వాణీదేవికి మరో వరం?.. కేసీఆర్‌‌ ఆలోచన కూడా అదేనా..

పూర్వం ఏదైనా వరం దొరకాలంటే మనులు, రుషులు ఎంతో తపస్సు చేసే వారని చదువుకుని ఉన్నాం. అలా దేవుడిని ప్రసన్నం చేసుకొని వరాలు పొందేవారని తెలుసుకున్నాం. కానీ.. రాజకీయాల్లో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమందికి కోరకుండానే వరాలు ఇస్తుంటారు. రాజకీయాల్లో మునిగితేలేవారు ఎన్నో ప్రయత్నాలు చేసి, పెద్దలను ప్రసన్నం చేసుకొని వరాలు అంటే పదవులు పొందుతూ ఉంటారు. రాజకీయాలతో సంబంధం లేని వారు.. ఇంట్లో కూర్చున్న వారు కొందరికి కూడా పదవులు వస్తాయి. […]

Written By: Srinivas, Updated On : March 22, 2021 3:39 pm
Follow us on


పూర్వం ఏదైనా వరం దొరకాలంటే మనులు, రుషులు ఎంతో తపస్సు చేసే వారని చదువుకుని ఉన్నాం. అలా దేవుడిని ప్రసన్నం చేసుకొని వరాలు పొందేవారని తెలుసుకున్నాం. కానీ.. రాజకీయాల్లో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమందికి కోరకుండానే వరాలు ఇస్తుంటారు. రాజకీయాల్లో మునిగితేలేవారు ఎన్నో ప్రయత్నాలు చేసి, పెద్దలను ప్రసన్నం చేసుకొని వరాలు అంటే పదవులు పొందుతూ ఉంటారు.

రాజకీయాలతో సంబంధం లేని వారు.. ఇంట్లో కూర్చున్న వారు కొందరికి కూడా పదవులు వస్తాయి. ప్రస్తుతం తెలంగాణలో ఇలాంటి వరం పొందిన వ్యక్తి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీ దేశి. కాంగ్రెస్ ను దెబ్బ కొట్టడానికి కేసీఆర్ పీవీ నరసింహారావును సొంతం చేసుకున్నారు. ఆయన శత జయంతి కేసీఆర్ కు కలిసి వచ్చింది. పీవీ నరసింహారావును కాంగ్రెస్ ఏనాడు గౌరవించలేదనే సంగతి ఆయనకు తెలుసు కదా. సోనియా గాంధీ పీవీని బతికున్నప్పుడు, మరణించాక కూడా అవమానించింది. ఈ విషయంలో కేసీఆర్ ప్రధాని మోదీని ఫాలో అయ్యారు.

కాంగ్రెస్ ను దెబ్బ తీయడానికి పటేల్ కు మోడీ ఎక్కడలేని గౌరవం ఇచ్చారు. సబర్మతి దగ్గర ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన పటేల్ ఉక్కు విగ్రహాన్ని నెలకొల్పారు. పటేల్ మోదీ ఒకే రాష్ట్రానికి చెందినవారు. ఇదే కథను కేసీఆర్ కాపీ కొట్టారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెలంగాణ బిడ్డ. తెలంగాణ బిడ్డను గౌరవించాలనేది ఒక పాయింటైతే పీకి అత్యంత గౌరవమిచ్చి కాంగ్రెస్ చేయలేని పని తాము చేశామని చెప్పడం ఇంకో పాయింట్. పీవీకి శత జయంతి ఉత్సవాల అధికారికంగా ఏడాది పొడవునా జరపాలని నిర్ణయించినప్పుడు కేసీఆర్ చాలా విషయాలు చెప్పారు. అవన్నీ అవుతాయా కావా అనేది చెప్పలేం. అప్పుడే వాణీదేవిని ఎమ్మెల్సీ చేస్తామని చెప్పారు. ఆమెను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేస్తారని అనుకున్నారు. కొందరు రాజ్యసభకు పంపుతారని అనుకున్నారు. కానీ.. కేసీఆర్ బీజేపీని దెబ్బతీయడానికి వాణీ దేవిని ఉపయోగించారు. ఆయన వ్యూహం, ప్రయత్నం ఫలించాయి. వాణీదేవిని ఎన్నికల్లో దింపి కేసీఆర్ ఆమెను బలిపశువును చేశారని ప్రతిపక్షాలు విమర్శించాయి.

ఇదిలా ఉంటే.. తదుపరి మంత్రి వర్గ విస్తరణలో వాణీ దేవిని కేబినెట్‌లోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. 2018లో రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్.. దాదాపు రెండు నెలలపాటు మంత్రివర్గమే లేకుండా పరిపాలన సాగించారు. ఆ తరువాత ఫిబ్రవరిలో తొలి విడత మంత్రి వర్గ విస్తరణ చేశారు. ఆ సమయంలో 10 మందిని తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. అప్పటికీ ఆరుగురు మంత్రులను నియమించాల్సి ఉండగా.. కొంతకాలం తరువాత ఆయా శాఖలకు కూడా మంత్రులను నియమించారు. మొత్తంగా ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ రెండు సార్లు మంత్రివర్గాన్ని విస్తరించారు. అయితే ఇటీవలి కాలంలో మళ్లీ మంత్రి వర్గాన్ని పునర్వ్యస్థీకరించే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది.

ప్రస్తుత మంత్రివర్గంలో ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలికి.. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అధినేత కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు కొందరు నాయకులు చెబుతున్నారు. ఆ కొత్త వారిలో సురభి వాణి దేవి కచ్చితంగా ఉంటారని టీఆర్ఎస్ శ్రేణులు బలంగా చెబుతున్నారు. కారణం.. విద్యావేత్త అయిన సురభి వాణీ దేవికి విద్యాశాఖ అప్పగిస్తారని, ఇప్పుడు ఆ శాఖ నిర్వహిస్తున్న సబితా ఇంద్రా రెడ్డికి గనుల శాఖ ఇస్తారని అంటున్నారు. మరి ఈ ప్రచారంపై కేసీఆర్‌‌ ఎలా స్పందిస్తారో చూడాలి.