https://oktelugu.com/

AP New Disticts: ఏపీలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఇవే.. 4వ తేదీ నుంచే అమలు.. ఫుల్ డీటైల్స్

AP New Disticts:  మార్పు ఎప్పుడూ మంచిదే. ఎప్పుడు చేసినా సంస్కరణలు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. ప్రజలకు పాలన చేరువ చేస్తాయి. అప్పుడు ఎప్పుడో తెలంగాణలో భూస్వాములు, దొరలకు మేలు చేసేలా ఉన్న ‘పటేల్ పట్వారీ’ వ్యవస్థను రద్దు చేసి ఎన్టీఆర్ మండలాలను ఏర్పాటు చేసి ఒక గొప్ప చరిత్రకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి విభజనలు లేనే లేవు. కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక కేసీఆర్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదే బాటలో జగన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 30, 2022 / 03:32 PM IST
    Follow us on

    AP New Disticts:  మార్పు ఎప్పుడూ మంచిదే. ఎప్పుడు చేసినా సంస్కరణలు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. ప్రజలకు పాలన చేరువ చేస్తాయి. అప్పుడు ఎప్పుడో తెలంగాణలో భూస్వాములు, దొరలకు మేలు చేసేలా ఉన్న ‘పటేల్ పట్వారీ’ వ్యవస్థను రద్దు చేసి ఎన్టీఆర్ మండలాలను ఏర్పాటు చేసి ఒక గొప్ప చరిత్రకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి విభజనలు లేనే లేవు. కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక కేసీఆర్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదే బాటలో జగన్ నడిచారు.

    AP New Disticts

    ఏపీ సీఎం జగన్ ఎన్నికల్లో ఇచ్చిన అతిపెద్ద హామీని నెరవేర్చేందుకు రంగం సిద్ధం చేశారు. తెలంగాణలో లాగానే ఏపీలోనూ కొత్త జిల్లాల ఏర్పాటు కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం కూడా ఖరారైంది. ఏప్రిల్ 4వ తేదీన ఉదయం 9.05 నుంచి 9.45 గంటల మధ్య కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

    -కొత్త జిల్లాలు ఇవే
    26 జిల్లాల ఏర్పాటుకు జగన్ ఆమోదం తెలిపారు. కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సారావుపేట, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, ఎన్టీఆర్ విజయవాడ జిల్లాలు అమల్లోకి రానున్నాయి.

    -కొత్త రెవెన్యూ డివిజన్లు ఇవే
    శ్రీకాళహస్తి, , కుప్పం, పలమనేరు, రాయచోటి, పుట్టపర్తి, ధర్మవరం, గుంతకల్, డోన్, ఆత్మకూరు, సత్తెనపల్లి, చీరాల, బాపట్ల, నందిగామ, తిరువూరు, ఉయ్యూరు, భీమవరం, కొత్తపేట, బీమిలి, చీపురుపల్లి, బొబ్బిలి, పలాస.

    Also Read: Anasuya Bharadwaj: వైరల్ : రకరకాలుగా అందాలను వెదజల్లుతున్న అనసూయ

    నిజానికి ఉగాది నాడే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని అనుకున్నారు.కానీ ఆ తర్వాత రెండురోజులకు ఈ కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్నాయి. ఇక వాటితోపాటు పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. ఏప్రిల్ 6న వలంటీర్ల సేవలకు సన్మాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేవారు. ఏప్రిల్ 8వ తేదీన ‘వసతి దీవెన’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

    కొత్త జిల్లాలపై ఇప్పటికే ప్రభుత్వం అభ్యంతరాలను ఆహ్వానించింది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, సూచనలు, సలహాలు , ఫిర్యాదులు అందించారు. పలు జిల్లాలు, జిల్లా కేంద్రాల పేర్లు మార్పు, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపైనా చర్చించారు. ఈ క్రమంలోనే జగన్ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన వివరాలను సీఎస్ సహా ఉన్నతాధికారులు తాజాగా సీఎం జగన్ కు అందించారు.

    ఏపీలో కొత్త జిల్లాలపై 16600 సలహాలు, అభ్యంతరాలు వచ్చాయి. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా జిల్లాల ఏర్పాటులో మార్పులు చేసినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అందరితో చర్చించి, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని జిల్లా కలెక్టర్లు సిఫార్సు చేసినట్లు తెలిపారు.

    ఇక కొత్త జిల్లాలకు కలెక్టరేట్ల ఎంపిక కోసం స్థలం ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని, కనీసం 15 ఎకరాల స్థలం ఉండేలా చూసుకోవాలని సీఎం జగన్ దిశానిర్ధేశం చేశారు. జిల్లా కలెక్టరేట్ సహా అన్ని కార్యాలయాలు ఒకే సముదాయంలో ఉండేలా కొత్త కలెక్టర్లరేట్లు ఉండాలని సూచించారు. ప్రస్తుతం అద్దె భవనాల్లో ప్రారంభించి అనంతరం కొత్త భవనాలకు మార్చాలని తెలిపారు.

    Also Read: Uniform Secretariat Employees: జగన్ చెప్పినదేమిటి? చేస్తున్నదేమిటి? సచివాలయ ఉద్యోగులకు తీరని వ్యథ