PRC: పీఆర్సీపై ఉద్యోగులు మరోమారు ఉద్యమించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు అల్టిమేటం జారీ చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా పీఆర్సీ ప్రకటన మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పీఆర్సీపై భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసేందుకు ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమవుతున్నారు. దీంతో పీఆర్సీ ప్రకటనపై ప్రభుత్వం కావాలనే తాత్సారం చేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పీఆర్సీ ప్రకటనపై కాలయాపన చేస్తుండటంతో పలు దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోతోంది. ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఉద్యోగ సంఘాల్లో ఆగ్రహం కలుగుతోంది. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపడం లేదని తెలుస్తోంది. ఫిట్ మెంట్ విషయంలో ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య సయోధ్య కుదరడం లేదు.
Also Read: అర్జున ఫల్గుణ’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. డిజాస్టర్లకే డిజాస్టర్
ప్రభుత్వం 14.29 శాతం ఫిట్ మెంట్ ఇస్తామని చెబుతున్నా అంత అయితే కుదరదని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. గతంలోనే 27 శాతం ఐఆర్ ప్రకటన ఇచ్చినా ప్రస్తుతం 45 శాతం ఇవ్వాలని పట్టుబడుతుండటంతో చిక్కుముడి వీడటం లేదు. తెలంగాణ 43 శాతం ఇవ్వడంతో కనీసం ఏపీ 45 శాతం ఇవ్వాలని డిమాండ్ పెరుగుతోంది. అయితే 30 శాతం ఫిట్ మెంట్ కూడా ఇవ్వడానికి ఏపీ ససేమిరా అనడం ఆశ్చర్యకరం.
సీఎం జగన్ స్వయంగా సమీక్షలు చేసినా ప్రయోజనం కనిపించడం లేదు. పీఆర్సీ ప్రకటనపై ఉద్యోగ సంఘాల్లో ఎదురుచూపులే తప్ప పరిష్కారం మాత్రం కానరావడం లేదు. దీంతో పీఆర్సీ ప్రకటన ఎప్పుడు ప్రకటిస్తుందోననే సందేహాలు ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి. మరోసారి ఉద్యమించేందుకు కూడా ఉద్యోగులు సిద్ధమైనట్లుతెలుస్తోంది.
Also Read: తెలుగులో చేస్తున్న తొలి సినిమాకే ఆ హీరోకి 32 కోట్లు !