Telangana Politics : తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. బీజేపీకి అనుకూల వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ మీద తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలో తేలింది. అయితే ఇవి రెండుగా విభజించబడ్డాయి. ఒకవైపు బీజేపీ.. రెండో వైపు కాంగ్రెస్. తెలంగాణలో ముక్కోణపు పోటీ ఉంటే టీఆర్ఎస్ గెలుస్తుందన్నది ఎక్కువమంది అంచనా వేస్తున్నారు.
కాకపోతే ఇప్పుడు ఎందుకు మారుతుందంటే.. కాంగ్రెస్, బీజేపీకి సమాన దూరం పాటిస్తానని చెబుతున్న టీఆర్ఎస్ పూర్తిగా కాంగ్రెస్ వైపు మరలిపోయింది. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చింది. దీంతో జాతీయ స్తాయిలో కాంగ్రెస్ కు బీటీంగా టీఆర్ఎస్ మారుతుంది. బీజేపీకి ఎట్టి పరిస్తితుల్లో మారే అవకాశాలు కనిపించడం లేదు.
తెలంగాణలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నా.. మారిన జాతీయ పరిణామాల్లో బీజేపీని శత్రువుగా టీఆర్ఎస్ భావిస్తోంది. సో కాంగ్రెస్ తో మిత్రుత్వం తప్ప మరో ఆలోచన లేదు. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా అవసరమైతే కాంగ్రెస్ తో కలవడానికి టీఆర్ఎస్ సిద్ధపడుతుందని రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ స్టాండ్ ను బట్టి తెలుస్తోంది.
కాంగ్రెస్, బీజేపీలు శత్రువులని భావిస్తే రాష్ట్రపతి ఎన్నికలను బాయ్ కాట్ చేయాల్సి ఉండేది. కానీ టీఆర్ఎస్ అలా చేయలేదు. దీన్ని బట్టి కాంగ్రెస్ కు టీఆర్ఎస్ మద్దతు ఉంటుందని తేలిపోయింది. బీజేపీతో ఫైట్ లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడానికి వెనుకాడరని తేలిపోయింది. ఈ రాష్ట్రపతి ఎన్నికలతో టీఆర్ఎస్ బీజేపీతో కుమ్మక్కైందని చెప్పడానికి ఆస్కారం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మారుతున్న రాజకీయంపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..