https://oktelugu.com/

CPI Narayana Comments On Chiranjeevi : నారాయణ.. నారాయణ.. ఏమీ నీ దిగజారుడు మాటలయ్యా!

Analysisi On CPI Narayana Comments On Chiranjeevi  : సీపీఐ నారాయణ.. ఇంత దిగజారుడు మాటలు మాట్లాడుతాడని అనుకోలేదు. అదీ ఒక వివాదరహిత.. అందరివాడుగా ఉన్న చిరంజీవి గురించి.. ఎందుకంటే తిరుపతిలో నారాయణ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడో తెలియదు. ఎప్పుడో జరిగిన భీమవరం సమావేశం గురించి మాట్లాడారు. ఒక రాజకీయ నాయకుడిగా సూపర్ స్టార్ కృష్ణను పిలవలేదనడం కరెక్టే. చిరంజీవి కూడా ఈ విషయంలో అభ్యంతరం పెట్టరు. దాన్ని అడ్డం పెట్టుకొని సంబంధం లేని […]

Written By:
  • NARESH
  • , Updated On : July 20, 2022 / 02:47 PM IST
    Follow us on

    Analysisi On CPI Narayana Comments On Chiranjeevi  : సీపీఐ నారాయణ.. ఇంత దిగజారుడు మాటలు మాట్లాడుతాడని అనుకోలేదు. అదీ ఒక వివాదరహిత.. అందరివాడుగా ఉన్న చిరంజీవి గురించి.. ఎందుకంటే తిరుపతిలో నారాయణ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడో తెలియదు. ఎప్పుడో జరిగిన భీమవరం సమావేశం గురించి మాట్లాడారు. ఒక రాజకీయ నాయకుడిగా సూపర్ స్టార్ కృష్ణను పిలవలేదనడం కరెక్టే. చిరంజీవి కూడా ఈ విషయంలో అభ్యంతరం పెట్టరు.

    దాన్ని అడ్డం పెట్టుకొని సంబంధం లేని చిరంజీవి, పవన్ కళ్యాణ్ ను తిట్టడం ఎంత వరకూ కరెక్టో అర్థం కావడం లేదు. ఎందుకంటే పిలిచేది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. సంబంధం లేని చిరంజీవి, పవన్ ను వ్యక్తిగతంగా తిట్టడం ఏంటన్నది ఇక్కడ ప్రశ్న..

    చిల్లర బేరగాడు.. ఊసరవెళ్లి, బ్రోకర్ అంటూ చిరంజీవిపై మాట్లాడడం చూస్తే నారాయణకు మతి పోయిందని చెప్పకతప్పదు. సీపీఐ జాతీయ కార్యదర్శి అయ్యిండి ఇలా వ్యక్తిగతంగా ఇలా మాట్లాడడం హోదాకు తగదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

    సీపీఐ నారాయణ జాతీయ కార్యదర్శిగా కాకుండా గల్లీ కార్యదర్శిగా విమర్శించాడని చెప్పొచ్చు. చిరంజీవి అసలు రాజకీయాల్లోనే లేడు. సినీ పరిశ్రమకు పెద్దదిక్కు. ఎలాంటి వివాదాలు లేని చిరంజీవిపై ఇంతటి అవమానకరంగా.. జుగుప్సాకరంగా మాట్లాడాలని ఎలా అనిపించింది నారాయణ నీకు అని అందరూ దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతోటి సీపీఐపై ప్రజల్లో మరింతగా ప్రతిష్ట దిగజారిపోయింది. దీనిపై నారాయణ ఆత్మవిమర్శ చేసుకోవాలి. నారాయణ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింద చూడొచ్చు..