భూముల వేలానికి ఆర్థిక ఇబ్బందులే కారణమా..!

రాష్ట్ర ప్రభుత్వం నిధుల కోసం అర్రులు చాస్తోంది. కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా మార్చి 22 నుంచి లాక్ డౌన్ అమలులో ఉండటంతో రాష్ట్రానికి ఆదాయం 70 శాతం వరకూ తగ్గినట్లు ఓ అంచనా. మరోవైపు సంక్షేమ పథకాలకు వేల కోట్లు వెచ్చించాల్సి రావడం, మరోవైపు లోటు బడ్జెట్ కారణంగా ప్రభుత్వానికి ఆర్ధిక సమస్యలు ప్రారంభమైయ్యాయి. దీంతో రాష్ట్రంలోని విలువైన భూములను విక్రయించేందుకు సిద్ధమైంది. తొలివిడతగా విశాఖ, గుంటూరులో ఉన్న 9 ప్రాంతాల్లో ఉన్న భూములను […]

Written By: Neelambaram, Updated On : May 14, 2020 12:13 pm
Follow us on

రాష్ట్ర ప్రభుత్వం నిధుల కోసం అర్రులు చాస్తోంది. కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా మార్చి 22 నుంచి లాక్ డౌన్ అమలులో ఉండటంతో రాష్ట్రానికి ఆదాయం 70 శాతం వరకూ తగ్గినట్లు ఓ అంచనా. మరోవైపు సంక్షేమ పథకాలకు వేల కోట్లు వెచ్చించాల్సి రావడం, మరోవైపు లోటు బడ్జెట్ కారణంగా ప్రభుత్వానికి ఆర్ధిక సమస్యలు ప్రారంభమైయ్యాయి. దీంతో రాష్ట్రంలోని విలువైన భూములను విక్రయించేందుకు సిద్ధమైంది. తొలివిడతగా విశాఖ, గుంటూరులో ఉన్న 9 ప్రాంతాల్లో ఉన్న భూములను విక్రయించడంతో రూ. 300 కోట్లు విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. భూముల ఇ-వేలం ప్రక్రియ బిల్డ్‌ ఏపీ మిషన్ ఆధ్వర్యంలో జరగనుంది.

వేలం వేసే భూముల వివరాలు (విశాఖ):

చిన గడ్లీ- 1 ఎకరం
రిజర్వ్ ధర: రూ. 16.64 కోట్లు.

చినగడ్లీ- 75 సెంట్లు.
రిజర్వ్ ధర: రూ. 14.47 కోట్లు.

అగనంపూడి- 50 సెంట్లు
రిజర్వ్ ధర: రూ. 3.25 కోట్లు.

ఫకీర్ టకియా ఎస్ఈజెడ్- 1.04 ఎకరాలు
రిజర్వ్ ధర: రూ. 4.67 కోట్లు

ఫకీర్ టకియా ఎస్ఈజెడ్- 35 సెంట్లు.
రిజర్వ్ ధర: రూ. 1.47 కోట్లు

ఫకీర్ టకియా ఎస్ఈజెడ్- 1.93 ఎకరాలు
రిజర్వ్ ధర: రూ. 8.39 కోట్లు

వేలం వేసే భూముల వివరాలు (గుంటూరు):

నల్లపాడు- 6.07 ఎకరాలు
రిజర్వ్ ధర: రూ. 16. 96 కోట్లు.

శ్రీనగర్ కాలనీ- 5.44 ఎకరాలు
రిజర్వ్ ధర: రూ. 75.41 కోట్లు.

మెయిన్ జీటీ రోడ్- 1.72 ఎకరాలు
రిజర్వ్ ధర: రూ. 67.36 కోట్లు.