సాధారణ ప్రజలు అందరూ ఉన్నారు. అందరినీ దృష్టిలో పెట్టుకుని వంటకాలు తయారు చేయాల్సి ఉంటుంది. పొంగులేటి కుమార్తె వివాహానికి ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డతోపాటు, తెలంగాణ, ఏపీకి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిదులు, పారిశ్రామిక వేత్తలు హాజరు కానున్నారు. వీరందరూ కూడా యాదమ్మ చేతి వంటకాలను రుచి చూడనున్నారు.
Also Read:Chikoti Praveen: చికోటి ప్రవీణ్ ఆ హీరోయిన్లను వాడుకున్నాడా?