AP Govt vs Tollywood: కాలుకు వేస్తే మెడకు.. మెడకు వేస్తే కాలుకు పెడుతున్నాడు సీఎం జగన్ సారూ.. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దేవుడు(హైకోర్టు) వరమిచ్చినా పూజారి(సీఎం జగన్) ఇప్పుడు సినిమా టిక్కెట్ల విషయంలో ‘తగ్గేదేలే’ అన్నట్టుగా వ్యవహరించడం సినీ జనాలకు మింగుడు పడని వ్యవహారంగా మారింది. ఏపీలో సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 35ను హైకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం అప్పీల్ కు వెళితే హైకోర్టు ట్విస్ట్ ఇచ్చింది.
తాజాగా హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో సినిమా టికెట్ల తగ్గింపు జీవో నంబర్ 35 అమల్లో ఉందని పేర్కొన్నారు.కేవలం హైకోర్టు పిటీషన్ వేసిన వారికి మాత్రమే టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు ఇచ్చిందని వివరించారు. వారు మినహా మిగిలిన అన్ని థియేటర్లలోనూ జీవో నంబర్ 35 అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. పైగా టికెట్ ధరలపై ఎలాంటి కమిటీలు అవసరం లేదని ఏపీ సర్కార్ ట్విస్ట్ ఇచ్చింది.
Also Read: “పుష్ప” మూవీ కారణంగా హిందూపురంలో ఉద్రిక్తత… కారణం అదేనా
హైకోర్టులో మూడు రిట్ పిటీషన్ల దాఖలు చేసిన తెనాలిలో నాలుగు థియేటర్లు, చోడవరంలో ఒక థియేటర్ కు పాత పద్ధతిలోనే టిక్కెట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాలోని 225 థియేటర్స్ కు ఈ తీర్పు వర్తిస్తుంది.
ఇవి కాకుండా ఏపీలోని మిగితా ఆయా జిల్లాల్లోని థియేటర్లకు జీవోనంబర్ 35 వర్తించనుంది. అంటే అక్కడ టికెట్ రేట్లు తగ్గించాల్సిందే. పెంచడానికి వీల్లేదు. బెనిఫెట్ షోలు లేవు. అంటే కేవలం పిటీషన్లు వేసిన వారికి మాత్రమే కొన్ని థియేటర్లకు మినహాయింపు ఇచ్చి ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ కు గట్టి షాక్ ఇచ్చినట్టైంది. జగ‘న్నాటకా’నికి టాలీవుడ్ అవాక్కైంది.
Also Read: టికెట్ రేట్లపై నేడే విచారణ.. జగన్ సర్కార్ పంతం నెగ్గుతుందా..?