Analysis on YCP vs Janasena : జనసేనాని పవన్ కళ్యాణ్ చింతలపూడి పర్యటన తర్వాత ఏపీ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. ఏపీ మంత్రులు ఎప్పటిలాగానే బూతులతో విరుచుకుపడ్డారు. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే? పవన్ కళ్యాణ్ మాత్రం ఇక్కడ రెచ్చిపోలేదు. పవన్ కళ్యాణ్ కేవలం సమస్యల మీదనే మాట్లాడారు. ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. నేను వైసీపీ మంత్రులను, జగన్ పై వ్యక్తిగతంగా మాట్లాడను అని పవన్ స్పష్టం చేశారు.
Analysis on YCP vs Janasena
కానీ ఏపీ వైసీపీ మంత్రులు మాత్రం రెచ్చిపోయి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఈసారి ఏం మాట్లాడకపోయినా నెటిజన్లు మాత్రం వైసీపీని ఉతికి ఆరేశారు. జగన్ ను, వైసీపీ మంత్రుల మీద.. షర్మిల ఎందుకు బయటకు వెళ్లింది..? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించారు.
Also Read: Chiranjeevi-Balakrishna: చిరంజీవి-బాలయ్య మల్టీస్టారర్ మూవీ మధ్యలోనే ఎందుకు ఆగిపోయిందో తెలుసా?
ఏపీ మంత్రుల వ్యక్తిగత భాగోతాలు.. వ్యవహారాలు అన్నింటిని నెటిజన్లు బయటపెట్టేశారు. ఇవాళ వైసీపీ మంత్రులకు ప్రజలు, నెటిజన్లే ప్రత్యర్థులుగా మారారు. పవన్ ను వ్యక్తిగతంగా తిడితే వైసీపీ మంత్రులకు నెటిజన్లే శత్రువులుగా మారి ఇలా ఎండగట్టారు..
జనసేనతో పెట్టుకుంటే వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ మంత్రులకు మూడుతుందని దీన్ని బట్టి అర్థమైంది. జనసైనికుల ప్రతిస్పందనతో అవాక్కైన వైసీపీ ఇప్పుడు దెబ్బకు సెట్ రైట్ అయ్యిందనే చెప్పాలి. ఈ రేంజ్ ప్రతిస్పందన వస్తుందని తెలియక ఇప్పటికైనా వైసీపీ నేతల నోళ్లు మూతపడుతాయా? లేదా? అన్నది వేచిచూడాలి. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియో లో చూడొచ్చు..
Also Read: CM Jagan: జగన్ సేఫ్.. డేంజర్ లో వైసీపీ ఎమ్మెల్యేలా?