Anil Ravipudi: కొత్త పార్టీ పెట్టబోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి… వివరాలు ఇవే!

ఎఫ్ 2తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. 2019 సంక్రాంతి కానుకగా విడుదలైన ఎఫ్ 2 మంచి విజయం సాధించింది. ఆ ఏడాది సంక్రాతి విన్నర్ గా నిలిచింది. ఎఫ్ 2 విజయం మహేష్ బాబు ఆఫర్ ఇచ్చేలా చేసింది.

Written By: NARESH, Updated On : November 17, 2023 4:22 pm

Anil Ravipudi

Follow us on

Anil Ravipudi: దర్శకుడు అనిల్ రావిపూడి పార్టీ పెడుతున్నాడట. అసెంబ్లీకి పార్లమెంట్ కి వెళతాడట. అనిల్ రావిపూడి వీడియో బైట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరు. డైలాగ్ రైటర్ గా పరిశ్రమలో అడుగుపెట్టిన అనిల్ రావిపూడి పటాస్ తో దర్శకుడు అవతారం ఎత్తాడు. కళ్యాణ్ రామ్ హీరోగా విడుదలైన పోలీస్ యాక్షన్ డ్రామా పటాస్ సూపర్ హిట్ కొట్టింది. దాంతో దర్శకుడిగా ఆఫర్స్ క్యూ కట్టాయి. సుప్రీమ్, రాజా ది గ్రేట్ ఓ మోస్తరు విజయాలు అందుకున్నాయి.

ఎఫ్ 2తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. 2019 సంక్రాంతి కానుకగా విడుదలైన ఎఫ్ 2 మంచి విజయం సాధించింది. ఆ ఏడాది సంక్రాతి విన్నర్ గా నిలిచింది. ఎఫ్ 2 విజయం మహేష్ బాబు ఆఫర్ ఇచ్చేలా చేసింది. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మరో భారీ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఎఫ్ 2కి సీక్వెల్ గా వచ్చిన ఎఫ్ 3 నిరాశపరిచింది. అయితే భగవంత్ కేసరి మరలా ఫార్మ్ లోకి వచ్చాడు.

దసరా కానుకగా విడుదలైన భగవంత్ కేసరి హిట్ టాక్ తెచ్చుకుంది. భారీ విజయం కాకున్నా ఓ మోస్తరు హిట్ కొట్టింది. భగవంత్ కేసరి సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న అనిల్ రావిపూడి కొత్త మూవీ ప్రకటిస్తాడు అందుకుంటే కొత్త పార్టీ ప్రకటించారు. ఆయన రాజకీయాల్లోకి రానున్నారట. ఓ పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తారట. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశాడు. తెల్ల చొక్కా, పంచె కట్టులో పొలిటీషియన్ అవతారం ఎత్తాడు.

మొన్నటి వరకు బాక్సాఫీస్ హిట్స్ ఇచ్చారు. ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ హిట్ ఇవ్వండి. కొత్త పార్టీ పెడుతున్నా… త్వరలో వివరాలు వెల్లడిస్తా అని సదరు వీడియోలో తెలిపాడు. టిస్ట్ ఏమిటంటే… నిజంగా ఆయన పార్టీ పెట్టడం లేదు. ఆహా లో త్వరలో ప్రసారం కానున్న కొత్త షోకి సంబంధించిన ప్రోమో అని తెలుస్తుంది. గతంలో అనిల్ రావిపూడి ఓ కామెడీ షోకి జడ్జిగా వ్యవహరించారు. ఇది ఆహాలో ప్రసారం అయ్యింది. ఆహా యాజమాన్యం పొలిటికల్ హీట్ నేపథ్యంలో సరికొత్త షో ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.