Mahua Moitra: మోదీ చీటింగ్‌.. ఏపీ ప్రజలూ గ్రహించండి.. పార్లమెంట్‌లో నిప్పులు చెరిగిన లేడీ∙సింగం!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రెండు నెలలైంది. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అధికార వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ఏపీలోని ఎన్డీ సర్కార్‌ కోట్ల రూపాయలు అప్పులు చేసింది.

Written By: Raj Shekar, Updated On : August 7, 2024 10:48 am

Mahua Moitra

Follow us on

Mahua Moitra: దేశంలో లోక్‌సభ ఎన్నికలతోపాటే ఏపీ అసెంబ్లీకి మే నెలలో ఎన్నికలు జరిగాయి. జూన్‌ 3న వెల్లడైన ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అధికార వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది, దీంతో ఏపీ సీఎంగా నారా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టారు. పవన్‌ కళ్యాణ్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యలు స్వీకరించారు. ఎన్డీఏ కొలువుదీరి రెండు నెలలైంది. ఈ రెండు నెలల్లో చంద్రబాబు గత ప్రభుత్వ వైపల్యాలను ఎండగట్టడంతోనే గడిపేశారు. కనీసం పూర్తిస్థాయి బడ్జెట్‌ కూడా పెట్టే సాహసం చేయలేదు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌నే పొడిగించారు. ఈ క్రమంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు కేటాయించింది. కోఆపరేటివ్‌ సంస్థల ద్వారా రుణం ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే మరో మిత్ర పక్షం జేడీఎస్‌ అధికారంలో ఉన్న బిహార్‌కు 25 వేల కోట్లు కేటాయించింది. దీనిపై పార్లమెంటులో విపక్షాలు నిరసన తెలిపాయి. బడ్జెట్‌ ప్రవేశపెట్టి పక్షం రోజులైనా విమర్శల సునామీ తగ్గట్లేదు. ఇండియా కూటమి అంత సులభంగా వదిలేలా కనిపించట్లేదు. లైఫ్, మెడికల్‌ ఇన్సూరెన్స్, ప్రీమియం చెల్లింపులపై 18 శాతం జీఎస్టీని ఎత్తివేయాలంటూ లోక్‌సభలో ఆవరణలో ఇదివరకే ధర్నాకు దిగారు కూటమి నాయకులు. దీన్ని మరింత ఉధృతం చేయనున్నారు. ఇదే సమయంలో లోక్‌సభలో తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యురాలు మహువా మొయిత్రా కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. వేతన జీవులు, మధ్యతరగతివర్గాల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కాదంటూ నిప్పులు చెరిగారు. కార్పొరేట్‌ కంపెనీలకు అనుకూలంగా రూపొందించారంటూ మండిపడ్డారు.

రూ.15 వేల కోట్లు అప్పే..
ఇక ఈ బడ్జెట్‌లో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించారు. కానీ, ఇది మొత్తం అప్పేనని మహువా మొయిత్రా తేల్చి చెప్పారు. రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన భారం ఏపీ ప్రజలపైనే ఉందని పేర్కొన్నారు. ఒక్క రూపాయి కూడా గ్రాంట్‌గా ఇవ్వలేదని స్పష్టం చేశారు. వివిధ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఆ మొత్తాన్ని రుణంగా పొందేలా మాత్రమే సహకరిస్తామని బడ్జెట్‌లో పొందుపర్చారని పేర్కొన్నారు. ఇక వెనుకబడిన జిల్లాలైన రాయలసీమ, ప్రకాశం, ఉత్తర–కోస్తాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి గ్రాంట్‌ ఇస్తామని ప్రతిపాదించడాన్ని స్వీపింగ్‌ స్టేట్‌మెంట్‌గా అభివర్ణించారు మహువా మొయిత్రా. ఇందులో కూడా అబద్ధాలే ఉన్నాయని, ఏపీకి ఒక్క రూపాయి కూడా గ్రాంట్‌గా ఇవ్వలేదని తేల్చి చెప్పారు.

ఏపీలో సంబురాలు..
ఇదిలా ఉంటే.. ఏపీకి రూ.15 వేల కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాధించడంతో ఏపీలో అధికార ఏన్డీఏలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సంబురాలు చేసుకున్నారు. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. లోక్‌సభలో 12 ఎంపీ సీట్లు ఉన్న జేడీఎస్‌ అధికారంలో ఉన్న బిహార్‌కు రూ.25 వేల కోట్లు గ్రాంట్‌ కేటాయించిన కేంద్రం, 16 ఎంపీలు ఉన్న టీడీపీ అధికారంలో ఉన్న ఏపీకి మాత్రం రూ.15 వేల కోట్లు అదికూడా అప్పుగా ఇవ్డం గమనార్హం. దీనికే కూటమి నేతలు సంబురాలు చేసుకోవడం ఏపీ ప్రజలు గమనించాల్సి అంశం. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన రెండ నెలల్లోనే చంద్రబాబు సర్కార్‌ దాదాపు 20 వేల కోట్ల రూపాయల అప్పు చేసింది. సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. మళ్లీ అప్పులు తెచ్చి జీతాలు చెల్లిస్తున్నారు. దీనిపై విపక్ష వైసీపీ మండిపడుతోంది. ప్రజలు ఎన్డీఏ మోసాలను గమనించాలని కోరుతోంది. రాష్ట్రంలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ ఏపీ ప్రజలను చీటింగ్‌ చేస్తున్నారని ఆరోపిస్తోంది.