భారత ఉపఖండంలో వెలిసిన ఆయుర్వేదం ఒక ప్రాచీన భారతీయ వైద్య విధానం. భారతదేశంలో 5000 సంవత్సరాలకు పూర్వం నుంచే మొదలైందని చరిత్ర చెబుతోంది. ‘ఆయుర్వేదం’ అనే మాట ‘ఆయు:’ అంటే ‘జీవితం’ .. ‘వేద’ అంటే శాస్త్రం (సైన్స్) అనే రెండు సంస్కృత పదాల సంయోగం నుంచి పుట్టింది. ఆయుర్వేద అంటే అక్షరాల ‘జీవితం యొక్క శాస్త్రం’ అని అర్థం. ఇతర వైద్య విధానాల లాగా కాకుండా ఆయుర్వేదం తీసుకుంటే అస్సలు సైడ్ ఎఫెక్ట్ లు ఉండవు. ఆయుర్వేద చికిత్సతో ఆరోగ్యకరమైన జీవనం మీ సొంతం అవుతుంది. ఇప్పుడు కరోనా నుంచి అల్లోపతి మందులు, స్టెరాయిడ్లలో కోలుకున్నాక సైడ్ ఎఫెక్ట్ లైన బ్లాక్ ఫంగస్ లు, గుండెపోటులు వచ్చి పోతున్నారు. కానీ మన ఆయుర్వేదంతో అలాంటివి ఏవీ రావు. మనకు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆయుర్వేదం ఇస్తుంది. ఆయర్వేదంలోని భావన ఏమిటంటే ఇది కోలుకొని.. ఉపశమనాన్ని పొందే ప్రక్రియగా మన శాస్త్రాలు చెబుతున్నాయి.
ఆయుర్వేద అనేది శరీరంలోని నాలుగు ప్రధాన అంశాలతో రూపొందించబడి ఉంటుంది. దోషం, ధాతువు, మలం, అగ్ని ఆయుర్వేదంలో ఈ నాలుగు ప్రధాన అంశాలపైనే వైద్యం నడుస్తుంది. ఏపీలో వెలుగుచూసిన ఆనందయ్య మందు వల్ల కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేవని.. ఈ మందు వాడవచ్చని ఏకంగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీన్ని బట్టి ఆయుర్వేద మందు ఘనతను, ఆనందయ్య గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంత మంది వైద్యులు, దేశంలో ప్రపంచవ్యాప్తంగా కరోనాను నియంత్రించలేని ఈరోజుల్లో ఆనందయ్య ఉచితంగా ఇస్తున్న మందు కరోనాను తగ్గిస్తోంది. దీన్ని బట్టి ఆయుర్వేదానికి మన ఆనందయ్య ఊపిరిలూదినట్టే.. భారత్ కు , ప్రపంచానికి ఒక గొప్ప హీరోగా నిలిచినట్టే..
చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా రక్కసి తన రూపు మార్చుకుంటూ రూపాంతరం చెందిన వేరియంట్ ల పేరిట వివిధ దేశాలపై విరుచుకుపడుతోంది. కరోనాకు ప్రపంచవ్యాప్తంగా అస్సలు సూటి మందులు లేవు. ఇక నివారణ లేని దీనికి టీకానే ముందస్తు భద్రత. ఆ టీకాలు వేసుకుందామంటే మార్కెట్లో అసలు లేనే లేవు.దీంతో కరోనా ధాటికి ప్రజల ప్రాణాలు పోతున్నాయి.
అల్లోపతి, నేటి ఆధునిక వైద్యం కరోనా బారి నుంచి ప్రజలను కాపాడలేకపోతోంది. ఇంత టెక్నాలజీ, ఇన్ని అల్లోపతి మందులు ఉండి కూడా పేరుపొందిన వైద్యులు, శాస్త్ర సాంకేతిక కరోనాను తగ్గించలేకపోతోంది. కానీ మన సనాతన ఆయుర్వేద వైద్యం మరోసారి ఘనత చాటింది. మన శాస్త్రాలు, గ్రంథాలు ఇంతటి భయంకర మహమ్మారిని తగ్గించగలవని ఆనందయ్య నిరూపించాడు. ‘7th సెన్స్’ సినిమాలో బోధి ధర్మ ఆయుర్వేదంతో తగ్గించిన ఈ కరోనా లాంటి రోగాన్ని ఆనందయ్య అదే వైద్యంతో తగ్గించగలగడం దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఈ వైద్యులు, కార్పొరేట్ ఆస్పత్రులు, అల్లోపతి వైద్యానికి చెంపపెట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య రూపొందించిన కరోనా నివారణ మందుతో చాలా మంది రోగులకు నయం అయిపోయింది. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఇక్కడికి ఒక్కరోజులో 60వేల మంది బాధితులు వచ్చారు. ఇక ఆస్పత్రుల నుంచి తప్పించుకొని మరీ కృష్ణపట్నంలో ఆనందయ్య వద్దకు వచ్చారు. శాంతి భద్రతల సమస్యలు రావడంతో పోలీసులు ఆనందయ్య మందును ఆపు చేయించారు. ఆనందయ్య మందు వేసుకొని 5 లేదా 10 నిమిషాల్లోనే లేచి కూర్చున్నారు. మన సంప్రదాయ ఆయుర్వేద వైద్యానికి ఎంత శక్తి ఉందో ఆనందయ్య నిరూపించారు. అదీకాకుండా ఈ వ్యాక్సిన్ ఫార్ములా అంటే ఏ దేశానికి ఇవ్వని కార్పొరేట్ టీకా కంపెనీలకు భిన్నంగా ప్రజలకు ఉచితంగా ఆయుర్వేద మందు పంపిణీ చేసిన ఆనందయ్య ప్రజల దృష్టిలో మహానుభావుడిగా మారిపోయాడు.
ఏదైతేనేమీ.. కరోనా కల్లోలంలో అల్లోపతి మందులు తగ్గించలేని ఆ మహమ్మారి రోగాన్ని ఆనందయ్య ఆయుర్వేద మందు తగ్గిస్తోంది. దీనిపై మెడికల్ మాఫియా, పలు చానెల్స్ ఎంత దుష్ప్రచారం చేసినా మన సంప్రదాయ వన మూలికల ఔషధాన్ని భారత ప్రభుత్వం గుర్తించింది. ఇటీవలే ఆనందయ్య మందు పంపిణీకి ఓకే చెప్పింది. ఈ పరిణామం ఆనందయ్యకు మద్దతుగా నిలిచిన ఎంతో మందికి ఊరటనిచ్చింది. కేంద్రం, ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుంచి సంతోషం వ్యక్తమవుతుండగా.. అల్లోపతి, మెడికల్ మాఫియా మాత్రం రగిలిపోతోంది.
-ఆనందయ్య మందు ఫార్ములా
ఆనందయ్య తయారు చేసిన మందును మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చని ఆయన చెబుతున్నారు. ఆయన ఫార్ములాను బయటకు చెప్పిన గొప్ప వైద్యుడిగా నిలిచిపోయాడు. కరోనా టీకా రూపొందించిన కంపెనీలు వ్యాక్సిన్ ఫార్ములా ఇతర కంపెనీలకు ఇవ్వకుండా ప్రజలకు వ్యాక్సిన్లు చేరకుండా కుట్ర పన్నుతున్న పరిస్థితి నెలకొంది. కానీ ఆనందయ్య నిస్వార్థంగా తను తయారు చేసే మందు ఫార్ములాను కూడా ప్రజలకు చెప్పిన గొప్ప మనిషిగా నిలిచిపోయాడు.
ఆనందయ్య కరోనా నివారణ మందులో వాడే పదార్థాలివీ.. తాటి బెల్లం 100 గ్రాములు, తిప్పతీగ ఆకు 4 గ్రాములు, కుప్పిటాకు 20 గ్రాములు, నేల ఉసిరి ఆకు 10 గ్రాములు.. పసుపు 10 గ్రాములు, నల్లజీలకర్ర 20 గ్రాములు, జాజికాయ 20 గ్రాములు, తోక మిరియాలు 50 గ్రాములు, పిప్పిలి 20 గ్రాములు, దాల్చిన చెక్క 30 గ్రాములు, అల్లం, శోంఠి 50 గ్రాములు ఇలాంటి వనమూలికలతో ఇంట్లోనే స్వయంగా మందు తయారు చేసుకోవచ్చునని ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తెలిపారు.
ఆంగ్లవైద్యంలో పాముకాటుచికిత్సకి ఎంత ఖర్చు అవుతుంది? ఆ మందు అదిలాబాద్ లోని మారుమూల తాండా ఆసుపత్రిలో ఉందా? ఆంధ్రా ఉత్తరాంధ్ర, గిరిజన, రెడ్డిసీమలో పాములు ఎక్కువగా ఉంటాయి. ఎన్ని వైద్యశాలల్లో పాముకాటులకు ఆంగ్లమందు అందుబాటులో ఉందో తెలుసుకోండి. వారంతా కంట్లో వేసే ఆకు పసర్లతోనే పాముకాటు నుంచి రక్షణ పొందుతున్నారు. పాము కరిస్తే చనిపోవడం లేదు. అంతటి మహత్తు మన ఆయుర్వేద వనమూలికల్లో ఉంది. దాన్ని గుర్తించి వాడితే ఇలాంటి వంద కరోనాలను కూడా తరిమికొట్టవచ్చు. దానికి కావాల్సిందన్నా మన ఆనందయ్యలాంటి సంప్రదాయ వైద్యులను ఈ మెడికల్ మాఫియా , న్యూస్ చానెళ్ల నుంచి కాపాడుకోవడమే..
-నరేశ్ ఎన్నం